ఈ రత్నంతో ప్రేమ, సంపద రెండు పెరుగుతాయి.. ప్రపంచాన్నే గెలుచుకోవచ్చు!-what are the benefits of wearing opal stone this will change your life and brings wealth ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ రత్నంతో ప్రేమ, సంపద రెండు పెరుగుతాయి.. ప్రపంచాన్నే గెలుచుకోవచ్చు!

ఈ రత్నంతో ప్రేమ, సంపద రెండు పెరుగుతాయి.. ప్రపంచాన్నే గెలుచుకోవచ్చు!

Peddinti Sravya HT Telugu

రత్నాలను ధరించడం వలన జీవితమే మారిపోవచ్చు. ఈ రత్నం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఒపల్ రత్నం ధరిస్తే చాలా సమస్యలు తీరిపోవచ్చు. ప్రేమ, సంపద రెండు పెరుగుతాయి. ప్రపంచాన్నే గెలుచుకోవచ్చు. ఎవరు ధరిస్తే మంచిది? ఎలా ధరించాలి వంటివి కూడా తెలుసుకుందాం.

ఈ రత్నంతో ప్రేమ, సంపద రెండు పెరుగుతాయి (pinterest)

చాలా మంది రకరాల రత్నాలను ధరిస్తారు. రత్నాలను ధరించడం వలన జీవితమే మారిపోవచ్చు. ఈ రత్నం గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఒపల్ రత్నం ధరిస్తే చాలా సమస్యలు తీరిపోవచ్చు.

ఒపల్ రత్నం

ఈ రత్నానికి అధిపతి శుక్రుడు. ఈ రత్నాన్ని ధరించడం వలన శుక్రుడి స్థానాన్ని బలపరుస్తుంది. ఇది మిల్కీ రంగులో లేదా తెలుపు రంగులో ఉంటుంది. కొంచెం మెరుస్తూ ఉంటుంది. ఈ రత్నాన్ని ధరిస్తే వ్యక్త జీవితంలో ప్రేమ, సంపద, శ్రేయస్సు కలుగుతాయి. ఈ రత్నాన్ని ధరించేటప్పుడు కొన్ని విషయాలను గుర్తుపెట్టుకోవాలి. అలాగే రత్నాన్ని ఎప్పుడు ధరించాలి?, ఎవరు ధరిస్తే బాగుంటుంది వంటి విషయాలని కూడా తెలుసుకుందాం.

ఎవరు ధరిస్తే మంచిది? ఎలా ధరించాలి

రత్న శాస్త్రం ప్రకారం గ్రహాలు రాశిని ఎలా ప్రభావితం చూపిస్తున్నాయో చూసి దాని ప్రకారం ఈ రత్నాన్ని ధరించడం మంచిది. ఈ రత్నాన్ని ఎలా ధరించాలి అనేది చూస్తే.. ఈ రత్నాన్ని వెండి ఉంగరంతో పాటుగా ధరించవచ్చు.

శుక్రవారం నాడు ఈ రత్నాన్ని ధరించడానికి అనుకూలంగా ఉంటుంది. గంగాజలం లేదా పచ్చిపాలతో ఈ ఉంగరాన్ని శుభ్రం చేసి, ఆ తర్వాత శుక్రవారం నాడు ధరిస్తే మంచిది.

ఈ రత్నాన్ని ఎవరు ధరించవచ్చు?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్రుని రత్నమైన ఒపల్ ని వృషభ, తులా రాశి వారు వారు ధరించవచ్చు. కన్య రాశి, మిధున రాశి, కుంభ రాశి, మకర రాశి వారు కూడా ఈ రత్నాన్ని ధరించవచ్చు.

ఎవరు ధరించకూడదు?

రత్నశాస్త్రం ప్రకారం పగడం, ముత్యాలు, రూబీ వంటి రత్నాలను ఈ రత్నంతో పాటు ధరించకూడదు. ఈ రత్నాన్ని ధరించే ముందు జాతకంలో గ్రహాల స్థితిని చూసుకుని జ్యోతిష్యుని సలహా మేరకు ధరిస్తే మంచిది.

గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

పెద్దింటి శ్రావ్య హిందుస్తాన్ టైమ్స్ లో ఫ్రీలాన్స్ కంటెంట్ రైటర్. వెయ్యికి పైగా కవితలు రాశారు. వివిధ పత్రికల్లో అవి ప్రచురితం అయ్యాయి. బీఏ (సైకాలజీ), బీఈడీ పూర్తి చేసారు. జర్నలిజంలో ఆరేళ్లకు పైగా అనుభవం ఉన్న ఆమె జ్యోతిష శాస్త్ర సంబంధిత వార్తలు రాయడంలో నైపుణ్యం కలిగి ఉన్నారు. గతంలో పలు వెబ్ సైట్లలో కంటెంట్ రైటర్ గా పనిచేశారు.