నాగ సింధూరాన్ని ఎందుకు ధరించాలి..?, నాగ సింధూరంతో ఎలాంటి లాభాలను పొందవచ్చు..?
సాధారణ కుంకుమను కొందరు ధరిస్తే, కొంత మంది నుదుటిన నాగ సింధూరాన్ని ధరిస్తారు. నాగ సింధూరాన్ని ఎందుకు ధరించాలి..? చాలా మందికి నాగ సింధూరం గురించి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి. నుదుటన నాగ సింధూరాన్ని పెట్టుకోవడం వలన దిష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా సర్ప దోషాలు కూడా పరిష్కారం అవుతాయి.
Naga sindhuram: సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక మన భారతదేశం. హిందూ సమాజానికి, హిందూ సంప్రదాయాలకు ప్రపంచ దేశాల్లో ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మన భారతదేశంలో అనేక సంప్రదాయాలని పాటిస్తూ ఉంటాము. పూర్వికులు పెట్టిన ఆచారాలను కొట్టిపారేయకుండా ఇంకా మన భారత దేశంలో ఎంతో మంది అనుసరిస్తున్నారు. నుదుటన కుంకుమ ధరించడం కూడా మన ఆచారమే. పెళ్లయిన ప్రతి స్త్రీ నుదుట బొట్టు పెట్టుకోవాలి. నుదుటన బొట్టు పెట్టుకోవడం శుభకరం. ఐదవతనానికి సంకేతం. అందుకని స్త్రీలు ఎప్పుడూ కూడా బొట్టు పెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు.
స్త్రీలు ఎందుకు నుదుటన బొట్టు పెట్టుకోవాలి?
నుదుటన స్త్రీలు ఎందుకు బొట్టు పెట్టుకోవాలనే దాని వెనుక కారణాలు అయితే చాలానే ఉన్నాయి. పద్మ పురాణం ప్రకారం చూసినట్లయితే, స్త్రీలు కుంకుమ బొట్టు పెట్టుకుంటే భర్త ఆయుష్షు పెరుగుతుందట. ఆగ్నేయ పురాణంలో, పరమేశ్వర సంహితలో కూడా ఇదే చెప్పడం జరిగింది.
బ్రహ్మస్థానములోనే పెట్టుకోవాలి:
ప్రతీ శరీర అవయవానికి ఒక్కో ఆదిదేవత ఉంటారు. నుదుటికి ఆదిదేవత బ్రహ్మ. బ్రహ్మస్థానమైన నుదుటిన బొట్టు పెట్టుకోవడం వలన శుభం కలుగుతుంది. బొట్టు పెట్టుకోవడం వలన మెదడు ఉత్సాహంగా ఉంటుంది. నాడులన్నీ చక్కగా పని చేయడం వలన ఏకాగ్రతని పెంపొందించుకోవచ్చు. ఉత్సాహంగా ఉండొచ్చు.
ఏ వేలుతో బొట్టు పెట్టుకోవాలి?
- మధ్య వేలుతో బొట్టు పెట్టుకుంటే ఆయవు, సంపద కలుగుతాయి.
2. ఉంగరపు వేలుతో పెట్టుకుంటే శాంతి, జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు.
3. బొటనవేలుతో బొట్టు పెట్టుకుంటే అభివృద్ధి కలుగుతుంది.
4. ఎదుట వాళ్లకి బొట్టు పెట్టేటప్పుడు చూపుడు వేలుతో పెట్టాలి. మధ్య వేలుతో కానీ ఉంగరం వేలుతో కానీ ఎదుటి వాళ్ళకు బొట్టు పెడితే వాళ్ళ కర్మలు మనకి వచ్చి పడతాయట.
నాగ సింధూరాన్ని ధరిస్తే ఇన్ని లాభాలను పొందవచ్చు:
సాధారణ కుంకుమను కొందరు ధరిస్తే, కొంత మంది నుదుటిన నాగ సింధూరాన్ని ధరిస్తారు. నాగ సింధూరాన్ని ఎందుకు ధరించాలి..? చాలా మందికి నాగ సింధూరం గురించి తెలియని కొన్ని విషయాలు ఉన్నాయి.
నుదుటన నాగ సింధూరాన్ని పెట్టుకోవడం వలన దిష్టి దోషాలు తొలగిపోవడమే కాకుండా సర్ప దోషాలు కూడా పరిష్కారం అవుతాయి.
వర్చస్సు, కాంతి:
నాగ సింధూరాన్ని నుదుటన ధరించడం వల్ల ముఖానికి వర్చస్సు కలిగి ముఖంలో కాంతి పెరుగుతుంది. రకరకాల దోషాల నుంచి బయటపడేయడానికి నాగ సింధూరం ఉపయోగపడుతుందని జ్యోతిష్య శాస్త్రం చెప్తోంది.
ఆకర్షణ శక్తి:
నాగ సింధూరం ఆకర్షణ శక్తిని పెంపొందిస్తుంది. ఎవరినైనా సులువుగా ఆకట్టుకోవచ్చు.
ఖర్చులు తగ్గుతాయి:
ఆర్థిక ఇబ్బందులతో చాలా మంది సతమతమవుతుంటారు. అలాంటి వారు నాగ సింధూరం ధరిస్తే ఖర్చులు పెరగవు. ఆర్థిక ఇబ్బందులు లేకుండా సంతోషంగా ఉండొచ్చు.
భార్యాభర్తలు సమస్యలు:
నాగ సింధూరం ధరిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు పరిష్కారం అవుతాయి. అన్యోన్యంగా ఉంటారు.
సంబంధిత కథనం