Ashta siddhi: అష్టసిద్ధులు అనగా ఏమి? ఇవి ఉన్న వారికి మోక్షం లభించదా?-what are ashta siddhi do those who have these not get salvation ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Ashta Siddhi: అష్టసిద్ధులు అనగా ఏమి? ఇవి ఉన్న వారికి మోక్షం లభించదా?

Ashta siddhi: అష్టసిద్ధులు అనగా ఏమి? ఇవి ఉన్న వారికి మోక్షం లభించదా?

HT Telugu Desk HT Telugu
Jun 12, 2024 07:16 PM IST

Ashta siddhi: అష్ట సిద్ధులు అంటే ఏంటి? వీటి వల్ల మరణించిన తర్వాత మోక్షం పొందలేరా? అనే వివరాల గురించి పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ చక్కగా వివరించారు.

అష్టసిద్ధులు అనగా ఏమి?
అష్టసిద్ధులు అనగా ఏమి? (pixabay)

Ashta siddhi: ఈ సృష్టిలో అనేక ప్రాణకోటి ఉన్నది. ఈ ప్రాణులలో మనుష్యులు, పశువులు, పక్షులు, చెట్లు, అనేక క్రిమికీటకాలు వంటి అనేక జీవరాశులు ఉన్నవి. ఈ జీవరాశులు అన్నిటిలో మానవ జన్మ ఉత్తమమైన జన్మ.

మానవ జన్మ మోక్షము పొందడానికి ఉత్తమము అవ్వడం చేతనే మానవ జన్మ ఉత్తమమైనదని సనాతన ధర్మం చెప్పినట్లుగా ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. దేవతలు సైతం మోక్షం పొందడం కోసం మానవ జన్మను పొందే ప్రయత్నం చేస్తారని సనాతన ధర్మం చెపుతోంది. మానవ జన్మలో చేసే పాపాల వల్ల అథో లోకాలను పొందడం పశుపక్షాది జన్మలను ఎలా పొందుతామో పుణ్య కార్యాల వలన ఊర్థ్వ లోకాలు సుఖభోగాలు, సౌఖ్యముతో కూడిన మానవ శరీరాలు పొందుతారు. జీవుడు మోక్షం పొందనంత వరకు ఈ కాలచక్రంలో పాప పుణ్యాలను బట్టి కర్మ ఫలితాలను అనుసరించి జన్మలను పొందవలసిందే అని చిలకమర్తి తెలిపారు.

ఈ జన్మల నుండి బయట పడడం కోసం నిర్గుణ మార్గములో రాజయోగాది అభ్యాసములలో సహజ అమనస్క రాజయోగ మార్గాల ద్వారా నిత్య ధ్యాన ప్రక్రియలో కొనసాగేటువంటి సాధకులకు కొన్ని సిద్ధులు ఏర్పడేటటువంటి సిద్ధులు కలుగును. ఇలాంటి సిద్ధులు పొందినా కూడా వాటికి దాసోహం అవ్వక తత్త్వమును ఎరిగి మోక్షమార్గానికి ప్రయత్నం చేసుకునే వారు మోక్షమును పొందెదరు. అలా ప్రయత్నించగా ఈ అష్ట సిద్ధులలో కొట్టుమిట్టాడేటటువంటి వారికి మరొక జన్మ తప్పదని ప్రముఖ అధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

అష్టసిద్ధులు ఏవంటే..

1. అణిమ : అన్ని జంతువుల కంటె స్వల్ప జంతువు వలె కనుపడుట. తన ఆకారమున కంటె కొద్ది ఆకారము గల జీవము వలె ఉంటారు.

2. మహిమ : బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులకంటే పెద్దవాడుగా కనబడుట, అన్నింటికంటెను ఆధిక్యతగా నుండుట.

8. లఘిమ : దూదికంటెను తేలికమై యుండుట. ఏ మాత్రమును బరువును లేకుండుట. ఆకాశగమనము కలిగియుండుట.

4. గరిమ : బరువు గల సమస్త జీవములకంటెను, సమస్త పదార్థములకంటెను బరువై యుండుట, ఇనుము కంటెను విశేష బరువుగా నుండుట.

5. ప్రాప్తి : కోరినదానినెల్ల గలుగజేసికొనుట. ఏ ఆకారం కావాలంటే ఆ ఆకారంలోకి మారిపోతారు. కోరినచోటికెల్ల క్షణమాత్రములో వెళ్లిపోతారు. కోరిన వస్తువును గాని జీవమును గాని తన యొద్దకు తెప్పించుకొనుట.

6. ప్రాకామ్యము : ఆకాశగమనము గలిగియుండుట. తన శరీరమును వదలి త్రిలోకసుందరమగు యవ్వనరూపమును దాను గోరినంతకాలము బొందియుండుట.

7. వశిత్వము : సమస్త జంతువులను దుష్టమృగమములను పెద్దపులి, చిరుతపులి, సింహము, మదగజము మొదలుగుగా గల అడవి జంతువులను, మొసలి చేప తాబేలు మొదలుగా గల నీటి జంతువులను, సర్పములు మొదలుగా గల వాటిని మచ్చిక చేసి వశపరచుకొనుట.

8. ఈశత్వము కామ కోథ లోభ మోహ మద మాత్సర్యములనెడు అరిషడ్వర్లమును జయించి ఆధ్యాత్మికాధి ఇహాతికాధిదైవికములనెడు తాపత్రయములు అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel