ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని అనుకుంటారు. జీవితంలో ఏ ఇబ్బందులు కలగకుండా ఉండాలని చూస్తూ ఉంటారు. చాలామంది లైఫ్‌లో సంతోషం, శాంతి కలగాలని కష్టపడతారు. అయినా, కొన్ని కొన్ని సార్లు అడ్డంకుల వలన లక్ష్యాన్ని సాధించలేక ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.
మనకు ఎదురయ్యే అడ్డంకాలను హిందూ సంప్రదాయాల్లో అష్టదరిద్రాలు అని అంటారు. ఆర్థిక, జ్ఞాన, సామాజిక, ఆరోగ్య, ఆధ్యాత్మిక, కర్మ, సంతోషం రంగాల్లో కష్టాలు వస్తాయి. ఎనిమిది దరిద్రాలు అశాంతి, అసంతృప్తిని కలిగిస్తాయి. జీవన నాణ్యత కూడా దెబ్బతీస్తాయి. ఈరోజు అష్ట దరిద్రాలంటే ఏంటి, దీని వలన ఎటువంటి ప్రభావం మన జీవితంలో పడుతుంది, వాటిని ఎలా అధిగమించాలి వంటి విషయాలని చూసేద్దాం.
జీవితంలో సవాళ్లు అష్టదరిద్రాల రూపంలో ఒక్కొక్కటిగా వచ్చినా, కలిపి వచ్చినా సరే, జీవితంలో సవాళ్లు అని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అనుకున్నవి పూర్తి చేయలేము. సంతోషం ఉండదు. అశాంతిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. జీవితంపై అష్టదరిద్రాల ప్రభావం ఎలా ఉంటుందో కూడా తెలుసుకుందాం.
అష్ట దరిద్రాలను తొలగించడానికి ముందు ఆ వ్యక్తి కష్టపడి పని చేయాలి. డబ్బుని సరిగ్గా ఖర్చు చేయాలి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. జ్ఞాన దరిద్రం ఉన్నట్లయితే విద్య, జ్ఞాన సాధన చాలా ముఖ్యమైనవి. ఇతరులతో కనెక్ట్ అయి మాట్లాడుతూ ఉంటే సామాజిక దరిద్రాన్ని తొలగించవచ్చు.
ప్రతి రోజూ పూజ, ధ్యానం వంటివి పాటిస్తే ఆధ్యాత్మిక దరిద్రాన్ని తొలగించవచ్చు. దానధర్మాలు చేస్తే కర్మ దరిద్రాలను తొలగించవచ్చు. కుటుంబంతో సమయాన్ని గడిపితే సంతాన, సంతోష దరిద్రాలను తొలగించవచ్చు.
గమనిక : ఈ కథనంలో మీకు అందించిన సమాచారం, సూచనలు పూర్తిగా నిజమైనది, ఖచ్చితమైనది అని మేము చెప్పలేము. నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.