సపిండీకరణ శ్రాద్ధవిధి అంటే ఏమిటి? దీన్ని ఎలా సమర్పించాలి?
మహాలయ పక్షాల సమయంలో పితృ దేవతలకు శ్రాద్ధం, తర్పణాలు వదులుతారు. ఈ సమయంలో పితృ దేవతలకు పెట్టె సపిండికరణ శ్రాద్ధ విధి అంటే ఏంటి? ఇది ఎలా సమర్పించాలి అనే దాని గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వివరించారు.
శ్రద్ధతో పెట్టేదాన్ని శ్రాద్ధం అని అంటారు. మనిషి మరణించిన ఏడాదికి అదే తిథినాడు శ్రాద్ధాన్ని పెట్టాలని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త, పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
శ్రద్ధగా ఈ శ్రాద్ధాన్ని అపరాష్ట్రంలో పెట్టాలని చిలకమర్తి తెలిపారు. బ్రాహ్మణుల్ని ఆహ్వానించినప్పుడు ఎడమ ప్రక్క ఉన్న ఆసనాల మీద కూర్చోబెట్టాలి. విశ్వేదేవుల్ని ఆహ్వానం చేయాలి. మూడు పాత్రల్ని స్థాపించాలి. వాటి పైన కుశదర్భల్ని ఉంచి, ఆ పాత్రల మీదా, చుట్టూ వేరే పాత్రలుంచాలి. అర్ఘ్యమిచ్చే పాత్రకి రంధ్రాలుండకూడదు. అంతకుముందు కర్మకాండ తృప్తికరంగా జరగాలని సంకల్పించాలి. తరువాత మూడు పైకి తీసి మంత్రాలతో పితృపాత్రలోని నీటిని పితామహ, ప్రపితామహుల పాత్రలలో పోయాలి.
పవిత్రాలతో సహా మిగతా యిద్దరి పాత్రలలోని నీటిని పితృపాత్రలో పోయాలి. తరువాత పితృ బ్రాహ్మణుని చేతిలో ఉన్న అర్ఘ్యపాత్రలోని పవిత్రకాన్ని తీసి ఆయన తలమీదా, చేతులలో, పాదాలమీదా, ఆ పాత్రలోని పూలనే ఇవ్వాలి. తరువాత ఆయన చేతిలో నీటిని పోసి తన రెండు చేతులతో అర్ఘ్యపాత్రను ఎత్తి, మంత్రాలతో పితృపాత్రలోని కొంత అర్ఘ్యం నీటిని పితామహ ప్రతినిధుల చేతులలో పోయాలి. పవిత్రంతో సహా మిగిలిన నీటిని పాత్రలో నిండి తీసివేరే పాత్రలో పోసి, దానిని యితర పాత్రల మధ్య దాచాలి.
పితృ బ్రాహ్మణుని ఎడమ ప్రక్కనున్న కుడి దర్భయొక్క చివర ఈ పాత్రని బోర్లించాలి. తరువాత పితామహుల్ని గంధంతో సత్కరించి, మిగిలిన అన్నాన్ని పితరుల పాత్రలో వేయాలి. బ్రాహ్మణులకు ఆచమనం, తాంబూలం యివ్వాలి. మంత్రాల్ని పఠిస్తూ ప్రపితా మహాది క్రమంలో బ్రాహ్మణుల చేతులలో జలప్రదానం చేస్తూ, తరువాత తిలలతో కూడిన జలాన్ని పోయాలి. తరువాత శ్రాద్ధం చేసే వ్యక్తి “అఘోరాః పితరః సంతు” అంటే బ్రాహ్మణులు 'అస్తు' అంటారు. అలాగే అతడు ఇతర మంత్రాల్ని చెప్పినప్పుడు కూడా 'అస్తు' అంటారు.
ఆ తరువాత అతడు దక్షిణం వైపు తిరిగి జలధార నిచ్చి, మంత్రాలు చదువుతూ దేవబ్రాహ్మణుల చేతిలో నీటిని, యవలను సమర్పించాలి పిండపాత్రల్ని కదిలించి, ఆచమన పూర్వకంగా / బ్రాహ్మణులకు పితామహాది క్రమంలో దక్షిణలివ్వాలి. ఆశీర్వాదాన్ని కోరాలి. బ్రాహ్మణులు ప్రతిగృహ్యతాం' అంటారు. 'దాతారోనోభి వర్దంతాం' మొదలైన మంత్రాలు చదివి అర్ఘ్య పాత్రని పైకి ఎత్తి పట్టుకుని “వాజే వాజే" అనే మంత్రాలతో దేవబ్రాహ్మణుల్నీ, "అభిరమ్యతాం" అనే మంత్రంతో పితృబ్రాహ్మణుల్నీ విసర్జించాలని ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్