Lord Hanuman: 9వ సంఖ్యతో హనుమంతుడికి సంబంధం ఏమిటి, ఆయన ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో తెలుసా?-what is link between number 9 and lord hanuman check who gets blessings of him and see the link with mars also ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Lord Hanuman: 9వ సంఖ్యతో హనుమంతుడికి సంబంధం ఏమిటి, ఆయన ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో తెలుసా?

Lord Hanuman: 9వ సంఖ్యతో హనుమంతుడికి సంబంధం ఏమిటి, ఆయన ఆశీర్వాదం ఎవరికి ఉంటుందో తెలుసా?

Peddinti Sravya HT Telugu
Feb 05, 2025 10:30 AM IST

Lord Hanuman: హనుమంతుడికి ఇష్టమైన సంఖ్య 9. ఈ సంఖ్యతో హనుమంతుడికి లోతైన అనుబంధం ఉంది. 9,18, 27 తేదీల్లో ఏ నెలలో పుట్టినా కూడా వారి యొక్క రాడిక్స్ నెంబర్ 9 అవుతుంది. మీ రాడిక్స్ సంఖ్య కూడా తొమ్మిది అయితే ఇప్పుడే మీకు ఎలాంటి ఇబ్బందులు రావొచ్చు, ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చు అనేది ఇప్పుడే తెలుసుకుందాం.

Lord Hanuman: 9వ సంఖ్యతో హనుమంతుడికి సంబంధం ఏమిటి
Lord Hanuman: 9వ సంఖ్యతో హనుమంతుడికి సంబంధం ఏమిటి (pixabay)

సంఖ్యాశాస్త్రంలో ప్రతీ అంకెకి ఏదో ఒక గ్రహం లేదా సంఖ్యాతిపతికి సంబంధించినది అయ్యి ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సంఖ్యలు ప్రజలందరి పై ప్రత్యేక ప్రభావాన్ని చూపిస్తాయి. 9 అనే సంఖ్య హనుమంతుడికి సంబంధించినదిగా పరిగణించబడుతుంది. 9వ సంఖ్యకు అధిపతి హనుమంతుడు.

హనుమంతుడికి ఇష్టమైన సంఖ్య 9. ఈ సంఖ్యతో హనుమంతుడికి లోతైన అనుబంధం ఉంది. 9,18, 27 తేదీల్లో ఏ నెలలో పుట్టినా కూడా వారి యొక్క రాడిక్స్ నెంబర్ 9 అవుతుంది. మీ రాడిక్స్ సంఖ్య కూడా తొమ్మిది అయితే ఇప్పుడే మీకు ఎలాంటి ఇబ్బందులు రావొచ్చు, ఎలాంటి ప్రయోజనాలను పొందవచ్చు అనేది ఇప్పుడే తెలుసుకుందాం.

తొమ్మిదితో హనుమంతుడికి ఉన్న బలమైన సంబంధం

  1. 9, 18, 27వ తేదీల్లో పుట్టిన వారికి హనుమంతుని ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. హనుమంతుడు కుజుడుకి సంబంధించిన వారు. హనుమంతుడుతో పాటు మంగళవారం కుజుడిని కూడా పూజిస్తాము.
  2. ఉద్యోగం లేదా వ్యాపారంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లయితే అంగారకుడు అశుభం లేదా చెడుగా ఉండడం వలన అవ్వచ్చు.
  3. ఒకవేళ కుజుడు చెడుగా ఉన్నట్లయితే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇంట్లో కుటుంబ సభ్యులు అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు.
  4. అదే కుజుడు శుభ స్థానంలో ఉన్నట్లయితే కుటుంబంలో అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటారు.
  5. ఎవరైతే ఏ స్వార్ధం లేకుండా వారి పనులు చేసుకుంటారో వారికి హనుమంతుడు ఆశీస్సులు కలుగుతాయి. నిర్మల హృదయం కలవారు, ఎలాంటి భేదం లేకుండా ప్రజలకు సహాయం చేసే వారు, సేవ చేసే వారికీ ఎప్పుడూ హనుమంతుడికి అనుగ్రహం ఉంటుంది.
  6. ఇలా ఈ విధంగా 9 సంఖ్య వారికి హనుమంతుడి అనుగ్రహం, కుజుడి అనుగ్రహం ఉంటాయి. ఎలాంటి భయం లేకుండా ఈ సంఖ్యకు సంబంధించిన వారు సంతోషంగా ఉంటారు.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

Whats_app_banner

సంబంధిత కథనం