తలస్నానం చేయడానికి అనువైన రోజులు ఏవి? ఈ విషయంలో ఆడవారికి మగవారికి వేరు వేరు నియమాలు ఉంటాయా?
తలస్నానం చేయడం వల్ల శారీరక, మాసనిక శుద్ధితో పాటు ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుందని హిందువుల చెబుతున్నాయి. ఆచారాల ప్రకారం ప్రతిరోజు తలస్నానం చేయడం సరైన పద్దతి కాదట. తలస్నానం విషయంలో ఆడవారికి, మగవారికి ప్రత్యేకించి కొన్ని రోజులు ఉన్నాయి.
హిందూ సంప్రదాయాల ప్రకారం తలస్నానం అనేది శారీరక, మానసిక శుభ్రతను ప్రతిబింబించే ఆచారం. తలస్నానం చేయడం వల్ల ఆధ్యాత్మిక శుభ్రత, శాంతి, శక్తి ప్రాప్తిస్తాయి. వికృతి మలినాలు తొలగిపాతాయి. ఆరోగ్య ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక దృక్పథం కూడా పెరగడం వంటి లాభాలు కలుగుతాయి. ఇది శరీరాన్ని శుభ్రపరచడమే కాక, మనస్సును కూడా శాంతిపరచి, పూజకు మరింత పవిత్రను ఇస్తుంది. తలస్నానం ద్వారా మానసిక క్లాంతి తగ్గి, రక్తప్రసరణ మెరుగుపడుతుంది.శరీరానికి, మనస్సుకు శక్తినిస్తుంది. అయితే ప్రతి రోజూ తప్పకుండా తలస్నానం చేయాలనే నియమం ఎక్కడా లేదు. హిందూ ఆచార వ్యవహారాల ప్రకారం తలస్నానం చేయడానికి కొన్ని ప్రత్యేక రోజులు, సమయాలు ఉన్నాయి. అలాగే ఆడవారికీ మగవారికీ తలస్నానం విషయంలొ కొన్ని వ్యత్యసాలు కూడా ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
తలస్నానం చేయడానికి అనుకూలమైన రోజులు:
మంగళవారం, శుక్రవారం:
హిందూ సంప్రదాయాల ప్రకారం మంగళవారం, శుక్రవారాలు తలస్నానం చేయడానికి చాలా పవిత్రమైన రోజులు. ఈ రోజులు శారీరక శుద్ధి, ఆరోగ్యం, శ్రేయస్సు కోసం అనుకూలంగా ఉంటాయని విశ్వాసం. ముఖ్యంగా మహిళలు శుక్రవారం తలస్నానం చేయడం శుభప్రదంగా ఉంటుంది.
పౌర్ణమి, అమావాస్య
ఆధ్యాత్మిక శాస్త్రంలో పౌర్ణమి, అమావాస్య తిథులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. ఈ తిథుల్లో తలస్నానం చేసి దైవారాధన చేయడం, అమావాస్య రోజున తలస్నానం చేసి పితృదేవతలకు తర్పణం ఇవ్వడం అత్యంత శ్రేయస్కరం.
ప్రత్యేక పర్వదినాలు
దీపావళి, సంక్రాంతి, కార్తిక పౌర్ణమి, నవరాత్రి మొదలైన పండుగలు పర్వదినాల్లో తలస్నానం చేయడం అత్యంత పుణ్యప్రదంగా ఉంటుంది. ప్రత్యేక పూజలు ఉపవాసం చేసే రోజుల్లో తలస్నానం చేయడం మానసిక, శారీరక శుద్ధికి చాలా అవసరమని విశ్వాసం.
గ్రహణం తర్వాత
శాస్త్రాల ప్రకారం కాలానుగుణంగా వచ్చే సూర్య, చంద్రుల గ్రహణం అనంతరం తలస్నానం చేయడం తప్పనిసరి. ఇది శరీర పవిత్రతకు కీలకం.
ఆరంభాలు లేదా ప్రత్యేక కార్యాలు
పుట్టిన రోజు, పెళ్లి రోజు, వివాహం, గృహప్రవేశం వంటి శుభకార్యాలు, పూజల సమయాల్లో, అలాగే వ్యాపారం లేదా ముఖ్యమైన పనులను ఆరంభించినప్పుడు ఉదయాన్నే తలస్నానం చేయడం అనివార్యం. ఇది పవిత్రకు, శుభానికి మార్గం.
తలస్నానం చేయకూడని రోజులు కూడా ఉన్నాయి?
గురువారం:
ప్రాంతీయ సంప్రదాయాల్లో గురువారం తలస్నానం చేయడం అపవిత్రంగా భావిస్తారు. ప్రత్యేకంగా మహిళలు గురువార రోజున తలస్నానం చేస్తే గృహశాంతి, లక్ష్మీ దేవి అనుగ్రహం దెబ్బతింటాయని విశ్వాసం. ఇది గృహశాంతి కోసం కొందరు పాటించే ఆచారం.
శనివారం:
శనివారం తలస్నానం చేయడం కొన్ని సంప్రదాయాల ప్రకారం అనుకూలం కాదు. శని దేవుడికి సంబంధించిన నమ్మకాల ప్రకారం ఈ రోజున తలస్నానం చేయడం మంచిది కాదు.
తలస్నానం విషయంలో మగవారికి ఆడవారికి మధ్య తేడా:
- ఆదివారం: మగవారికి తలస్నానం చేసేందుకు ఆదివారం అనుకూలంగా భావిస్తారు.ఇది శ్రామిక శరీరానికి విశ్రాంతి, శుద్ధి కలిగించే రోజు.
- మంగళవారం: పురుషులు మంగళవారం తలస్నానం చేయడం శుభప్రదం. శారీరక శక్తిని పెంచడానికి ఇది అనువైన రోజునగా భావిస్తారు. అగ్ని తత్వానికి సంబంధించిన రోజు కావడంతో శారీరక పవిత్రతకు ఈ రోజు మంచిది.
- శుక్రవారం: శుక్రవారం తలస్నానం మగవారికి చాలా మంచిదని ప్రాంతీయ సంప్రదాయాలు చెబుతున్నాయి.
- ఆడవారికి విషయానికొస్తే మంగళవారం, శుక్రవారం ఈ రెండు రోజులు ఆడవారు తలస్నానం చేసేందుకు చాలా శుభప్రదంగా భావిస్తారు. శుక్రవారం ప్రత్యేకంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి తప్పకుండా తలస్నానం చేయాలని నమ్మిక. అలాగే గురువారం ఆడవాళ్లు అస్సలు తలస్నానం చేయకూడదు, కానీ మగవారు మాత్రం ఈ రోజు తలంటు పోసుకోవడం శుభం ఫలితాలను కలిగిస్తుంది.