ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి? ఆరోజు ఏం చేస్తారు?-what is eruvaka pournami know what we should do on this auspious day ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  What Is Eruvaka Pournami Know What We Should Do On This Auspious Day

ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి? ఆరోజు ఏం చేస్తారు?

ఏరువాక పున్నమి రోజు పశువులను పూజించాలని శాస్త్రాల సూచన
ఏరువాక పున్నమి రోజు పశువులను పూజించాలని శాస్త్రాల సూచన (pexels)

ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి? ఆరోజు ఏం చేస్తారో ఇక్కడ తెలుసుకోండి. తేదీ తదితర వివరాలు ఇక్కడ చూడొచ్చు.

ఏరువాక పౌర్ణమి రైతులకు సంబంధించిన అతిపెద్ద పండగ. దీనినే జ్యేష్ట పౌర్ణమి అంటారు. తొలకరి ఆసన్నమవగా దున్నడానికి సిద్ధంగా ఉన్న పంటపొలాన్ని శుద్ధి చేసుకుని సేద్యం మొదలుపెట్టే ఉత్సవాన్ని ఏరువాక పున్నమి అంటారు. ఏరుపొంగి పొర్లడానికి చేసే పూజ అని కూడా అంటారు. ఈ ఆదివారం జూన్ 4న ఏరువాక పౌర్ణమి రానుంది.

ట్రెండింగ్ వార్తలు

ఈరోజున భూమిని, పశువులను, సేద్యానికి అవసరమైన పనిముట్లను పూజించే పండగ ఇది. ప్రకృతిని పూజించే పండగే ఏరువాక పున్నమి. అయితే జ్యేష్ట మాసంలో భూమిని ఎక్కువగా తవ్వకూడదని చెబుతారు. భూమి వేడెక్కి ఉన్నప్పుడు తవ్వడం వల్ల అందులో నుంచి విష వాయువులు వెలువడతాయని నమ్మకం. కేవలం పూజ కోసం మాత్రమే కాసింత దున్నుతారు. వర్షం పడగానే తిరిగి సేద్యపు పనులు ప్రారంభిస్తారు.

ఏరువాక పౌర్ణమి రోజున పశువులకు స్నానం చేయిస్తారు. వాటి గిట్లకు పూజ చేస్తారు. గోమాతకు పూజ చేస్తారు. నాగళ్లను దున్నేందుకు కష్టపెడుతున్నందున క్షమించి కరుణించమని అన్నదాత వాటికి పూజ చేస్తాడు. ఆహారం పండించేందుకు సహకరించాలని కోరుతాడు.

బెల్లం, బియ్యం, ఆవుపాలతో పులగం వండి పశువులకు ఆహారంగా పెడతారు. రైతులు ఏరువాక పున్నమి పాటలు పాడుకుంటారు.

అలాగే సేద్యానికి అవసరమైన పరికరాలన్నింటికీ పూజ చేస్తారు. నాగలి, కర్రు, గొర్రు, పార, ఆకురాయి వంటి వాటికి పూజ చేస్తారు.

WhatsApp channel

టాపిక్