Weekly Horoscope: ఈ వారం ఈ రాశుల వాళ్ళకు ఆకస్మిక ధన రాబడి, ఆనందంతో పాటు ఎన్నో.. మీ రాశికి ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?-weekly horoscope telugu this week these zodiac signs will get wealth happiness and many more check yours also ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Horoscope: ఈ వారం ఈ రాశుల వాళ్ళకు ఆకస్మిక ధన రాబడి, ఆనందంతో పాటు ఎన్నో.. మీ రాశికి ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

Weekly Horoscope: ఈ వారం ఈ రాశుల వాళ్ళకు ఆకస్మిక ధన రాబడి, ఆనందంతో పాటు ఎన్నో.. మీ రాశికి ఎలా ఉందో చెక్ చేసుకున్నారా?

HT Telugu Desk HT Telugu
Jan 26, 2025 03:00 AM IST

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 26.01.2025 నుంచి 01.02.2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు

Weekly Horoscope: ఈ వారం ఈ రాశుల వాళ్ళకు ఆకస్మిక ధన రాబడి
Weekly Horoscope: ఈ వారం ఈ రాశుల వాళ్ళకు ఆకస్మిక ధన రాబడి

రాశిఫలాలు (వారఫలాలు) 26.01.2025 నుంచి 01.02.2025 వరకు

ఆయనము: ఉత్తరాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం

మాసం: పుష్యం - మాఘ మాసం, తిథి : కృ. ద్వాదశి నుంచి శు. తదియ వరకు

మేష రాశి

అనవసర స్నేహాలకై వృధా ఖర్చులు, అలవాట్లు వలన ఇబ్బం దులు. ఆరోగ్య రీత్యా తగిన జాగర్తలు అవసరం. ఉద్వేగం కోపం నియంత్రించుకోవాలి. శత్రువులు ఇబ్బంది, రోగానిరోధక శక్తి పెంపోందించుకోవాలి. ఋణముల విషయంలో అప్రమత్తం సామజిక సేవ చేస్తారు.

ఆధ్యాత్మిక వ్యక్తుల కలయిక, పుణ్యనదీ స్నానములు, మీ సంబంధ న్యాయ విషయములకై మంతనములు, ఖర్చులు నియాండ్రించుకోవాలి అప్పులు చేసి తీర్చే ప్రయత్నాలు.

వారము మధ్యలో జీవిత భాగస్వామి ద్వారా ఆర్థిక సహకారము, కుటుంబములో కొంత అహ్లాద వాతావరణము. విద్యార్థులు శ్రమ అధికము తల్లి తండ్రుల సలహా తోడ్పాటు, వారము ఉదరిలోమానసిక ఆరోగ్యము శ్రద్ధ. ఆహారము కొత్త ప్రదేశాల్లో తీసుకునేటపుడు జాగర్త అవసరము.

వృషభ రాశి

విద్యార్థులకు విద్యా సంబంధ అంశాల్లో రాత నైపుణ్యాలు తగిన విధంగా ఆసక్తి పెంచుకోవాలి. డివియేషన్సు స్నేహ సంబంధాలు వల్ల విద్యా సంబంధ ఇబ్బంది అధికంగా ఉం టాయి. ఉప సనాబలం పైన శ్రద్ధ తీసుకుంటూ వైదశ్యాన్ని దూరం చేసుకుని ముందుకు సాగాలి. ఆలోచనలో ఆలస్యా లు ఉన్నప్పటికీ ముఖ్యమైన శ్రేయోభిలాషుల యొక్క సలహా సహకారంతో సమస్యల అధికమిస్తారు.

మానసిక ఒత్తిడి సమ స్యలు అధికంగా ఉన్నప్పటికీ యోగ మెడిటేషన్ మొదలైంది. చేయడం వల్ల మంచిది. స్నేహితుల సలహా సహకారంతో సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్లడానికి మీరు చేసే కార్యక్రమాలలో వృత్తిపరంగా ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం కూడా లభిస్తుంది. కుటుంబంలో వ్యక్తులకి వృత్తి అవకాశాలు లభిస్తాయి..

మిధున రాశి

ఈ రాశి వారికి ప్రారంభంలో విద్యాపరమైన నూతన విష యాలు తెలుసుకుంటారు తల్లి యొక్క ఆరోగ్యం మీద ప్రత్యేక మైన శ్రద్ధ తీసుకుంటారు గృహవాతావరణం, ముఖ్యంగా గృహంలో చిన్నపాటి రిపేర్లు వాహనానికి సంబంధించిన అంశాలు కొంత చికాకులు కలిగిస్తుంది. అయినప్పటికీ వాటిని మీ యొక్క తెలివితేటలతో అధిగమిస్తూ ముందుకు వెళతారు.

విద్యార్థులకు విద్యాపరమైన విషయాలు మీద తగిన శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యంగా పరీక్షలు రాసేటప్పుడు శ్రీహయగ్రీవాయనమః మంత్రాన్ని పట్టించడం చాలా మంచిది. వారం మధ్యలో నూతన సృజనాత్మకమైన నిర్ణయా లు అసుకూలంగా ఉంటాయి. ఉద్వేగాలని నియంత్రించుకుంటూ ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది.

కర్కాటక రాశి

వారం ప్రారంభంలో వ్యక్తుల సహకారం తీసుకోవడానికి మనసు నిరాకరిస్తుంది. కమ్యూనికేషన్ విషయంలో కొంత ఇబ్బందులు అధికంగా ఉంటాయి మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా కొన్ని అవకాశాలు కోల్పోయే రీత్యా మీరెంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. ఆత్మీయ వ్యక్తులు సహకారంతో చెప్పవలసిన మాటలను చక్కగా చెబుతూ ఫలితాలు సాధించాలి.

ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మధ్యవర్తిత్వాలు అగ్రిమెంట్లు పనికిరాదు. వారం మధ్యలో గృహ వాతావరణం వాహనాన్ని సంబంధించిన విషయాలు, సౌకర్యాలు, నూతన గృహ నిర్మాణ విషయంలో ఆగిన పసులు కొంత చర్చకు రావడం జరుగుతుంది. ఆర్థికంగా కొంత చికాకులు ఉన్నప్పటికీ అధిగమిస్తారు.

సింహ రాశి

ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కొంత కష్టంగా ఉంటుంది కుటుంబ వ్యవహారాలలో ఇతరుల జోక్యం కొంత విసుగును కలిగిస్తుంది. నాయకత్వ లక్షణాలు పెరుగుతాయి. వారం మధ్యలో వృత్తికి సంబంధించిన విషయాలలో అవలీలగా ముందుకు వెళతారు. అగుతూ వస్తున్న పనులు ముందుకు పెడతాయి.

సంకల్ప బలం పెరుగుతుంది. కమ్యూనికేషన్ బాగుంటుంది వ్యక్తులు సహకరిస్తారు. మిత్రులతో కలిసి చర్చలు చేసి నూతన ఆలోచనలకు శ్రీకారం చుడతారు. దగ్గర ప్రయాణాలు చేస్తారు. మిత్రుల కొరకు ఖర్చులు అధికం చేస్తారు. మీ ఇంటికి బంధువులు రాక తల్లితండ్రుల సహకారంతో గృహ ప్రయత్నాలు.

కన్యా రాశి

వారం ప్రారంభంలో ఆధ్యాత్మిక ధోరణి, నైరాస్యమైన ఆలో చనలు, మీ మీద మీరు శ్రద్ధ తక్కువగా ఉంటుంది. ప్రవ చనాలు మొదలైన వాటి మీద ఆసక్తి అధికంగా ఉంటుంది. మానసిక ప్రశాంతత తక్కువగా ఉండటం వల్ల అందరికీ దూరంగా ఉంటారు. అయినప్పటికీ అవన్నీ మీ మనోబలంతో జయించే ప్రయత్నాలు చేయాలి.

ముఖ్యంగా తల్లి, జీవిత భాగస్వామితో కలిసి ఆధ్యాత్మిక ప్రదేశాలను సందర్శించాలని కోరిక బలంగా ఉంటుంది. వారం మధ్యలో ఆర్ధిక విషయాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. వాయిదా పడుతూ వస్తున్న ఎదురుచూ స్తున్న ధనాన్ని కొంతైనా అందుకుంటారు. వృత్తిపరమైన ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. విద్యార్థులకు విద్యాపరమైన వస్తువులు కొనుగోలు

తులా రాశి

ప్రారంభంలో ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారు. ముఖ్యంగా కంటికి సంబంధించిన విషయాలలో జాగ్రత్తలు అవసరము ఆధ్యాత్మిక వ్యక్తుల్ని కలుసుకుంటారు వారి ఆశీస్సులు తీసుకుంటారు ట్రస్టులు మొదలైన వాటికి విరా కాలు ఇస్తారు. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది తగిన విశ్రాంతి తీసుకోవాల్సిన అవసరం ఉంది.

వృత్తిపరంగా అధిక బాధ్యతలు ఆలోచనలు మొదలైన వాటి వల్ల శ్రమ, సమయానికి ఆహార స్వీకరణ తీసుకోకపోవడం వల్ల కొంత అనరోగ్య భావనలు, వారం మధ్యలో వ్యక్తిగత ఆలోచనలు బాగుంటాయి శారీరక శ్రద్ధ పెరుగుతుంది నిర్ణయాలు తీసుకుంటారు మీ యొక్క వృత్తిలో నూతన అభివృద్ధి కొరకు విశేషంగా శ్రమ పడతారు. జీవిత భాగస్వామితో కలిపి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు.

వృశ్చిక రాశి

ప్రారంభంలో మీ సేవలకు తగిన గుర్తింపు గౌరవం లభిస్తుంది దూర ప్రదేశాల్లో ఉండే మిత్రులతో సంభాషణ. వార సత్వపాస్తుల విషయంలో కుటుంబ వ్యక్తులతో అభిప్రాయ బేధాలు రాకుండా జాగ్రత్త పడాలి. వచ్చిన లాభాలను సద్వినియోపరుచుకునే విషయంలో కూడా అనాసక్తి వైరాగ్య భావనలు. కుటుంబానికి సంబంధించిన ఆర్ధిక లాభాలు, ఒక సమాచారం ఆలోచనలు కలిగిస్తుంది.

వారం మధ్యలో కుటుంబపరమైన ముఖ్య కార్యక్రమాలు, దైవ సందర్శన, ఖర్చులు అధికంగా ఉంటాయి. నిద్రలేమి ఆహార లోపం చికాకును కలిగిస్తాయి. ఇప్పటిదాకా మందకొడికే సాగిన ఆర్థిక విషయాలు ఓ కొలిక్కి వస్తాయి. వారం చివరిలో సం కల్ప బలం పెరుగుతుంది. ఉన్నత స్థాయి వ్యక్తుల సహకారం బాగుంటుంది. ఆశించిన ఫలితాలు పొందుతారు. వృత్తిపరమైన అభివృద్ధి. నూతన విషయాలు వింటారు.

ధనస్సు రాశి

వారం ప్రారంభంలో వృత్తికి సంబంధించిన విషయాలు మీద ఆసక్తి తక్కువగా ఉంటుంది. అనవసర వ్యక్తుల జోక్యం వల్ల వృత్తిలో చికాకులు అధికం, చేస్తున్న వృత్తి మారే ఆలోచనలు అధికం చేస్తారు. అలాంటి ఆలోచనలు నియంత్రించు కుంటూ యోగా మెడిటేషన్ మొదలైనవి చేయడం మంచిది. ఖర్చులు శక్తికి మించి ఉండడం వల్ల చికాకులు పెరుగుతా యి.

మీ తెలివితేటలతో వాటిని అధిగమించగలుగుతారు. రహస్య శత్రువుల వల్ల నైపుణ్యాలు పెరుగుతాయి కృషి పెరుగుతుంది. విద్యార్థులు విద్యకి సంబంధించిన విషయాలలో చాలా గట్టిగా కృషి చేస్తారు. వారం మధ్యలో ఆర్థిక సంబంధమైన విషయాలు కొంతవరకు అనుకూలంగా ఉంటాయి. భాగస్వామికి వృత్తిపరమైన విషయాలలో ఉన్నత స్థాయి వ్యక్తులు రాజకీయ నాయకుల యొక్క సహకారం

మకర రాశి

వారం ప్రారంభంలో జీవిత భాగస్వామి యొక్క ఆర్థిక విషయాలు అనుకూలంగా ఉంటాయి సామాజిక సేవ చేస్తారు. తగిన గుర్తింపు ఆశించిన స్థాయిలో లభ్యం అవటం లేదని ఒక రకమైన అసంతృప్తి ఉన్నప్పటికీ మీ పుణ్య బటముతో దాన్ని జయించే ప్రయత్నాలు చేస్తారు. తండ్రి పెద్దలు గురువుల ఆశీస్సుల లభ్య మవుతాయి.

ఉన్నత విద్య కొరకు ప్రయత్నం చేసే వారికి అనుకూలంగా ఉంటుంది దూర ప్రయా ణాలకు అవకాశం ఉంటుంది ఆధ్యాత్మిక ప్రదేశాలు సందర్శించడానికి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి, వారం మధ్యలో వృత్తికి సంబంధించి నిర్ణయాలు మార్పు చెందుతాయి, ముఖ్యంగా జీవిత భాగస్వామికి వృతి పరమైన అభివృద్ది ఏర్పడుతుంది. రుణములు చెల్లించుటకు మీరు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి.

కుంభ రాశి

వారం ప్రారంభంలో రహస్య శత్రువుల వల్ల ఇబ్బంది అధికంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. ముఖ్యమైన విషయాలు వాయిదా పడతాయి ప్రయాణాల విషయం జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. వస్తువులని అజాగ్రత్తగా వదిలేయకూడదు ప్రయాణాలలో నూతన వ్యక్తులని నమ్ముతూ ముందుకు వెళ్లేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.

నూతన ప్రదేశాలలో ఆహార స్వీకరణ, ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి, తండ్రి యొక్క బందువులు మీ ఇంటికి రాక, చేసే కార్యక్రమాల్లో అసంతృప్తి, ఆధ్యాత్మిక అంశాల్లో ఆటంకాలు, దూర ప్రయాణాలు, విద్యార్థులు పోటీలలో శ్రమతో విజయాలు, విదేశీ విద్యకై ఆలోదనలు, ఆకస్మిక ధన రాబడి, భాగస్వామ్యం వ్యవహారాల్లో నూతన ఆలోచనలు కలిసి వస్తాయి.

మీనరాశి

వారం ప్రారంభంలో జాయింట్ వెంచర్స్ గురించి దృష్టి సారిస్తారు. జీవిత భాగస్వామి అభిప్రాయ బేధాలు రాకుండా. జాగ్రత్తలు తీసుకోవాలి, మీ విషయంలో శ్రద్ధతో నిర్ణయాలు, భాగస్వామ్య విషయాల్లో అశ్రద్ధ ఉండడం వల్ల అపార్థాలకు అవకాశం ఉంది. దూర ప్రయాణాలకు అవకాశం. ఆధ్యాత్ని క్తుల దీవెనలు అందుకుంటారు.

వారం మధ్యలో సంతానం యొక్క ఆరోగ్యమే శ్రద్ధ తీసుకుంటారు. మీ ఆలోచనలు మీకే వ్యతిరేకంగా ఉండడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదు ర్కొంటారు. ఉపాసన విషయంలో ఆటంకాలు, కుటుంబం లోని ఇష్టమైన వ్యక్తుల కొరకు ఖర్చులు అధికంగా ఉంటా యి. జీవిత భాగస్వామి వృత్తిపరమైన అభివృద్ధి. కమ్యూ నికేషన్ బాగుంటుంది. సంతానముతో కలిసి వారి అభివృద్ధి విషయంలో నూతన నిర్ణయాలు చేస్తారు.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner