Shani : మీ రాశిలోకి శని ప్రవేశిస్తే తిట్టుకోకండి.. ఈ విషయం తెలిస్తే ఎగిరి గంతేస్తారు!
Lord Shani : శని.. ఈ పేరు వినగానే చాలా మంది కంగారు పడిపోతుంటారు. శనిదేవుడి ప్రభావం మనపై పడితే.. చాలా కష్టాలు పడాల్సి వస్తుందని అందరూ భ్రమపడిపోతుంటారు. వాస్తవానికి శని గురించి మరీ అంత భయపడిపోయి.. కంగారు పడాల్సిన అవసరం లేదని జ్యోతిష్కులు చెప్తున్నారు.
Shani devudu : పురాణాల ప్రకారం ప్రతి ఒక్కరూ చేసిన తప్పులకి కర్మఫలం అనుభవించక తప్పదు. ఆ కర్మఫలాలను సక్రమంగా పర్యవేక్షించేవాడే శనిదేవుడు అని చెప్తుంటారు. ఎవరైతే తప్పులు చేయకుండా క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతారో వారికి శుభాలు అందించే శని.. తప్పులు చేసిన వారిని శిక్షిస్తాడని పురాణాలు చెప్తున్నాయి.
మన రాశిలో శని ప్రభావం తక్కువగా ఉండటానికి, ఎక్కువగా ఉండటానికి చాలా వ్యత్యాసం ఉంది. ఒకవేళ మీ రాశిలో శని బలహీనంగా ఉంటే.. మీరు ఏ పని తలపెట్టినా అది విజయవంతం కావడానికి చాలా సమయం పడుతుంది. మీ జాతకంలో శని ఉన్నతంగా ఉంటే.. అప్పుడు ఏ చిన్న పని చేసినా.. నామమాత్రపు ప్రయత్నంలోనే సులువుగా విజయం సాధిస్తారు.
శని చాలా ఆలస్యంగా ఫలితాలు ఇస్తాడని.. అలానే శిక్ష కూడా దీర్ఘకాలం ఉంటుందని చెప్తుంటారు. కానీ మన కర్మలను బట్టి మాత్రమే శని ఆ శిక్షలు విధిస్తాడు. శని ప్రభావం మీపై ఉందని తెలిసిన తర్వాత కంగారు పడాల్సిన పనిలేదు.
మీరు ఉన్నతంగా ఆలోచిస్తూ.. మీ పనులు మీరు సక్రమంగా చేసుకుంటూ ఉంటే హ్యాగా ఉండొచ్చు. అయితే జాతకంలో శని స్థానాన్ని పరిగణనలోకి తీసుకుని.. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో మాత్రం ఆచితూచి అడుగులు వేయాలి.
శని ఉన్నంతగా ఉంటే..
మీ జాతకంలో శని బలహీనంగా ఉంటే మీరు డబ్బుల కోసం బాగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. శని మూడవ, ఆరవ, పదకొండవ స్థానంలో ఉంటే మీరు టెన్షన్ పడాల్సిన పనేలేదు. మీకు ఆర్థికంగా కూడా తిరుగుండదు. దీన్నే శని మహాదశ ప్రభావం అని కూడా జ్యోతిష్కులు అంటుంటారు.
మేష రాశిలో శని బలహీనంగా ఉంటాడు. ఈ రాశివారు సోమరితనాన్ని విడిచిపెట్టాలి. ఆశించినట్లుగా వేగంగా పని దొరకదు. ఉద్యోగాల కోసం కూడా చెమటోడ్చాల్సి వస్తుంది. అయితే.. పరిస్థితులను అర్థం చేసుకుని తప్పిదాలను దిద్దుకోగలిగితే.. ఆ ప్రభావాన్ని ఎంతో కొంత తగ్గించుకోవచ్చు.
శని ప్రభావం మనపై ఎక్కువగా ఉన్నప్పుడు.. శని చాలీసా పఠిస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. దాంతో శని ప్రభావం తగ్గి సానుకూల వాతావరణాన్ని కల్పిస్తాడని శాస్త్రాలు చెప్తున్నాయి.
శనిదేవుడికి ఆగ్రహం ఎక్కువ అని కూడా చాలా మంది చెప్తుంటారు. అందుకే శని ఆగ్రహానికి బలవ్వద్దంటూ కూడా హెచ్చరిస్తుంటారు. అయితే.. అందరూ చెప్పడం వెనుక ఒక కారణం కూడా ఉంది.
తండ్రిపై శనికి కోపం
సూర్య భగవానుడి రెండో కుమారుడే ఈ శనిదేవుడు. యమ ధర్మరాజుతో కలిసి పుట్టిన శని.. అంద వికారంగా, నల్లగా ఉండటంతో సూర్యుడు ఇష్టపడే వాడు కాదట. శనిని కనీసం తన కుమారుడు అని చెప్పడానికి కూడా సూర్యుడు ఇష్టపడకపోవడంతో.. దేవతలు కూడా శనిని దూరంగా పెట్టేశారు. దాంతో కోపం, ద్వేషంతో శని రగిలిపోయేవాడు. దాంతో అందరి దృష్టిలో శని ఒక చెడ్డవాడిగా మిగిలిపోయాడు.
కానీ.. శనికి తీవ్రస్థాయిలో భావోద్వేగాలు ఉన్నట్లు పురాణాలు చెప్తున్నాయి. తనని ఆరాధించే వారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు వారిని రక్షించే శక్తి సామర్థ్యాలు కూడా శనిదేవుడికి ఉన్నాయి. శని చాలీసా పఠించిన వారి పట్ల దయతో శని మెలుగుతాడు.