Raksha bandhan 2024: రక్షాబంధన్ రోజున ఏం చేయాలి, ఏం చేయకూడదు? ముఖ్యమైన నియమాలను తెలుసుకోండి
Raksha bandhan 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రక్షా బంధన్ రోజున సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు శుభ, అశుభ సమయంతో పాటు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి. ఎలా కట్టాలి? ఏ సమయంలో కట్టాలి. రాఖీ కట్టేటప్పుడు చేయాల్సిన, చేయకూడని పనులు ఏంటో తెలుసుకోవాలి. రాఖీ కట్టే నియమాలను గురించి ఇక్కడ చదవండి.
Raksha bandhan 2024: రక్షా బంధన్ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య విడదీయరాని ప్రేమకు చిహ్నంగా పరిగణిస్తారు. పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం ఆగస్ట్ 19, 2024న సర్వార్థ సిద్ధి యోగం, రవి యోగంతో సహా చాలా పవిత్రమైన యోగాలలో రక్షాబంధన్ పండుగను జరుపుకుంటారు.
రాఖీ కూడా పంచక్, భద్ర ప్రభావంతో ఉంటుంది. ఈ కాలంలో రాఖీ కట్టడం నిషిద్ధం. సోదరుడికి రాఖీ కట్టేటప్పుడు కొన్ని చిన్న పొరపాట్లు అతని జీవితంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయని నమ్ముతారు. రక్షాబంధన్ రోజున సోదరీమణులు రాఖీ కట్టేటప్పుడు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి. రక్షాబంధన్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలను తెలుసుకుందాం.
శుభ ముహూర్తంలో రాఖీ కట్టాలి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోదరీమణులు రాఖీ కట్టేందుకు శుభ సమయంలో మాత్రమే తమ సోదరుడికి రక్షాసూత్రాన్ని కట్టాలి. అందువల్ల శుభ సమయం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం రాఖీ కట్టడానికి అత్యంత అనుకూలమైన సమయం మధ్యాహ్నం 1:35 నుండి సాయంత్రం 6:30 వరకు ఉంటుంది.
ముందుగా దేవుడికి రాఖీ కట్టండి
రక్షాబంధన్ సందర్భంగా ముందుగా దేవుడికి రాఖీ కట్టండి. వారికి అక్షత, బియ్యంతో తిలకం వేయండి. స్వీట్లు అందించండి. ఆ తర్వాత సోదరుడికి రాఖీ కట్టడం ప్రారంభించండి. వినాయకుడికి, హనుమంతుడు, శివుడికి కొంతమంది రాఖీ కడతారు. వినాయకుడికి కట్టడం వల్ల అడ్డంకులు తొలగిపోతాయి. భయం పోగొట్టుకునేందుకు హనుమంతుడికి కట్టవచ్చు.
సోదరుడి తలపై రుమాలు ఉంచండి
హిందూ ఆచారాలలో పూజా ఆచారాల సమయంలో తలను కప్పి ఉంచాలి. మీ సోదరుడికి రాఖీ కట్టే ముందు అతని తలను రుమాలు లేదా టోపీతో కప్పుకోండి.
పగిలిన బియ్యం అక్షతలు వేయకండి
రక్షాబంధన్ రోజున సోదరీమణులు ముందుగా సోదరుడికి అక్షత, తిలకం పూసి ఆపై అతనికి రాఖీ కట్టాలి. అయితే అక్షతల కోసం ఉపయోగించే బియ్యం విరిగిపోయి ఉండకూడదు. విరిగిన, పాడైపోయిన బియ్యం అశుభమైనవిగా పరిగణిస్తారు.
రాఖీలో 3 ముడులు కట్టాలి
సోదరుడి మణికట్టుకు రక్షా సూత్రం కట్టేటప్పుడు మూడు ముడులు కట్టాలని నమ్ముతారు. ఈ ముడులను బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు చిహ్నాలుగా పరిగణిస్తారు. హిందూ శాస్త్రంలో మూడు ముడులకు ప్రాధాన్యత ఎక్కువ.
కుడి చేతికి రాఖీ కట్టాలి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోదరుడికి ఎప్పుడూ కుడి చేతికి రాఖీ కట్టాలి. ఎడమ చేతికి పొరపాటున కూడా కట్టకూడదు. కుడి చేయి అనేక పనులతో ముడిపడి ఉంటుంది. అందువల్ల ఈ చేతికి రాఖీ కట్టడం శుభప్రదంగా భావిస్తారు.
మీ సోదరీమణులను గౌరవించండి
రక్షాబంధన్ రోజున మీ సోదరులు, సోదరీమణులను ఏ విధంగానూ కోపగించవద్దు. అలాగే రాఖీ కట్టేటప్పుడు సోదరుడి ముఖం దక్షిణం వైపు ఉండకూడదని గుర్తుంచుకోండి. అలాగే నలుపు రంగు రక్షా సూత్రం వినియోగించకూడదు. ఎరుపు లేదా పసుపు రంగు చాలా శుభకరమైనవి. అలాగే రాఖీ కట్టిన సోదరికి తప్పనిసరిగా బహుమతి ఇవ్వడం మంచిది..
నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.