Maha Shivaratri: మాస శివరాత్రి, మహా శివరాత్రి ఒక్కటి కాదా, ఏది ఎప్పుడు జరుపుకోవాలి?, శివరాత్రుల్లో రకాలు తెలుసుకోండి
Maha Shivaratri: ఈసారి హిందూ క్యాలెండర్ ప్రకారం, శివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన వచ్చింది. అయితే, చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే శివరాత్రి, మాస శివరాత్రి రెండు వేరు. ఆ రెండిటి మధ్య తేడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే, ఈ రెండిటి మధ్య తేడా గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

హిందువుల జరుపుకునే ప్రధాన పండుగల్లో మహాశివరాత్రి కూడా ఒకటి. మహాశివరాత్రి పండుగను హిందువులు ఎంతో ప్రత్యేకంగా జరుపుకుంటారు. ప్రతీ సంవత్సరం శివరాత్రి పండుగ మాఘ మాసంలో వస్తుంది. ఈసారి హిందూ క్యాలెండర్ ప్రకారం, శివరాత్రి ఫిబ్రవరి 26వ తేదీన వచ్చింది. అయితే, చాలామంది తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే శివరాత్రి, మాస శివరాత్రి రెండు వేరు.
ఆ రెండిటి మధ్య తేడా చాలా తక్కువ మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. అయితే, ఈ రెండిటి మధ్య తేడా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మహా శివరాత్రి నాడు శివుడు పార్వతీ దేవిని వివాహం చేసుకున్నాడని, ఆ రోజున శివుడిని ఆరాధించి, ప్రత్యేక పూజలు చేస్తారు. ఉపవాసం, జాగరణ కూడా చేస్తారు.
మహాశివరాత్రి, మాస శివరాత్రి
మహాశివరాత్రి, మాస శివరాత్రి ఒకటి కాదా? ఈ రెండిటి మధ్య పెద్ద తేడా ఉంది. రెండు ఒకటి కాదు. తెలుగు పంచాంగం ప్రకారం, శివరాత్రిని మొత్తం ఐదు రకాలుగా విభజించారు.
- మొదటిది నిత్య శివరాత్రి. అంటే రోజూ కూడా శివయ్యను తలుచుకుంటూ ఆరాధిస్తూ ఉంటారు.
- రెండవది ప్రతి నెలలో శుక్ల బహుళపక్షాల వేళ చతుర్దశి ఉన్నప్పుడు శివుడుని ఆరాధిస్తూ ఉంటారు.
- మూడవది ప్రతీ నెలా బహుళ చతుర్దశి నాడు మాస శివరాత్రిని జరుపుకుంటూ ఉంటాము.
- నాలుగవది మాఘమాసంలో బహుళ చతుర్దశి నాడు మహాశివరాత్రి వేడుకల్ని హిందువులు జరుపుకుంటారు.
- ఐదవది యోగులు, యోగ సమాధిలో ఉన్న శివుడిని ఆరాధిస్తారు. వారు ఉపవాసం కూడా ఉంటారు.
మాస శివరాత్రి అంటే ఏంటి?
- హిందూ మత విశ్వాసం ప్రకారం ప్రతీ నెలలో కూడా అమావాస్య ముందు వచ్చే చతుర్దశి నాడు మాస శివరాత్రిని జరుపుకుంటూ ఉంటాము.
- ఆ రోజున ఉపవాస దీక్షని చేస్తారు. అలాగే శివుడిని స్మరించుకుంటారు.
- ప్రదోషవ్రతం చేసినప్పుడు శివుడికి జలాభిషేకం, బిల్వాలతో పూజలు చేస్తారు.
మహా శివరాత్రి, మాస శివరాత్రికి మధ్య తేడా ఇదే
మహాశివరాత్రి పండుగని ఏడాదికి ఒకసారి మాత్రమే జరుపుకుంటాము. అది కూడా మాఘమాసం కృష్ణపక్షం వచ్చే చతుర్దశి తిధి నాడు. ఈరోజు పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం జరిగిందని నమ్ముతాము.
అదే మాస శివరాత్రి అంటే ప్రతి నెలలో కృష్ణపక్షంలో చతుర్దశి తిధి రోజున మాస శివరాత్రిని జరుపుకుంటాము. ఈ ప్రత్యేక రోజుల్లో శివుడిని ఆరాధించడం వలన విశేష ఫలితాన్ని పొందవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం