భూకంపానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటి..? భూమి ఎందుకు, ఎప్పుడు కంపిస్తుందో జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోండి-what is the link between earthquakes and astrology check the reason behind this and on these days earthquakes happens ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  భూకంపానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటి..? భూమి ఎందుకు, ఎప్పుడు కంపిస్తుందో జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోండి

భూకంపానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటి..? భూమి ఎందుకు, ఎప్పుడు కంపిస్తుందో జ్యోతిష్య శాస్త్రం ద్వారా తెలుసుకోండి

Peddinti Sravya HT Telugu
Jan 09, 2025 01:30 PM IST

మత పండితులు ప్రకారం భూకంపాలకు జ్యోతిష్యంతో సంబంధం ఉంది. జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా సంవత్సరాల తర్వాత వచ్చే గ్రహణాలు, పౌర్ణమి, అమావాస్య మొదలైన అన్ని ఖగోళ సంఘటనలు అంచనా వేయవచ్చు.

భూకంపానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటి..?
భూకంపానికి జ్యోతిష్యానికి సంబంధం ఏంటి..? (pinterest)

జ్యోతిష్యంతో చాలా సంబంధం కలిగి ఉంటాయి. జ్యోతిష్య శాస్త్రానికి ఎన్నో వాటికి దగ్గర సంబంధం ఉంటుంది. నేటి యుగంలో తరచుగా సంభవించే భూకంపాలు ప్రజల్ని భయపెడుతున్నాయి. అయినప్పటికీ రాబోయే భూకంపాన్ని ముందుగానే గుర్తించగలిగే పరికరాన్ని కానీ యంత్రాన్ని కానీ మానవులు ఇంకా అభివృద్ధి చేయలేకపోతున్నారు.

yearly horoscope entry point

మత పండితులు ప్రకారం భూకంపాలకు జ్యోతిష్యంతో సంబంధం ఉంది. జ్యోతిష్య శాస్త్రాన్ని అధ్యయనం చేయడం ద్వారా సంవత్సరాల తర్వాత వచ్చే గ్రహణాలు, పౌర్ణమి, అమావాస్య మొదలైన అన్ని ఖగోళ సంఘటనలు అంచనా వేయవచ్చు.

ఈ సమయంలో భూకంపాలు ఎక్కువగా వస్తాయి

  1. భూకంపం యొక్క సంభావ్యతను అనేక వాటి అనేక విషయాల ద్వారా అంచనా వేయవచ్చు. జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం భూకంపం అనేది ఏ సమయానికి అయినా రావచ్చు. కానీ, భూకంపం యొక్క రిస్క్ మధ్యాహ్నం 12 నుంచి సూర్యాస్తమయం దాకా ఉంటుందని.. అలాగే అర్ధరాత్రి నుంచి సూర్యోదయం దాకా ఎక్కువగా ఉంటుందని తెలుస్తోంది.

2. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యా లేదా చంద్రగ్రహణం ఉన్నప్పుడు ఎప్పుడూ భూకంపాలు సంభవించవు. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం అనుసరించే పౌర్ణమి లేదా అమావాస్య తర్వాత భూకంపం వచ్చే అవకాశం ఉంటుంది. జ్యోతిష్య పండితుల అభిప్రాయం ప్రకారం సూర్యుడు దక్షిణార్థ గోళంలో ఉన్నప్పుడు (డిసెంబర్, జనవరి) లో ఉత్తరాది గోళంలోకి (మే, జూన్) లో వెళ్ళబోతున్నప్పుడు భూకంపాలు సంభవిస్తాయట.

3. మతపండితుల అభిప్రాయం ప్రకారం చిన్న, పెద్ద పరిమాణంలో మిలియన్ల ఉల్కలు విశ్వంలో కదులుతున్నాయి. ఆ ఉల్కలు భూమికి దగ్గరగా వచ్చినప్పుడు లేదా దానిని ఢీకొన్నప్పుడు భూకంప ప్రమాదం పెరుగుతుంది.

గ్రహాల తిరుగమనంలో భూకంపాలు వస్తాయా?

కుజుడు, బృహస్పతి చాలా శక్తివంతమైన గ్రహాలు. అలాగే శని తిరోగమనం సమయంలో కూడా భూకంపాలు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంటుంది. కుజుడు, రాహులు సడష్టక యోగం కుజుడు, శని సడష్టక యోగం సూర్యుడు, కుజుడు సడష్టక యోగంతో పాటు కుజుడు శని దూరంగా ఉండడం ఇలా రావడం వలన భూకంప సంభావ్యత పెరుగుతుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner