గ్రహాలు కాలానుగుణంగా ఒక రాశి నుంచి మరో రాశిలోకి ప్రవేశిస్తూ ఉంటాయి. ఇలా గ్రహాలు రాశి మార్పు చెందినప్పుడు, కొన్ని కొన్ని సార్లు మరో గ్రహంతో సంయోగం చెందుతూ ఉంటాయి. అలాంటప్పుడు శుభయోగాలు, అశుభ యోగాలు ఏర్పడతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జాతకంలో అనేక యోగాలు ఏర్పడతాయి.
యోగాలలో ఉత్తమమైనది, అత్యంత మంగళకరమైనది గజకేసరి యోగం. ఈ యోగం వలన ఆర్థిక పురోభివృద్ధిని పొందవచ్చు. అలాగే, ఈ యోగం వలన ఉద్యోగంలో ప్రమోషన్లు కూడా వస్తాయి. ఆదాయం కూడా పెరుగుతుంది. ఇలా గజకేసరి రాజయోగం అనేక లాభాలను అందిస్తుంది.
గురువు, చంద్రుడు సంయోగం చెందినప్పుడు గజకేసరి యోగం ఏర్పడుతుంది. గురువు, చంద్రుడి కలయిక ద్వారా మనిషి జాతకంలో గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది. చంద్రుడు, గురువు వారికి శుభయోగాలను ప్రసాదిస్తారు. గజకేసరి రాజయోగం ఎవరి జాతకంలో అయితే ఏర్పడుతుందో, వారికి దేనికి లోటు ఉండదు. ఎప్పుడు అదృష్టం పొందుతారు. ఆర్థికంగా బలహీనమైన ఇంట్లో పుట్టినప్పటికీ ధనవంతులుగా, సంపన్నులుగా మారతారు.
ఏ అమ్మాయి జాతకంలోనైనా గజకేసరి రాజయోగం ఉందంటే, ఆ స్త్రీ జీవితంలో ఐశ్వర్యం, సంతానం, గృహం మొదలైన వాటితో జీవితాంతం సుఖ సంతోషాలతో ఉంటారు. విజయాలను అందుకుంటారు. ఈ యోగం స్త్రీలకు చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది.
జాతకంలో గజకేసరి యోగం ఉన్న పురుషుడు బలవంతుడు, తెలివైనవాడు, ఎనలేని ధైర్య సాహసాలతో ఉంటాడు. ఈ పురుషులు ధనవంతులుగా మారతారు. ఎక్కువ డబ్బులు వస్తాయి. ప్రతి దానిని కూడా నెరవేరుస్తాడు. గజకేసరి రాజయోగం నాలుగవ లేదా పదవ ఇంట్లో ఏర్పడినప్పుడు ఆ పురుషుడు తన వ్యాపార, వృత్తిలో ఉన్నత స్థానాన్ని పొందుతాడు.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, జాతకంలో ఏడవ ఇల్లు వివాహానికి సంబంధించినది. గజకేసరి యోగం ఏడవ ఇంట్లో ఏర్పడితే, వైవాహిక జీవితంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఈ యోగం కారణంగా ఆ వ్యక్తికి త్వరగా వివాహం జరుగుతుంది. అదృష్టం కూడా మరింత పెరుగుతుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.