Dreams and meanings: కలలో మీకు ఇవి కనిపిస్తున్నాయా? స్వప్న శాస్త్రం ఏం చెబుతోంది చూడండి
Dreams and meanings: కలలో ఆవు, గంగా నది, వర్షం వంటివి కనిపిస్తున్నాయా? అవి మంచి సంకేతాలా? కాదా? వాటి అర్థం ఏంటి? స్వప్న శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి.
Dreams and meanings: దాదాపు ప్రతి వ్యక్తి కలలు కంటాడు. అయితే కలలో కనిపించినవి కాసేపటికి మర్చిపోతారు. మరికొన్ని కలలో కనిపించిన కొన్ని సంకేతాలు మానవ జీవితాన్ని ప్రభావితం చేస్తాయని స్వప్న శాస్త్రం చెబుతుంది. ఎలాంటివి కలలో కనిపిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి? వాటికి ఉన్న అర్థాలు ఏంటో స్వప్న శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం.
భగవద్గీత కనిపిస్తే
స్వప్న శాస్త్రం ప్రకారం మీ కలలో గీత కనిపిస్తే మీకు రాబోయే రోజుల్లో కొన్ని శుభవార్తలు అందుకోబోతున్నారని అర్థం. మీరు చేపట్టిన పని విజయవంతం అవుతుంది. కలలో గీత కనిపించడం అంటే శ్రీకృష్ణుడి అనుగ్రహం మీకు లభిస్తుందని అర్థం.
కలలో ఆవు కనిపిస్తే
మీరు కలలో ఆవుని చూసినట్లయితే చాలా మంచి జరుగుతుందని అర్థం. హిందూ మతం ప్రకారం అని అంటారు. అందుకే ఆవును చూడటం చాలా శుభప్రదం. కలలో ఆవు కనిపిస్తే సంతోషకరమైన వార్తలు వింటారు. బిడ్డ పుట్టుకకు సూచిక. జీవితం ఆనందంతో నిండిపోతుంది. వివిధ పనులు విజయవంతంగా పూర్తవుతాయని అనేందుకు ఇదొక సంకేతం.
కలలో గంగా నది కనిపిస్తే
గంగానది భూమిపై ఉన్న పవిత్ర నదులలో ఒకటిగా పరిగణిస్తారు. కోట్లాదిమంది పాపాలు కడిగిన తర్వాత కూడా గంగానది ఎంతో పవిత్రంగా ఉంటుంది. కలలో గంగా నది కనిపిస్తే రాబోయే రోజుల్లో మీ ప్రణాళికలు విజయవంతమవుతాయని సూచిక. ఆర్థిక లాభాలు ఉంటాయి. ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడతారు. మీ కోరికల్లో ఒకటి నెరవేరుతుందని సూచిస్తుంది.
కలలో దేవతల కనిపిస్తే
కలలో ఏదైనా దేవత లేదా దేవుడిని చూసినట్లయితే మీ కష్టాలన్నీ త్వరలో తొలగిపోతాయి. ఈ కల జీవితంలో ఆనందాన్ని తీసుకువస్తుంది. త్వరలో ఏదో ఒక మంచి జరగబోతుందని అని అర్థం.
గుర్రపు స్వారీ చేస్తున్నట్టు కనిపిస్తే
గుర్రపు స్వారీ చేస్తున్నట్టు కలలో కనిపిస్తే ఏదో శుభం జరగబోతుందని అర్థం చేసుకోవచ్చు. పెండింగ్ ఉన్న పని పూర్తి అవుతుంది. ఈ కల ఉద్యోగాలు, వ్యాపారంలో పురోగతిని కూడా సూచిస్తుంది. కలలో గుర్రం కనపడటం ఒక శుభసంకేతంగా భావిస్తారు.
వర్షం కనిపిస్తే
కలలో చీకటి, మేఘాలు వర్షం కనిపిస్తే అది శుభప్రదం. పాతపెట్టబడుల నుంచి ఆర్థిక ప్రయోజనాలు, ఆకస్మిక ధన లాభం కలుగుతుందని అర్థం. జీవితంలో శ్రేయస్సు పెరుగుతుంది. వర్షం కలలో కనిపిస్తే జీవితంలో అందమైన భాగస్వామి లభిస్తుందని కూడా అంటారు.
చంద్రుడు కనిపిస్తే
చంద్రుడు చల్లదనం శాంతికి చిహ్నంగా భావిస్తారు. కలలో చంద్రుడిని చూడటం చాలా శుభప్రదం. ఇది కనిపిస్తే ఉద్యోగంలో ప్రమోషన్, వేతన పెంపు వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలియజేస్తోంది. అలాగే సమాజంలో గౌరవం ప్రతిష్ట పెరుగుదలను సూచిస్తుంది.
కలలో జుట్టు లేదా గోర్లు కత్తిరించినట్లు కనిపిస్తే
కలలో గోర్లు కత్తిరించినట్లు కనిపిస్తే అది శుభసంకేతం. ఇది మీ ప్రణాళికలో ఒకటి విజయవంతం అవుతుందని సూచిక. కానీ జుట్టు కత్తిరించుకున్నట్టు కనిపిస్తే శ్రేయస్కరం కాదు. దీనివల్ల ఖర్చులు పెరుగుతాయి. అయితే గోర్లు కత్తిరించినట్టు కలలో కనిపిస్తే మీరు అప్పుల నుంచి విముక్తి పొందుతున్నారని అర్థం.
తమలపాకు తిన్నట్టు కనిపిస్తే
హిందూమతంలో తమలపాకులను దేవతలకు సమర్పిస్తారు. అందుకే దీన్ని శుభప్రదంగా పరిగణిస్తారు. కలలో తమలపాకు తిన్నట్టు కనిపిస్తే శుభం కలుగుతుంది. ఇంట్లో కీర్తి, శ్రేయస్సు ఆనందం కలుగుతుంది. అలాగే మీ కలలన్నీ నెరవేరుతాయని ఇది సూచిస్తుంది.
గమనిక : పైన ఇచ్చిన సమాచారం నమ్మకాల మీద ఆధారపడి ఉంది. ఇంటర్నెట్‌లో దొరికిన వివరాల ఆధారంగా ఇచ్చాం. ఇది కేవలం సమాచారం కోసం మాత్రమే. పైన చెప్పిన విషయాలకు HT Telugu ఎలాంటి బాధ్యత వహించదు. మీకు ఏమైనా అనుమానాలు ఉంటే సంబంధిత నిపుణులను సంప్రదించండి.