వర్షం పడినట్టు కలలు వస్తే దానికి అర్ధం ఏంటి? ఇలా కల వస్తే మాత్రం భారం తగ్గుతుంది, మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి!-what happens if you see rain in dreams according to swapna shastra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వర్షం పడినట్టు కలలు వస్తే దానికి అర్ధం ఏంటి? ఇలా కల వస్తే మాత్రం భారం తగ్గుతుంది, మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి!

వర్షం పడినట్టు కలలు వస్తే దానికి అర్ధం ఏంటి? ఇలా కల వస్తే మాత్రం భారం తగ్గుతుంది, మానసిక ఇబ్బందులు తొలగిపోతాయి!

Peddinti Sravya HT Telugu

నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలు కొన్ని సంకేతాలని అందిస్తాయి. వచ్చే కలలు ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు. స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వర్షం కనపడితే శుభమా, అశుభమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

కలలో వర్షాన్ని చూస్తే ఏమవుతుంది? (pinterest)

మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని కలలను గుర్తు పెట్టుకుంటాము. కానీ, కొన్ని కలల్ని కళ్ళు తెరవగానే మర్చిపోతూ ఉంటాము. కలలు మన జీవితంలో జరిగే విషయాలను గ్రహిస్తాయి. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలు కొన్ని సంకేతాలని అందిస్తాయి. వచ్చే కలలు ఆధారంగా భవిష్యత్తులో ఏం జరుగుతుందనేది తెలుసుకోవచ్చు.

స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వర్షం కనపడితే శుభమా, అశుభమా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్యం ప్రకారం, స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వర్షం కనపడితే ఏమవుతుంది?, దాని వలన ఎటువంటి ప్రభావాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందో చూద్దాం.

కలలో వర్షం కనపడితే శుభమా, అశుభమా?

కలలో వర్షం కనపడితే ఆర్థికపరంగా సమస్యలు తొలగిపోతాయి. సక్సెస్ ని కూడా అందుకోవచ్చు. రిలేషన్షిప్ లో ఇబ్బందులు తొలగిపోతాయి. కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. కలలు జీవితంలో ముఖ్యమైన సంబంధాన్ని కలిగి ఉంటాయి. జ్యోతిష్యం, డ్రీం సైన్స్ ప్రకారం ప్రతి కల ఏదో ఒక సంకేతాన్ని అందిస్తుంది. ఈ సంకేతాల ద్వారా మనం జాగ్రత్తగా ఉండాలి.

1.కలలో వర్షాన్ని చూస్తే ఏమవుతుంది?

ఒక వ్యక్తి స్పష్టంగా తేలికపాటి వర్షాన్ని కలగన్నట్లయితే శుభసంకేతంగా భావించాలి. ఈ కల జీవితంలో సానుకూల మార్పులను తెస్తుంది. ఆర్థిక శ్రేయస్సు, మానసిక శాంతి, కుటుంబంలో ఆనందం ఉంటాయి. కష్టమైన పరిస్థితిని ఎదుర్కొన్నట్లయితే ఈ కల మీ జీవితం అనుకూలంగా మారుతుందని చెప్తుంది.

2.భారీ వర్షం లేదా ఈదురు గాలులతో కూడిన వర్షం

భారీ వర్షం లేదా ఈదురు గాలులతో కూడిన వర్షం కానీ కలలో కనపడినట్లైతే జీవితంలో కొన్ని సవాళ్లకు లేదా మానసిక గందరగోళానికి సంకేతం అని అర్థం చేసుకోవాలి. ఈ కల జీవితంలో ఒత్తిడిని తీసుకువస్తుంది.

లేదంటే ఏదైనా నిర్ణయం మిమ్మల్ని మానసికంగా, అస్థిరంగా మార్చవచ్చు. ఇటువంటి కల వచ్చిందంటే మానసికంగా ఇబ్బందులు తొలగిపోతాయని, భారం నుంచి విముక్తి కలుగుతుందని కూడా చెప్పవచ్చు.

3.వర్షంలో తడిసినట్లు కలగన్నట్లయితే

వర్షంలో తడిసినట్లు కల వస్తే లోతైన భావోద్వేగానికి గురవుతున్నట్లు అర్థం. ప్రేమ, కరుణ, ఆధ్యాత్మిక, స్వచ్ఛతకు సంబంధించినది అవ్వచ్చు. కొన్నిసార్లు కొత్త సంబంధం ప్రారంభాన్ని కూడా ఇది సూచిస్తుంది. లేదంటే పాత సంబంధాలు తిరిగి మధురంగా మారవచ్చు అని చెప్తుంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.