మన్వంతరము అంటే ఏమిటి? బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మనువులు పదునలుగురు. స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, ప్రస్తుతమనువు వైవస్వతుడు, సావర్ణి, రైభ్యుడు, రౌచ్యుడు, మేరుసావర్ణి మొదలైనవారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

మనువులు పదునలుగురు. స్వాయంభువుడు, స్వారోచిషుడు, ఉత్తముడు, తామసుడు, రైవతుడు, చాక్షుషుడు, ప్రస్తుతమనువు వైవస్వతుడు, సావర్ణి, రైభ్యుడు, రౌచ్యుడు, మేరుసావర్ణి మొదలైనవారు అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
స్వాయంభువ మన్వంతరమునందు సప్తర్షులు మరీచి, అత్రి, అంగి రసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, వశిష్ఠుడు. వీరు బ్రహ్మదేవుని కుమారులు. అగ్నీధ్రుడు, అగ్నిబాహువు, మేధ్యుడు, మేధాతిధి, వసువు, జ్యోతిష్మం తుడు, ద్యుతిమంతుడు, హవ్యుడు, సబలుడు, పుత్రుడు అను పదిమంది స్వాయం భువ మనువు పుత్రులు.
స్వారోచిష మన్వంతరమునందు ఋషులు ఉర్వుడు, స్తంబుడు, కశ్య పుడు, ప్రాణుడు, బృహస్పతి, దత్తుడు, అత్రి, చ్యవనుడు అనువారు. దేవతలు తుషితులు. స్వారోచిషుని పుత్రులు హవిఘ్నుడు, సుకృతి, జ్యాతి, ఆపుడు, మూర్తి, ప్రతీతుడు, నభస్యుడు, నభస్సు, ఊర్జస్సు"
ఉత్తమ మన్వంతరము నందు ఋషులు వశిష్ఠపుత్రులైన ఏడుగురు. హిరణ్యగర్భుని కుమారులు ఊర్థులు. ఉత్తముని కుమారులు పదిమంది. వారు ఇషుడు, ఊర్జస్సు, తనూర్ఖుడు, మధువు, మాధవుడు, శుచి, శుక్రుడు, సహుడు, నభస్యుడు, నభుడు. దేవతలు భానువులు.తామస మన్వంతరమునందు సప్తర్షులు కావ్యుడు, పృథువు, అగ్ని, జహ్నువు, ధాత, కపీనంతుడు, అకపీవంతుడు. దేవతలు ద్యుతి, తపస్యుడు, సుతపుడు, తపోభూతుడు, సనాతనుడు, తపోరతి, అకల్మాషుడు, తన్వి, ధన్వి, పరంతపుడు.
రైవత మన్వంతరమున సప్తర్షులు దేవబాహువు, యదుధ్రుడు, వేదశిరస్సు, హిరణ్యరోముడు, పర్జన్యుడు, ఊర్ధ్వబాహువు, సత్యనేత్రుడు. రైవతుని కుమారులు అభూతరజసుడు, ప్రకృతి, వారిప్లవుడు, రైభ్యుడు, ధృతిమంతుడు, అవ్యయుడు, యుక్తుడు, తత్త్యదర్శి, నిరుత్సుకుడు, అరణ్యుడు, ప్రకాశుడు, నిర్మోహుడు, సత్య వాక్కు, కృతి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
చాక్షుష మన్వంతరమునందు సప్తర్షులు భృగువు, నభస్సు, వివస్వంతుడు, సుధాముడు, విరజుడు, సహిష్ణువు, లేఖులను అయిదు గణములవారు దేవతలు. వారు అంగిరసపుత్రులు. చాక్షుషుని పుత్రులు రురుడు మొదలైనవారు.
వైవస్వత మన్వంతరమునందు సప్తర్షులు అత్రి, వశిష్ఠుడు, కశ్యపుడు, గౌతముడు, భరధ్వాజుడు, విశ్వామిత్రుడు, జమదగ్ని, దేవతలు సాధ్యులు, విశ్వే దేవతలు, వసువులు, మరుత్తులు, ఆదిత్యులు, అశ్వినులు, వైవస్వతునికి ఇక్ష్వా కుడు మొదలైనవారు పదిమంది కుమారులు.
రాబోవు సావర్ణి మన్వంతరమునందు సప్తర్షులు, రాముడు, ఆత్రేయుడు, అశ్వత్థామ, శరద్వంతుడు, కౌశికుడు, ఔర్వుడు, ఆయన కుమారులు వైరి, అధ్వరీ వంతుడు, శమనుడు, ధృతిమంతుడు, వసువు, అరిష్టుడు, అధృష్టుడు, వాజి, సుమతి అని బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.