Maha Kumbhmela: కుంభమేళాలో తైమూర్ తో నాగసాధువులు యుద్ధం.. ఆరోజు ఏం జరిగిందో తెలుసా?
Maha Kumbhmela: 13వ శతాబ్దంలో కుంభమేళా జరుగుతోంది. ఆ మహా కుంభమేళకు ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చారు. కానీ తైమూర్ గురించి వారికి ఎవరికీ అవగాహన లేదు. అసలు తైమూర్ ఎవరు? ఎందుకు కుంభమేళాకు వచ్చాడు? నాగసాధువులకు ఎందుకు ఆగ్రహం వచ్చింది? ఆఖరకు ఏమైంది వంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.

కుంభమేళ అంటే ఎంతో మంది జనం ఎక్కడెక్కడ నుంచో వస్తారు. మహా కుంభమేళాకు ఈసారి కూడా భక్తులు భారీగా తరలి వస్తున్నారు. ఇది ఇలా ఉంటే ఇది వరకు ఒక సంఘటన చోటు చేసుకుంది. చాలా తక్కువ మందికి మాత్రమే దాని గురించి తెలిసి ఉంటుంది.
13వ శతాబ్దంలో కుంభమేళా జరుగుతోంది. ఆ మహా కుంభమేళకు ఎక్కడెక్కడ నుంచో భక్తులు వచ్చారు. కానీ తైమూర్ గురించి వారికి ఎవరికీ అవగాహన లేదు. తైమూర్ అసలు పేరు అమీర్ తైమూర్. ఉజ్బెకిస్తాన్లోని సమర్‌ఖండ్ దగ్గరనున్న కెష్ గ్రామంలో పుట్టారు.
ఇతను తురుష్క ప్రభావితమైన మంగోల్ తెగ బర్లాస్ కు చెందినవాడు. ఈయన స్థాపించిన తిమురిద్ రాజ్యమే మొఘల్ సామ్రాజ్యముగా అవతరించింది. చంగేజ్ ఖాన్ లాగే ప్రపంచాన్ని జయించాలనుకుని దండయాత్రలు మొదలుపెట్టాడు.
13వ శతాబ్దంలో కుంభమేళా హరిద్వార్ లో జరుగుతోంది. చాలా మంది భక్తులు వచ్చి, గంగా స్నానం చేస్తున్నారు. వారిలో చాలా మంది సాధువులు కూడా ఉన్నారు. మహిళలు భజనలు చేస్తున్నారు. వృద్దులు నది ఒడ్డున కూర్చుని ధ్యానం చేస్తున్నారు. చిన్న పిల్లలు ఇసుకలో ఆడుకోవడం, కొంతమంది పిల్లలు తండ్రి భుజాలపై కూర్చుని కుంభమేళా చూస్తున్నారు. అప్పటివరకు అంతా బానే ఉంది.
తైమూర్ యుద్ధం
కానీ తైమూర్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. కుంభమేళాలో భక్తి తారా స్థాయికి చేరుకుంది. నిరంజని, జున, పంచాగ్ని, అఖారాల జెండాలు ఆకాశంలో ఎగురుతున్నాయి. స్నానం చేసిన సాధువులు గంధపు తిలకాన్ని నుదుటిపై పూసుకుంటున్నారు.
తైమూర్ హృదయంలో కరుణ అస్సలు లేదు. ఆయన కత్తి ఎత్తితే రక్తంతో తడవాల్సిందే. కత్తి పెద్ద ఎత్తున ప్రజల్ని బలి తీస్తోంది. తైమూర్ శత్రువులపై మరణంలా విరుచుకుపడుతుంటాడు.
హిందువులని చంపేయడం మొదలుపెట్టాడు. దేవాలయాల్ని పగలగొట్టి విగ్రహాలని ధ్వంసం చేశాడు. ఇదంతా చూసిన నాగ సాధువులకి కోపం వచ్చింది. కుప్పలుగా పడి ఉన్న శవాలను చూసి మహిళలు, చిన్నారులు అరుపులకు నాగ సాధువులు ఆయుధాలు తీసారు. శివ భక్తులుగా పిలవబడే నాగ సాధువులు విపరీతంగా పోరాడారు.
తైమూర్ కి నాగ సాధువుల గురించి అసలు అవగాహన లేదు. తీవ్ర ఆగ్రహంతో నాగ సాధువులు యుద్ధం చేసే సరికి భయపడ్డాడు. వారి ఆవేశం ఆయన ఊహకే అందలేదు. ఇదంతా చూసి భయపడ్డాడు. ఒక ఆలయంలో దాడి చేసినప్పుడు విగ్రహం నుంచి పాములు, తేళ్ల సమూహం బయటకు వచ్చింది. దీంతో తైమూర్ సైన్యం మధ్య తొక్కిసలాట జరిగింది. ఇలా ఎంతో మందిని చంపిన తైమూర్ నాగ సాధువులకు భయపడాల్సిన పరిస్థితి చోటు చేసుకుంది.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
సంబంధిత కథనం