Dhana trayodashi 2024: ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు పొరపాటున కూడా కొనకండి- దురదృష్టం తిష్ట వేస్తుంది-what should not be bought on dhanteras ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Dhana Trayodashi 2024: ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు పొరపాటున కూడా కొనకండి- దురదృష్టం తిష్ట వేస్తుంది

Dhana trayodashi 2024: ధన త్రయోదశి రోజు ఈ వస్తువులు పొరపాటున కూడా కొనకండి- దురదృష్టం తిష్ట వేస్తుంది

Gunti Soundarya HT Telugu
Oct 23, 2024 08:46 AM IST

Dhana trayodashi 2024: ధన త్రయోదశికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఈరోజు ఏదైన వస్తువు కొని ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఆశీస్సులు లభిస్తాయని నమ్ముతారు. అయితే కొనే వస్తువులు మాత్రమే కాదు కొనకూడని వస్తువులు కూడా కొన్ని ఉన్నాయి. వీటిని పొరపాటున కూడా కొనకండి దరిద్రం తిష్ట వేస్తుంది.

ధన త్రయోదశి
ధన త్రయోదశి (unsplash)

ఆశ్వయుజ మాసంలో త్రయోదశి రోజున ప్రతి సంవత్సరం ధన త్రయోదశి పండుగను జరుపుకుంటారు. దృక్ పంచాంగ్ ప్రకారం ఈ సంవత్సరం ధన్తేరస్ 29 అక్టోబర్ 2024న జరుపుకోనున్నారు. 

హిందూ మతంలో ధన త్రయోదశి రోజున బంగారం, వెండి, ఇత్తడి-రాగి పాత్రలు కాకుండా కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం చాలా శుభప్రదంగా పరిగణిస్తారు. ధంతేరాస్ రోజున కొనుగోలు చేసిన వస్తువులు పదమూడు రెట్లు పెరుగుతాయని, జీవితంలో సంపద, శ్రేయస్సు తీసుకొస్తుందని నమ్ముతారు. అయితే ఈ ప్రత్యేక సందర్భంలో కొన్ని వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదం కాదు. ధన త్రయోదశి రోజున కొన్ని వస్తువులు కొనడం మానుకోవాలి. లేదంటే దురదృష్టం వెంట కొని తెచ్చుకున్నట్టే అవుతుంది. అందుకే ధన త్రయోదశి రోజున ఏవి కొనకూడదో తెలుసుకుందాం. 

ఇనుప పాత్రలు

ఇనుము శనితో ముడి పడి ఉంటుంది. శుభకరమైన రోజుగా భావించే ధన త్రయోదశిర్ రోజు ఇనుము అసలు తీసుకోకూడదు. ఈ రోజున ప్రజలు పాత్రలు కొనుగోలు చేసేటప్పుడు ఇనుముతో చేసిన వస్తువులను కొనుగోలు చేయకూడదు. ఇది కాకుండా స్టీల్ లేదా అల్యూమినియం పాత్రలను కొనకూడదు. వీటికి బదులు మట్టి పాత్రలు కొనుగోలు చేసి ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. 

నలుపు రంగు వస్తువులు

నలుపు శుభ సూచికంగా పరిగణించరు. పవిత్రమైన ధన త్రయోదశి రోజున బ్యాగులు, బట్టలు, బూట్లు, నల్ల దుప్పటి మొదలైన నలుపు రంగు వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదం కాదు. అలాగే తోలు, జంతు చర్మాలతో చేసే వస్తువులు కొనుగోలు చేయకూడదు. 

గాజు వస్తువులు

ఇంటిని అందంగా అలంకరించుకునేందుకు చాలా మంది గాజు వస్తువులు ఉపయోగిస్తారు. కానీ ధన త్రయోదశి రోజున గాజుతో చేసిన వస్తువులు కొనకూడదని నమ్ముతారు. ఈ రోజున గాజు పాత్రలు లేదా గాజు అలంకరణ వస్తువులు కొనుగోలు చేయరాదు. ఇవి నెగటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకొస్తాయి. అందుకే వీటిని దూరంగా ఉంచాలి. మిగతా రోజుల్లో వీటిని కొనుగోలు చేసుకోవచ్చు. 

పదునైన వస్తువులు

ధన త్రయోదశి రోజున కత్తులు, కత్తెరలు, సూదులు, చాకులు వంటి పదునైన వస్తువులను కొనకండి. ఇవి హానికరమైన బంధాలకు ప్రతీకగా చూస్తారు. అందుకే వీటిని కూడా ఇంటికి తీసుకురావద్దు. 

కృత్రిమ ఆభరణాలు

ఈరోజుల్లో బంగారు ఆభరణాల కంటే ఎక్కువగా కృత్రిమ ఆభరణాలు ధరించేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. తక్కువ ధరకు లభించడం, రకరకాల మోడల్స్ లో దొరుకుతున్నాయి. అందువల్ల వీటిని ఎక్కువగా కొనుగోలు చేస్తారు. ధన త్రయోదశి రోజున బంగారం, వెండితో చేసిన ఆభరణాలను కొనుగోలు చేయడం శ్రేయస్కరం. కానీ ఈ రోజున కృత్రిమ ఆభరణాలు కొనుగోలు చేయకూడదు. 

ప్లాస్టిక్ వస్తువులు

ధంతేరస్ రోజున ప్లాస్టిక్‌తో చేసిన వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదం కాదు. ఇది నెగటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. అందుకే వీటిని కూడా దూరంగా ఉంచండి. 

నిరాకరణ: ఈ కథనంలో అందించిన సమాచారం పూర్తిగా నిజం మరియు ఖచ్చితమైనది అని మేము క్లెయిమ్ చేయము. వీటిని అవలంబించే ముందు, ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోండి.

Whats_app_banner