Panchagraha kutami 2024: పంచగ్రహ కూటమి అంటే ఏంటి? దీని ప్రభావం మేషం నుంచి మీనం వరకు ఎలా ఉంటుంది?-what is panchagraha kutami what are the benefits of all zodiac signs ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Panchagraha Kutami 2024: పంచగ్రహ కూటమి అంటే ఏంటి? దీని ప్రభావం మేషం నుంచి మీనం వరకు ఎలా ఉంటుంది?

Panchagraha kutami 2024: పంచగ్రహ కూటమి అంటే ఏంటి? దీని ప్రభావం మేషం నుంచి మీనం వరకు ఎలా ఉంటుంది?

HT Telugu Desk HT Telugu
Jun 06, 2024 11:26 AM IST

Panchagraha kutami 2024: జూన్ 6, 2024 అరుదైన పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఏ రాశిలో ఈ కూటమి ఏర్పడింది. మేష రాశి నుంచి మీన రాశి వరకు ఎలాంటి ఫలితాలు ఎదుర్కోబోతున్నారో తెలుసుకుందాం.

పంచగ్రహ కూటమి అంటే ఏంటి?
పంచగ్రహ కూటమి అంటే ఏంటి? (freepik)

Panchagraha kutami 2024: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏ రాశిలో అయినా సరే ఒక గ్రహంతో మరొక గ్రహం కలిస్తే ఆ గ్రహ కలయిక వల్ల కొంత ప్రత్యేక ఫలితాలు ఇస్తుంది. ఈ ఫలితాలు శుభ, అశుభ ఫలితాలు కూడా ఉండవచ్చని పంచాంగకర్త, బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

ఇలా ఒకే రాశిలో మూడు లేదా అంతకుమించి గ్రహాలు కలిస్తే అవి విశేషంగా చెప్తారు. అందులోనూ ఒకే రాశిలో ఐదు గ్రహాలు కలిసి ఉంటే దాన్ని పంచగ్రహ కూటమి యోగిస్తుందని శాస్త్రాలు తెలియజేస్తున్నట్టు చిలకమర్తి తెలిపారు. ఈ పంచగ్రహ కూటమి ప్రతి సంవత్సరం లేదా రెండు సంవత్సరాలకు ఒకసారి ఏర్పడతాయి. ఇలా ఏర్పడిన సమయంలో చేసే పనులు, విశేషమైన శుభఫలితాలు ఇస్తాయని చిలకమర్తి తెలిపారు.

చిలకమర్తి పంచాంగరీత్యా ధృక్ సిద్దాంత గణితం ఆధారంగా జూన్ 6, 2024 పంచగ్రహ కూటమి ఏర్పడింది. ఈరోజు వైశాఖ మాస అమావాస్య అవడం చంద్రుడు రోహిణి నక్షత్రంలో ఉంటాడు. అలాగే వృషభ రాశిలో రవి చంద్రులు కలిసి ఉంటారు. శుభ గ్రహాలైన బుధుడు, బృహస్పతి, శుక్రుడు, సూర్యుడు, చంద్రుడు కలిసి పంచగ్రహ కూటమిగా ఏర్పడటం చాలా విశేషం.

ఈ కూటమి వృషభ రాశిలో ఏర్పడుతుంది. దీని ప్రభావం వృషభ, కర్కాటక, సింహ, కన్య, వృశ్చికం, మకరం, మేష రాశుల వారికి శుభ ఫలితాలు కలుగుజేస్తుందని చిలకమర్తి తెలిపారు. ఈ పంచగ్రహ కూటమి ఉన్న రోజున శుభ సమయం, శుభ లగ్నంలో ఏదైనా పనిని ప్రారంభిస్తే ఆ పని విశేష ఫలితమైన ఇస్తుందని చిలకమర్తి తెలిపారు.

ఈ కూటమి ప్రభావం ఏ రాశులకు ఎలా ఉంటుంది

మేష రాశి: పంచగ్రహ కూటమి ధన స్థానంలో ఏర్పడటం వల్ల ధన యోగం, కుటుంబ సౌఖ్యం, ఆనందం కలుగుతుంది.

వృషభ రాశి: జన్మ రాశిలో ఈ యోగం ఏర్పడటం వల్ల సౌఖ్యం, ఆనందం కలుగుతుంది. పని ఒత్తిడి అధికమగును.

మిథున రాశి: ఈ కూటమి ప్రభావం వల్ల ఖర్చులు అధికమగును.

కర్కాటక రాశి: పంచగ్రహ కూటమి వల్ల ధనలాభం, ఉద్యోగాభివృద్ధి కలుగుతుంది.

సింహ రాశి: సింహ రాశి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలించును. ఉద్యోగస్తులకు ప్రమోషన్ అనుకూలిస్తుంది.

కన్యా రాశి: ధనలాభం, వ్యాపార అభివృద్ధి , సౌఖ్యం కలుగుతుంది.

తులా రాశి: అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడటం వల్ల పని ఒత్తిళ్లు, ఆరోగ్య సమస్యలు, టెన్షన్ కలుగుతుంది.

వృశ్చిక రాశి: కుటుంబ సౌఖ్యం, ఆనందం పొందుతారు.

ధనూ రాశి: శత్రు పీడ అధికంగా ఉంటుంది.

మకర రాశి: ఆరోగ్యంలో మార్పు కలుగుతుంది. కుటుంబ సౌఖ్యం, ఆనందం పొందుతారు.

కుంభ రాశి: గ్రహ స్థితిలో మార్పు ఏర్పడి శుభ ఫలితాల వైపు ముందుకు కదులుతారు.

మీన రాశి: కొన్ని సమస్యలు వేధించును. వీరికి అంత అనుకూలమైన గ్రహ స్థితి లేదు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner