ఉదయం నిద్ర లేవగానే ఈ 6 పనులు చేస్తే.. అంతా మంచే జరుగుతుంది.. ఏ కష్టం ఉండదు
ఉదయం నిద్ర లేవగానే ఈ 6 పనులు చేస్తే మీకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇలా చేయడం వలన సానుకూల శక్తి కూడా కలుగుతుంది. రోజంతా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్న పనులు కూడా పూర్తవుతాయి.

ఉదయం నిద్ర లేవగానే ఈ 7 పనులు చేయాలి
ప్రతీ ఒక్కరూ కూడా వారి రోజు సంతోషంగా ఉండాలని, ఏ ఇబ్బందులు కలగకూడదని అనుకుంటారు. ఉదయం పూట నిద్రలేచిన తర్వాత కొన్ని పనులు చేయడం వలన ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఉదయం లేచిన తర్వాత ఇలా చేస్తే, ఆ రోజులో మనం అనుకున్న పనులు పూర్తి అవడమే కాకుండా ఎన్నో లాభాలని ఈ పొందవచ్చు.
ఉదయం లేచిన తర్వాత చాలామంది తెలిసో తెలియకో కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కానీ, నిజానికి ఉదయం లేచిన తర్వాత వీటిని అనుసరించడం మంచిది. అలాగే కొన్ని తప్పులని అస్సలు చేయకూడదు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
శాస్త్రం ప్రకారం ఉదయం లేచిన తర్వాత చేయాల్సినవి
శాస్త్రం ప్రకారం ఉదయం లేచిన తర్వాత వీటిని పాటించడం వలన చాలా లాభాలని పొందవచ్చు. శాస్త్రం ప్రకారం ఉదయం లేచిన తర్వాత చేయవలసినవి ఏంటో తెలుసుకుందాం.
- చాలా మంది ఉదయం పూట ఆలస్యంగా నిద్ర లేస్తూ ఉంటారు. కానీ నిజానికి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం వలన ఎంతో మంచి జరుగుతుంది. సూర్యోదయానికి కంటే ముందు ఉండే గంట లేదా గంటన్నర సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అని అంటారు. వీలైనంత బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేవడం అలవాటు చేసుకోవడం మంచిది.
- నిద్ర లేచిన తర్వాత రెండు చేతులను ముందుకు పెట్టి, చేతుల్ని చూస్తూ 'కరాగ్రే వసతే లక్ష్మీ కరమధ్యే సరస్వతి.. కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కర దర్శనం' శ్లోకాన్ని చదువుకోవడం మంచిది.
- ఈ శ్లోకం చదివాక భూదేవికి నమస్కారం చేసుకోండి. శాస్త్రం ప్రకారం ఉదయం నిద్ర లేచిన తర్వాత భూదేవికి నమస్కారం చేసుకోవాలి.
- ఉదయం లేచిన తర్వాత శాస్త్రం ప్రకారం చందనం, బంగారం, మృదంగం, అద్దం లేదా ఏదైనా మణిని చూడడం వలన మంచి జరుగుతుందట. లేదా ఉదయం లేచిన తర్వాత అగ్నిని చూసి నమస్కారం చేసుకోవడం కూడా మంచిది. ఇలా నిద్ర లేవడం వలన రోజంతా బావుంటుంది.
- భూదేవికి నమస్కారం చేసుకున్న తర్వాత తల్లిదండ్రుల పాదాలకు నమస్కారం చేసుకోవాలి.
- చివరగా మీరు మీ రోజుని సానుకూల శక్తితో మొదలు పెట్టాలి. ప్రతికూల శక్తితో రోజును మొదలు పెడితే రోజంతా ప్రతికూల ఆలోచనలతో, ఇబ్బందులతో ఉంటుంది. అదే సానుకూల శక్తితో రోజును మొదలుపెడితే రోజంతా హాయిగా, ప్రశాంతంగా ఉంటుంది. అనుకున్నవన్నీ జరుగుతాయి.
సంబంధిత కథనం
ఇంకా జ్యోతిషంగ్రహ సంచారం, దేవాలయాలు, వాస్తు శాస్త్రం, జ్యోతిష పరిహారాలు, ఆధ్యాత్మిక సమాచారం, పండగలు, పూజా విధానం, వ్రత విధానం, రాశి ఫలాలు వంటి కథనాలు చదవండి.