Narmada pushkaralu 2024: నర్మదా నది పరిక్రమ అంటే ఏమిటి? దానిని ఉత్తర వాహిని పరిక్రమ అని ఎందుకు అంటారు?
Narmada pushkaralu 2024: నర్మదా నది పరిక్రమ అంటే ఏంటి? నర్మదా ఉత్తర వాహిని పరిక్రమ అని ఎందుకు పిలుస్తారు వంటి విశేషాల గురించి పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.
Narmada pushkaralu 2024: రేవా తీరే తపః కుర్యాత్ అని శాస్త్రం. అనగా రేవా నది (నర్మదా నది) తపస్సుకు అత్యంత యోగ్యమైనది అని అర్థము అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
నర్మదా నది అధ్యాత్మిక సాధనకు, తపస్సుకు ఉత్తమమైనదని శంకర భగవత్పాదులు అయినటువంటి ఆదిశంకరాచార్యులవారు తమ గురువైనటువంటి గోవింద భగవత్ పాదస్వామి వారిని కలుసుకున్న ప్రాంతం కూడా నర్మదా నది పరివాహన ప్రాంతమని చిలకమర్తి తెలిపారు. ఇంతటి విశిష్టత కలిగిన నర్మదా నది నర్మదా పరిక్రమ యాత్ర పేరుతో అధ్యాత్మిక భావనతో నర్మదా పరిక్రమ యాత్ర చేస్తారని చిలకమర్తి తెలిపారు.
ఈ నర్మదా పరిక్రమ 3 రకాలు.
1. పూర్తి పరిక్రమ
2. ఉత్తర వాహిని పరిక్రమ
3. విశ్రాంతి పరిక్రమ (బ్రేక్).
1. పూర్తి పరిశ్రమకు సుమారు 5 నెలలు నుంచి 6 నెలల వరకు పడుతుంది.
2. ఉత్తర వాహిని పరిక్రమ ఇది సుమారు ౩ రోజులు పడుతుంది. మాములుగా చైత్ర మాసంలో ఉంటుంది. ఈ పరిక్రమ కూడా పవిత్రమైనది.
3. విశ్రాంతి పరిక్రమ నడవలేని వారికి, ఉద్యోగులకు 15 రోజులు నడిచి ఆ ప్రాంతం గుర్తు పెట్టుకొని వెళ్ళిపోయి మళ్ళీ ఆ ప్రాంతం నుంచి నడవవచ్చు అని చిలకమర్తి తెలిపారు.
నర్మదా ఉత్తర వాహిని పరిక్రమ
రేవా నదిగా పిలవబడే నర్మదా నది రాజ్ పిపాలా, నర్మదా జిల్లాలోని రాంపూర్ అనే ఊరు గరుడేశ్వర్‌కు దగ్గర నుంచి ఉత్తర వాహిని అవుతుంది. ఈ పరిక్రమకు దారిలో అనేక ఆశ్రమాలు కూడా ఉన్నాయి. ఆ ఆశ్రమాలు వారు పరిక్రమవాసులకు సేవ చేస్తుంటారు. నదికి అవతల ఒడ్డున నర్మదే హార్ నామం, తపోవన్ ఆశ్రమం కూడా వస్తుంది. పరిక్రమకు టార్చి లైట్, ఒక కర్ర, 2 జతల బట్టలు ఉండాలి. దారిలో మణి నాగేశ్వర్ మందిరం వస్తుంది. కపిల మహాముని తపస్సు చేసిన ప్రాంతం. ఇక్కడ సాధన చేస్తే సర్వ సిద్ధులు ఫలిస్తాయి అని అంటారు.
దత్త క్షేత్రాలు (గుజరాత్) గరుడేశ్వర్
శ్రీ వాసుదేవా నంద సరస్వతి దేశం అంతా పర్యటించి చివరకు స్వామి నర్మదా నది వడ్డున సమాధి చెందిన ప్రాంతం. స్వామి దత్తాత్రేయ స్వామిపై, దత్త మహత్యం, ద్వి సహ! స్తే దత్త పురాణం, దత్తాత్రేయ స్తోత్రాలు రచించి వాళ్ళు జీవితాంతం పూజించిన 2 దత్త విగ్రహాలు ఇక్కడే ఉన్నాయి. నర్మదా నది ఇక్కడ అతి పవిత్రమై ఉత్తర వాహిని అయి ప్రవహిస్తోంది. ఇక్కడ నుంచి నర్మదా ఉత్తర వాహిని పరిక్రమ మొదలు పెట్టి 15 రోజులలో తిరిగి గరుడేశ్వర్ అవతల ఒడ్డుకు వచ్చి పడవపై ఇవతల ఒడ్డుకు వస్తారు. పూర్తి పరిక్రమ చేయలేని వారికి ఇది మంచిది.
స్వామి చివరి రోజు దత్త స్వామికి అభిముఖంగా కూర్చొని శ్వాస నిరోధించి, దీర్ఘ ఓంకారం స్మరించి 1914 లో ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజు, ఆరుద్ర నక్షత్రంలో రాత్రి 11 గంటల సమయంలో సమాధి చెందారు. వారి శరీరంను దత్త సంప్రదాయం ప్రకారం జల సమాధి చేశారు. వారు కూర్చున్న ప్రాంతంలో స్వామి వారికి కుటీరం ఉన్న ప్రాంతాన్ని సమాధి మందిరంగా పిలుస్తారు. దత్త స్వామి పిలిస్తే పలుకుతారు ఇక్కడ. నర్మదా పరిక్రమకు వెళ్లేవారు అమ్మ ఎప్పుడూ కుడి చేతి వైపు ఉండేలా చూసుకోవాలి.
కపిలేశ్వర్
రెండవ క్షేత్రం శివమందిరం అయిన కపిలేశ్వర్ వస్తుంది. కపిల మహర్షి తపస్సు చేసిన ప్రాంతంగా పిలుస్తారు. ఈ నదిని మహేశ్వరి గంగ, దక్షిణ గంగగా కూడా పిలుస్తారు. రాంపూరా నుంచి మొదలుపెట్టి, రాంచోడ్‌రాయ్ మందిరం నుంచి వేకువ జామున నర్మదా నదిలో స్నానం చేసి, బయలు దేరి మంగ్రోల్ వైపు పయనించాలి.
మంగోల్ చేరి అక్కడ నుంచి సియారం ఆశ్రమం వైపు నడవాలి. తరువాత నర్మదా నదిలో అవతల ఉన్న తిలక్ వాడా వైపు పడవలో ప్రయాణం చేసి, అవతల ఒడ్డున చేరి తిరిగి రాంపురా వైపు నడక సాగించాలి.
తిలక్ వాడా
ఈ క్షేత్రం అతి ప్రాచీన క్షేత్రం. గౌతమ మహర్షి తపస్సు చేసిన ప్రాంతం. అహల్యకు శాపం ఇచ్చిన తరువాత పశ్చాత్తాపం చెంది, ఇక్కడకు వచ్చి తపస్సు చేశారు. వాసుదేవానంద సరస్వతి స్వామి నర్మదా ప్రదక్షిణ చేసి దత్త ఆజ్ఞపై ఇక్కడ ఎనిమిదో చతుర్మాస్యం చేశారు.
వాసుదేవానంద సరస్వతి స్వామి వారు స్వయంగా ఇక్కడ బెదుంబర్ వృక్షము క్రింద దత్తాత్రేయ విగ్రహం ప్రతిష్ట చేశారు. ఇక్కడే సమర్ధ రామదాసు స్వామి కూడా తపస్సు చేసి, హనుమాన్ విగ్రహం ప్రతిష్ట చేశారు. ఇక్కడ 60 సంవత్సరాలు జీవించారు. ఇక్కడ ఆయన సజీవ సమాధి ఉంది. ఇక్కడ వాసుదేవానంద సరస్వతి స్వామి వాడిన వస్తువులు, విసిన కర్ర ఉన్నాయి. ఇక్కడ నుంచి స్వామి కుటీరంకి వెళితే అక్కడ రాగి రేకు మీద స్వామి స్తోత్రాలు, చేతితో రాసినవి కొన్ని ఉన్నాయి. వడోదర నుంచి 60 కి.మీ.దూరంలో ఈ ప్రాంతం ఉందని అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
టాపిక్