Usiri deepam: కార్తీకమాసంలో ఉసిరి దీపం ఎలా పెట్టాలి? పఠించాల్సిన మంత్రాలు ఏంటి?
Usiri deepam: కార్తీకమాసంలో ఉసిరి చెట్టు ఆరాధనకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది. పౌర్ణమి రోజు ఉసిరి దీపం వెలిగించే సంప్రదాయం పాటిస్తారు. ఈ దీపం ఎలా వెలిగించాలి. ఇది పెట్టేటప్పుడు పఠించాల్సిన మంత్రాల గురించి తెలుసుకుందాం.
కార్తీక మాసంలో శివకేశవుల ఆరాధన అత్యంత విశిష్టమైనది. ఈ మాసంలో చేసే పూజ, దానం, జపం, స్నానం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. కార్తీక మాసంలో చాలా మంది ఉసిరి చెట్టు కింద దీపం వెలిగిస్తారు.
ఉసిరి దీపం పెట్టడం, అలాగే చెట్టు కింద దీపం వెలిగించి పూజ చేయడం వల్ల విశేషమైన ఫలితాలు ఉంటాయని నమ్ముతారు. మీరు కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద దీపం పెడుతున్నట్టు అయితే ఈ ఇరవై ఒక్క నామాలు చదవడం మంచిది.
ఓం ధాత్రై నమః
ఓం రామాయై నమః
ఓం శాంత్యి నమః
ఓం లోక మాత్రయై నమః
ఓం కాంత్యి నమః
ఓం ఆబ్ధి తనయాయై నమః
ఓం మేధాయై నమః
ఓం గాయత్రీయై నమః
ఓం కళ్యానై నమః
ఓం సావిత్రియై నమః
ఓం విష్ణు పట్నై నమః
ఓం విశ్వరూపాయై నమః
ఓం మహాలక్ష్మి నమః
ఓం సురూపాయై నమః
ఓం ప్రకృతె నమః
ఓం కమనీయాయై నమః
ఓం ఇందిరాయై నమః
ఓం అవ్యక్తాయై నమః
ఓం సుధ్యత్యి నమః
ఓం కమలాయై నమః
ఓం జగధ్దాత్రియై నమః
కార్తీక మాసంలో ఉసిరి చెట్టు మీద విష్ణువు నివసిస్తారని నమ్ముతారు. అలాగే ఉసిరి చెట్టు శివుని స్వరూపంగాను భావిస్తారు. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి కాయఠో దీపం వెలిగించడం వల్ల ఐశ్వర్యం సిద్ధిస్తుందని, సకల దోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.
ఈ మాసంలో ఉసిరి చెట్టు కింద దీపాలు పెట్టడం, ఉసిరి చెట్టును పూజించడం, ఉసిరి దీపాలను దానం చేయడం, ఈ చెట్టు కింద వనభోజనాలు చేయడం చాలా మంచిదని చెబుతారు. ఇలా చేయడం వల్ల విష్ణుమూర్తి ఆశీర్వాదాలు లభిస్తాయని అంటారు. కార్తీక మాసం అంటేనే దీపాలకు అధిక ప్రాధాన్యత ఉంటుంది. నిత్యం దీపారాధన చేసి దీపాలను కోనేటిలో లేదా నీటిలో వదులుతారు. ఉసిరిని పూజించడం వల్ల శివకేశవుల అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయని అంటారు.
తెల్లవారుజామున నిద్రలేచి స్నానం ఆచరించి శుభ్రమైన దుస్తులు ధరించాలి. ఉసిరి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించి పూజ చేసుకోవచ్చు. కొందరు సాయంత్రం వేళ విధిగా ఉసిరి చెట్టు కింద దీపం పెడుతూ ఉంటారు. అలాగే చెట్టు చుట్టూ పదకొండు సార్లు ప్రదక్షిణలు చేస్తారు. ఇలా చేస్తే లక్ష్మీనారాయణుడి అనుగ్రహం కలుగుతుంది.
ఉసిరి దీపం ఎలా పెట్టాలి?
గుండ్రంగా ఉండే ఉసిరితో దీపం ఎలా పెట్టాలని అనుకుంటారు. కానీ ఇది చాలా సులువుగా చేసుకోవచ్చు. ఉసిరి కాయను మధ్యలో గుండ్రంగా కట్ చేసి అందులో నూనె లేదా నెయ్యి వేసుకుని వత్తి వేసి వెలిగించాలి. ఇలా ఉసిరి దీపం వెలిగిస్తే సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. నవగ్రహ దోషాలు తొలగిపోవాలని అనుకుంటే కార్తీక పౌర్ణమి రోజు ఉసిరి దీపం వెలిగించడం వల్ల విశేషమైన ఫలితం లభిస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.