దర్శనానికి వెళ్ళినప్పుడు, పూజ చేసేటప్పుడు లేదా దీక్ష సమయంలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి? ఈ సమయంలో మంత్రాలు చదువుకోవచ్చా?
ఒక్కోసారి మనం ఆలయానికి వెళ్ళినప్పుడు లేదంటే ఇంట్లోనే పూజ చేసుకునే సమయంలో పీరియడ్స్ రావచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.

చాలామంది ఆడవాళ్ళల్లో ఉండే ప్రశ్న ఏంటంటే, నెలసరి సమయంలో ఆలయాలకు వెళ్లకూడదు కదా? అలాంటప్పుడు ఆలయంలోనే పీరియడ్స్ వస్తే ఏం చేయాలి?, ఇంట్లో పూజ చేసేటప్పుడు పీరియడ్స్ వస్తే ఏం చేయాలి అనే సందేహాలు ఉన్నాయి.
ఈ సందేహం మీకు కూడా ఉందా? అయితే, వెంటనే సమాధానాలు తెలుసుకుందాం. ఒక్కోసారి మనం ఆలయానికి వెళ్ళినప్పుడు లేదంటే ఇంట్లోనే పూజ చేసుకునే సమయంలో పీరియడ్స్ రావచ్చు. అలాంటప్పుడు ఏం చేయాలి? ఈ విషయాలను ఇప్పుడే తెలుసుకుందాం.
పూజ చేసేటప్పుడు లేదా దీక్ష సమయంలో
కొంతమంది స్త్రీలు ఏదైనా దీక్ష చేస్తూ ఉంటారు. దీక్ష సమయంలో నెలసరి అయినప్పుడు ముందు ఎన్ని రోజులు చేశారో వాటిని గుర్తుపెట్టుకుని, నెలసరి అయిపోయిన తర్వాత అంటే ఐదవ రోజు నుంచి మీరు మళ్లీ దీక్షని యధావిధిగా కొనసాగించొచ్చు. దీక్షని మళ్లీ మొదటి నుంచి మొదలు పెట్టక్కర్లేదు. దానిని కొనసాగించవచ్చు. దాని వలన దీక్ష ఫలితం మీకు అందుతుంది. ఏ దోషం ఉండదు.
కొంతమంది సప్తాహ పారాయణం వంటివి చేస్తూ ఉంటారు. వాటిని చేసేటప్పుడు కచ్చితంగా పూర్తి చేయాలి. మధ్యలో వదిలిపెడితే మళ్లీ మొదటి నుంచి చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీ నెలసరి సమయం చూసుకొని దాని ప్రకారం మీరు పారాయణ చేయడం మంచిది.
సత్యనారాయణ వ్రతం లేదంటే పూజ సమయంలో, పీటల మీద కూర్చున్న సమయంలో నెలసరి వచ్చిందంటే మధ్యలోనే వదిలిపెట్టి, అక్కడ నుంచి వెళ్లిపోవాలి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా పూర్తి చేయకూడదు.
నెలసరి సమయంలో మంత్రాలు, స్తోత్రాలు చదవచ్చా?
చాలామంది నెలసరి సమయంలో మంత్రాలు, శ్లోకాలు, స్తోత్రాలు వంటివి చదువుతూ ఉంటారు. నిజానికి నెలసరి సమయంలో వీటిని కూడా చదవకూడదు. కావాలనుకుంటే కాసేపు కూర్చుని ధ్యానం చేసుకోవచ్చు.
ఆలయంలో పీరియడ్స్ వస్తే ఏం చేయాలి?
ఆలయంలో పీరియడ్స్ వచ్చినట్లయితే దర్శనానికి వెళ్లకుండా ఇంటికి తిరిగి వచ్చేయాలి. పీరియడ్స్ వచ్చినా ఆలయానికి వెళ్లడం వలన దోషాలు కలుగుతాయి.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.