కలలో మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడితే ఏం అవుతుంది? దానికి అర్ధం ఏంటంటే?-what happens if you see ex in dreams what is the reason according to swapna shastra ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  కలలో మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడితే ఏం అవుతుంది? దానికి అర్ధం ఏంటంటే?

కలలో మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడితే ఏం అవుతుంది? దానికి అర్ధం ఏంటంటే?

Peddinti Sravya HT Telugu

ప్రతి ఒక్కరూ నిద్రలో కలలు కనడం సహజం. ఒక్కోసారి మనకు ఎక్కువగా కలలు రావడం కూడా జరుగుతుంది. ఈ కలల వెనుక ఏదో ఒక సంకేతం ఉండే అవకాశం ఉంది. కొన్ని సార్లు, జీవితంతో అనుబంధం ఉన్న విషయాలు కూడా కలలో ప్రత్యక్షమవుతాయి. కలలో మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడితే ఏం అవుతుంది?

కలలో మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడితే ఏం అవుతుంది? (pinterest)

మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కొన్ని మంచి కలలు వస్తే, కొన్ని పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరూ నిద్రలో కలలు కనడం సహజం. ఒక్కోసారి మనకు ఎక్కువగా కలలు రావడం కూడా జరుగుతుంది. ఈ కలల వెనుక ఏదో ఒక సంకేతం ఉండే అవకాశం ఉంది. కొన్ని సార్లు, జీవితంతో అనుబంధం ఉన్న విషయాలు కూడా కలలో ప్రత్యక్షమవుతాయి. ఈ కలలు వచ్చే సందర్భాలను జాగ్రత్తగా విశ్లేషిస్తే, వాటి సంకేతాన్ని అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది.

స్వప్న శాస్త్రం పురాతనమైనది. అనేక మంది దీనిపై నమ్మకం కలిగి ఉంటారు. మనం నిద్రపోయినప్పుడు వచ్చే కలలు, జీవితంలో అనేక సంఘటనలతో సంబంధం కలిగి ఉంటాయని స్వప్న శాస్త్రం చెబుతోంది.

కలలో మాజీ ప్రియుడు లేదా ప్రేయసి కనిపిస్తే:

కలలో మీరు మాజీ ప్రియుడు లేదా ప్రేయసిని చూస్తే, మీరు ఇంకా వారిని మనసులోంచి పూర్తిగా వదలలేదని, వారి ఆలోచనలతో ఇంకా జీవిస్తూ ఉన్నారని అర్థం చేసుకోవాలి. వాళ్లు ప్రత్యక్షంగా కనబడకపోయినా, మెదడులో మాత్రం వారు ఇంకా ఉన్నారన్న సంకేతం ఇది.

పదేపదే మీ కలలో మీ మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడినట్లయితే మీరు వారిని బాగా మిస్ అవుతున్నారని కూడా అర్థం. అందుకనే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు బాధపడి ఆలోచించడం వలన వారు కలలోకి వస్తూ వుంటారు.

ఏమైనా చెప్పాలన్న విషయాన్ని చెప్పకుండానే బ్రేకప్ అయిపోతే కూడా పదేపదే మీ మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కలలో కనపడతారని స్వప్న శాస్త్రం ప్రకారం చెప్తోంది. బ్రేకప్ బాధ ఎక్కువగా ఉంటే కూడా కలలో మాజీ ప్రియుడు లేదా మాజీ ప్రేయసి కనపడతారు.

కలలో తెలియని వ్యక్తి ప్రపోజ్ చేయడం:

ఒకవేళ కలలో ఎవరో తెలియని వ్యక్తి ప్రపోజ్ చేస్తే అది కొత్త అనుబంధాలు జీవితంలోకి రాబోతున్నాయని సూచిస్తుంది. జీవితంలోకి కొత్త మనుషులు, కొత్త పరిచయాలు రాకముందు ఇటువంటి కలలు వస్తాయని స్వప్న శాస్త్రం వివరిస్తోంది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.