బల్లి పడితే శుభమా, అశుభమా? ఏ శరీర భాగంపై పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకోండి!-what happens if lizard falls on us check how it effects ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  బల్లి పడితే శుభమా, అశుభమా? ఏ శరీర భాగంపై పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకోండి!

బల్లి పడితే శుభమా, అశుభమా? ఏ శరీర భాగంపై పడితే ఎలాంటి ఫలితం ఉంటుందో తెలుసుకోండి!

HT Telugu Desk HT Telugu

బల్లి పడడం గౌళి శాస్త్రం అనే ఒక ఉపజ్యోతిష శాస్త్రం ద్వారా విశ్లేషించబడుతుంది. ఇది గరుడ పురాణం మరియు సంస్కృత శాస్త్ర గ్రంథాలలో ప్రస్తావించబడినది. బల్లి శరీరంపై పడే ప్రదేశం ఆధారంగా ఎటువంటి ఫలితాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది అనేది బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

బల్లి పడితే శుభమా, అశుభమా? (pinterest)

బల్లి పడడం గౌళి శాస్త్రం అనే ఒక ఉపజ్యోతిష శాస్త్రం ద్వారా విశ్లేషించబడుతుంది అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. ఇది గరుడ పురాణం మరియు సంస్కృత శాస్త్ర గ్రంథాలలో ప్రస్తావించబడినది. బల్లి శరీరంపై పడే ప్రదేశం ఆధారంగా శుభం లేదా అశుభాన్ని సూచిస్తుందని ఈ విశ్వాసం చెబుతోంది.

స్త్రీలపై బల్లి పడితే ఏమవుతుంది?

తల మీద ప్రాణభయం, కొప్పుపై రోగ భయము, పిక్కలు బంధుదర్శనం, ఎడమ కన్ను భర్త ప్రేమ, కుడి కన్నుమనోవ్యధ, వక్షమున సుఖము, కుడి చెంప పుత్ర లాభం, కుడి చెవి ధన లాభం, పై పెదవి విరోధములు, క్రింద పెదవి వస్తు లాభం, రెండు పెదాలు కష్టం.

స్తనములందు అధిక దు:ఖం, వీపుయందు మరణ వార్త, గోళ్ళపై కలహం, కుడి భుజం రతి సౌఖ్యం, బాహువులు భూషణ ప్రాప్తి, ఎడమ భుజం సుఖం, తొడలు వ్యభిచారం, మోకాళ్ళందు కష్టము, కుడికాలిపై శతృనాశనం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పురుషులపై బల్లి పడితే ఏమవుతుంది?

తల మీద కలహం, బ్రహ్మరంధ్రమున మృత్యువు, ముఖం ధన లాభం, ఎడమ కన్ను శుభం, కుడి కన్ను అపజయం, నుదురు బంధ సన్యాసం, కుడి చెంప దుఃఖం, ఎడమ చెవి లాభం, పై పెదవి కలహం, క్రింది పెదవి ధన లాభం, రెండు పెదవులపై మృత్యువు, నోటియందు రోగప్రాప్తి, ఎడమ మూపు జయం, వ్రేళ్ళపై స్నేహితుల రాక, కుడి భుజం కష్టం, ఎడమ భుజం అగౌరవము, తొడలపై వస్త్ర నాశనము, కుడిపాదం సుఖం, ఎడమపాదం కష్టము, పాదాలవెనుక ప్రయాణము, కాలివ్రేళ్ళు రోగపీడ.

తొండ ప్రాకిననూ ఇదే ఫలం చూచేది తొండ, బల్లిశరీరముపై ఎచ్చట పడిననూ వెంటనే తలస్నానము చేసి నూనె, నెయ్యి ఆముదం కలిపి దీపం పెట్టి ఉప్పు నైవేద్యం పెట్టి ఇష్టదైవమును ప్రార్ధించాలి. బల్లి తలపై నుండి క్రిందకి దిగిన మంచిది కాదు. క్రింది నుండి పైకి ప్రాకి వెంటనే దిగిన మంచిది. బల్లి ఇద్దరి మధ్యన (ఒకరిపై పడిన తర్వాత ఇంకొకరిపైకి జారడం) – పెద్ద మార్పులు, నిర్ణయాల సమయం, జాగ్రత్త అవసరం అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు..

పరిహార సూచనలు (అశుభం అనిపించినపుడు):

విష్ణు సహస్రనామం జపించడం.

గాయత్రీ మంత్రం 108 సార్లు పఠించడం.

శివలింగాభిషేకం చేయడం.

తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణలు చేయడం.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ