Weekly Horoscope: ఈ వారం ఈ రాశులకు కృషికి తగిన ఫలితం.. అకస్మిక ధన రాబడి, దూర ప్రయాణాలతో పాటు ఎన్నో-weekly horoscope these zodiac signs will get good results happiness wealth and many more check yours also ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Horoscope: ఈ వారం ఈ రాశులకు కృషికి తగిన ఫలితం.. అకస్మిక ధన రాబడి, దూర ప్రయాణాలతో పాటు ఎన్నో

Weekly Horoscope: ఈ వారం ఈ రాశులకు కృషికి తగిన ఫలితం.. అకస్మిక ధన రాబడి, దూర ప్రయాణాలతో పాటు ఎన్నో

HT Telugu Desk HT Telugu
Published Feb 16, 2025 03:15 AM IST

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 16.02.2025 నుంచి 22.02.2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

Weekly Horoscope: ఈ వారం ఈ రాశులకు కృషికి తగిన ఫలితం
Weekly Horoscope: ఈ వారం ఈ రాశులకు కృషికి తగిన ఫలితం

రాశిఫలాలు (వారఫలాలు) 16.02.2025 నుంచి 22.02.2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం

మాసం: మాఘ మాసం, తిథి : కృ. చవితి నుంచి కృ. నవమి వరకు

మేష రాశి

మానసిక ఒత్తిడి సమస్యలు అధికంగా ఉన్నప్పటికీ యోగ మెడిటేషన్ మొదలైంది చేయడం వల్ల మంచిది. స్నేహితుల సలహా సహకారంతో సంతానం విష యంలో నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ల దానికి మీరు చేసే కార్యక్రమాలలో వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం కూడా లభిస్తుంది.

విద్యార్థులకు విద్యా సంబంధ అంశాల్లో రాత నైపుణ్యాలు తగిన విధంగా ఆసక్తి పెంచుకోవాలి ఉప సనాబలం పైన శ్రద్ధ తీసుకుం టూ నైరశ్యాన్ని దూరం చేసుకుని ముందుకు సాగాలి. ఆలోచనలో ఆలస్యాలు ఉన్నప్పటికీ ముఖ్యమైన శ్రేయోభి లాషల యొక్క సలహా సహకారంతో సమస్యల అధికమి స్తారు. డివియేషన్సు స్నేహ సంబంధాలు వల్ల విద్యా సంబంధ ఇబ్బంది అధికంగా ఉంటాయి.

వృషభ రాశి

రాశి వారికి విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు మీద తగిన శ్రద్ద తీసుకోవాలి. ముఖ్యంగా పరీక్షలు రాసేటప్పుడు శ్రీపాయ గ్రీవాయనమః మంత్రాన్ని పట్టించడం చాలా మంచిది. విద్యాపరమైన నూతన విషయాలు తెలుసుకుం రుతల్లి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేకమైన శ్రద్ధ తీసు కుంటారు గృహవాతావరణం, ముఖ్యంగా గృహంలో చిన్న పాటి రిపేర్లు వాహనానికి సంబంధించిన అంశాలు కొంత చికాకులు కలిగిస్తుంది.

అయినప్పటికీ వాటిని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళతారు వారం మధ్యలో నూతన సృజనాత్మకమైన నిర్ణయాలు అనుకూలంగా ఉంటాయి. ఉద్వేగాలని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది. సంతానం యొక్క అభివృద్ధి విషయంలో కొత్త విషయాలు వింటారు.

మిధున రాశి

కమ్యూనికేషన్ విషయంలో కొంత ఇబ్బందులు అధికంగా ఉంటాయి మాట్లాడవలసిన సను యంలో మాట్లాడకపోవడం వల్ల కూడా కొన్ని అవకాశాలు కోల్పోయే రీత్యా మీరెంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలిఆత్మీయ వ్యక్తుల సహకారంతో చెప్పవలసిన మాటలను చక్కగా చెబుతూ ఫలితాలు సాధించాలి.

ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వాలు అగ్రిమెంట్లు పనికిరాదు. వ్యక్తుల సహకారం తీసుకోవడానికి మనసు నిరాకరిస్తుంది. వారం మధ్యలో గృహ వాతావరణం వాహనాన్ని సంబంధించిన విషయాలు, సౌకర్యాలు, నూతన గృహ నిర్మాణ విషయంలో ఆగిన పనులు కొంత చర్చకు రావడం జరుగుతుంది.

కర్కాటక రాశి

కుటుంబంలోని వ్యక్తులతో చర్చలు చేసి స్థిర ఆస్తుల కొరకు నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం. పెట్టు ఐదులకి సంకల్పం.మీ ఇంటికి బంధువులు రాక, తల్లితండ్రుల సహకారంతో గృహ ప్రయత్నాలు, భూమి కొనుగోలు కొరకు ఆలోచిస్తారు. ఆర్థికంగా ఖర్చులు అధికంగా ఉంటాయి రావలసినదని రావడంలో కొంత అలస్యాలు ఉ ంటాయి.

నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. ఇచ్చిన మాట నిల బెట్టుకోవడం కొంత కష్టంగా ఉంటుంది కుటుంబ వ్యవ హారాలలో ఇతరుల జోక్యం కొంత విసుగును కలిగిస్తుంది. వారం మధ్యలో వృత్తికి సంబంధించిన విషయాలలో అవలీలగా ముందుకు వెళతారు. ఆగుతూ వస్తున్న పనులు ముందుకు పెడతాయి. సంకల్ప బలం పెరుగుతుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది.

సింహ రాశి

సంతానం యొక్క అభివృద్ధి అంశాలలో సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు సహకారంతో ముందు అడుగు వేస్తారు. జ్ఞాపకశక్తిని పెంచుకునే విధంగా కృషి చేయాలి. వృత్తిపరమైన ప్రయత్నాలు చాలా వరకు అను కూలంగా ఉంటాయి. ముఖ్యంగా తల్లి జీవిత భాగ స్వామితో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలని కోరిక బలంగా ఉంటుంది.

మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం వల్ల అందరికీ దూరంగా ఉంటారు. అయినప్ప టికీ అవన్నీ మీ మనోబలంతో జయించే ప్రయత్నాలు చేయాలి, ప్రవచనాలు మొదలైన వాటి మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. అధ్యాత్మిక ధోరణి, నైరాస్యమైన ఆలోచనలు, మీ మీద మీకు శ్రద్ధ తక్కువగా ఉంటుంది. వారం మధ్యలో ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి.

కన్యా రాశి

వృత్తిపరంగా అధిక బాధ్యతలు ఆలోచనలు |మొదలైన వాటి వల్ల శ్రమ, సమయానికి ఆహార స్వీకరణ | తీసుకోకపోవడం వల్ల కొంత జనరోగ్య భావనలు, శారీరక శ్రమ అధికంగా ఉంటుంది తగిన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా కంటికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు అవసరము.

ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుసుకుంటారు వారి ఆశీస్సులు తీసుకుంటారు ట్రస్టులు మొదలైన వాటికి విరా కాలు ఇస్తారు. వారం మధ్యలో వ్యక్తిగత ఆలోచనలు బాగుం |టాయి శారీరక శ్రద్ధ పెరుగుతుంది నిర్ణయాలు తీసుకుంటారు. | మీ యొక్క వృత్తిలో నూతన అభివృద్ధి కొరకు విశేషంగా శ్రమ పడతారు. జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు

తులా రాశి

సేవలకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది. దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో సంభాషణ వచ్చిన లాభాలను సద్వినియోగ పరచుకుని విషయంలో కూడా అనాసక్తి వైరాగ్య భావనలు. కుటుంబానికి సంబంధించిన ఆర్థిక లాభాలు, ఒక సమాచారం ఆలోచనలు కలిగిస్తుంది. మీ వారసత్వ పాస్తుల విషయంలో కుటుంబ వ్యక్తులతో అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త పడాలి.

వారం మధ్యలో కుటుంబపరమైన ముఖ్య కార్యక్రమాలు, దైవ సందర్శన, ఖర్చులు అధికంగా ఉంటాయి. నిద్రలేమి ఆహార లోపం చికాకును కలిగిస్తాయి. ఇప్పటిదాకా మందకొడిగా సాగిన ఆర్ధిక విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. వారం చివరిలో నూతన విషయాలు వింటారు. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది.

వృశ్చిక రాశి

ఖర్చులు శక్తికి మించి ఉండడం వల్ల చికాకులు పెరుగుతాయి. సమయానికి నిద్ర విశ్రాంతి అవసరం. అనవసర వివాదాలకు దూరంగా ఉండాలి. వృత్తికి సంబంధించిన విషయాలు మీద ఆసక్తి తక్కువగా ఉ కటుంది. రహస్య శత్రువుల వల్ల నైపుణ్యాలు పెరుగుతాయి. కృషి పెరుగుతుంది.

మీ తెలివితేటలతోవాటిని అధిగమించ గలుగుతారు. అనవసర వ్యక్తుల జోక్యం వల్ల వృత్తిలో చికా కులు అధికం చేస్తున్న వృత్తి మారే ఆలోచనలు అధికం. చేస్తారు. అలాంటి ఆలోచనలు నియంత్రించుకుంటూ యోగా మెడిటేషన్ మొదలైనవి చేయడం మంచిది. విద్యా ర్థులు విద్యకి సంబంధించిన విషయాలలో చాలా గట్టిగా కృషి చేస్తారు. మధ్యలో ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి.

ధనస్సు రాశి

జీవిత భాగస్వామి యొక్క ఆర్ధిక విష యాలు అనుకూలంగా ఉంటాయి ఉన్నత విద్య కొరకు ప్రయ త్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది దూర ప్రయా ణాలకు అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ప్రదేశాలు సంద ర్మించడానికి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. సామాజిక సేవ చేస్తారు.

తగిన గుర్తింపు ఆశించిన స్థాయిలో లభ్యం అవటం లేదని ఒక రకమైన అసంతృప్తి ఉ స్నప్పటికీ మీ పుణ్య బలముతో దాన్ని జయించే ప్రయత్నాలు చేస్తారు. తండ్రి పెద్దలు గురువుల ఆశీస్సులు లభ్యమవు తాయి. వారం మధ్యలో వృత్తికి సంబంధించి నిర్ణయాలు మార్పు చెందుతాయి, ముఖ్యంగా జీవిత భాగస్వామికి వృత్తిపరమైన అభివృద్ధి ఏర్పడుతుంది. రుణములు చెల్లిం చుటకు మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి.

మకర రాశి

మీ కృషికి తగిన ఫలితం, నూతన వృత్తులకి అవకాశము. ఉన్నత స్థాయి వ్యక్తుల సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు నిధానమవసరం. తండ్రి యొక్క బంధువులు మీ ఇంటికి రాక,చేసే కార్యక్రమాల్లో అసంతృప్తి, ఆధ్యాత్మిక అంశాల్లో ఆటంకాలు, దూర ప్రయాణాలు, విద్యార్థులు పోటీలలో శ్రమతో విజయాలు, విదేశీ విద్యకై ఆలోచనలు, అకస్మిక ధన రాబడి, భాగస్వా మ్యం వ్యవహారాల్లో నూతన ఆలోచనలు, వారం చివరిలో ఆరోగ్య విషయంలో శ్రద్ద తీసుకోవాలి, ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి ప్రయాణాల విషయం జాగ్రత్త లు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. రహస్య శత్రువుల వల్ల ఇబ్బంది అధికంగా ఉంటుంది. నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ,

కుంభ రాశి

సంతానం యొక్క ఆరోగ్యమే శ్రద్ధ తీసుకుంటారు. మీ ఆలోచనలు మీకే వ్యతిరేకంగా ఉండడం.. వల్ల కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.. సంతానముతో కలిసి వారి అభివృద్ధి విషయంలో నూతన నిర్ణయాలు చేస్తారుతి పాసన విషయంలో ఆటంకాలు, కుటుంబంలోని ఇష్టమైన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికంగా ఉంటాయి.

జీవిత భాగ స్వామి వృత్తిపరమైన అభివృద్ధి కమ్యూనికేషన్ బాగుంటుంది. దూర ప్రయాణాలకు అవకాశం. జాయింట్ వెంచర్స్ గురించి దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక్తుల దీవెనలు అందుకుంటారు. జీవిత భాగస్వామి అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మీ విషయంలో శ్రద్ధతో నిర్ణయాలు, భాగస్వామ్య విషయాల్లో అశ్రద్ధ ఉండడం వల్ల అపార్ధాలకు అవకాశం ఉంది.

మీన రాశి

ప్రారంభము విద్యార్థులు శ్రమ అధికము. తల్లి తండ్రుల సలహా తోడ్పాటు. మానసిక ఆరోగ్యము శ్రద్ద. ఆహారము కొత్త ప్రదేశాల్లో తీసుకునేటపుడు జాగర్త అవసరము. మాటలవల్ల విభేదాలు రాకుండా మాట్లాడాలి. దగ్గర వ్యక్తులతో ఆకస్మిక కలహాలు పనులు వాయిదాలు ఉన్న సంయమనం మంచిది. ఆరోగ్య రీత్యా తగిన జాగర్తలు అవస రం. ఉద్వేగం కోపం నియంత్రించుకోవాలి, సామజిక సేవ చేస్తారు. ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, పుణ్యనదీ స్నాన ములు, మీ సంబంధ న్యాయ విషయములపై మంతనాలు. ఖర్చులు నియంత్రించుకోవాలి. అప్పులు చేసి తీర్చే ప్రయత్నాలు, శత్రువులు ఇబ్బంది చికాకులు, రోగనిరోధక శక్తి పెంపోందించుకోవాలి. ఋణముల విషయంలో అప్రమత్తం.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner