Weekly Horoscope Telugu: ఈ వారం ఈ రాశుల వారికి.. భూలాభాలు, దైవదర్శనాలు, వాహనాలు, ధన, వస్తు లాభాలతో పాటు ఎన్నో-weekly horoscope telugu this week these zodiac signs will get many benefits including lands wealth vehicles and more ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Horoscope Telugu: ఈ వారం ఈ రాశుల వారికి.. భూలాభాలు, దైవదర్శనాలు, వాహనాలు, ధన, వస్తు లాభాలతో పాటు ఎన్నో

Weekly Horoscope Telugu: ఈ వారం ఈ రాశుల వారికి.. భూలాభాలు, దైవదర్శనాలు, వాహనాలు, ధన, వస్తు లాభాలతో పాటు ఎన్నో

HT Telugu Desk HT Telugu
Jan 05, 2025 03:00 AM IST

Weekly Horoscope Telugu: ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 05.01.2025 నుంచి 11.01.2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

Weekly Horoscope Telugu: ఈ వారం ఈ రాశుల వారికి.. భూలాభాలు, దైవదర్శనాలు, వాహనాలు
Weekly Horoscope Telugu: ఈ వారం ఈ రాశుల వారికి.. భూలాభాలు, దైవదర్శనాలు, వాహనాలు (pixabay)

రాశిఫలాలు (వారఫలాలు) 05.01.2025 నుంచి 11.01.2025 వరకు

yearly horoscope entry point

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం

మాసం: పుష్యం, తిథి : శు. సప్తమి నుంచి శు. ద్వాదశ

మేషం

ఈ రాశి వారికి ఈ వారంలో పనులు పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు. మీ నిర్ణయాలపై కుటుంబసభ్యులు సంతోషిస్తారు. ఆస్తుల వ్యవహారాలలో చికాకులు తొలగుతాయి. వాహనాలు కొనుగోలు చేస్తారు. ఒక కోర్టు వ్యవహారంలో కదలికలు ఉంటాయి. ప్రముఖుల పరిచయం. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూల పరిస్థితి. వారం ప్రారంభంలో ధనవ్యయం, అనారోగ్యం, తెలుపు, ఆకుపచ్చ రంగులు, సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

వృషభం

రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి కొంత నయంగా కనిపిస్తుంది. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం రాగలదు. ఆస్తుల వ్యవహారాలలో పరిష్కారానికి చొరవ చూపుతారు. నిరుద్యోగులకు శ్రమానంతరం ఫలితం కనిపిస్తుంది. స్వల్ప అనారోగ్యం. గృహం కొనుగోలు, నిర్మాణాలలో కొన్ని ప్రతిబంధకాలు. వ్యాపారాలు కొంతమేర లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒత్తిడులు, కళారంగం వారికి ఒత్తిడులు. వారం ప్రారంభంలో భూలాభాలు, దైవదర్శనాలు, గులాబీ. నేరేడు రంగులు. ఆంజనేయస్వామిని పూజించండి.

మిథునం

ఈ రాశి వారికి ఈ వారంలో కొత్త పనులు చేపడతారు. ఆస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కొన్ని సమస్యల నుంచి గట్టెక్కుతారు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం మధ్యలో వ్యయప్రయాసలు, గులాబీ, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.

కర్కాటకం

రాశి వారికి ఈ వారంలో ఖర్చులు పెరిగి కొత్త రుణాల కోసం యత్నిస్తారు. అనుకున్నదొకటి జరిగేది వేరొకటిగా ఉంటుంది. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. ఆస్తి వివాదాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారాలు నెమ్మదిగా సాగుతాయి. నిరుద్యోగులకు శ్రమాధిక్యం. ఉద్యోగాలలో కొంత అసంతృప్తి. రాజకీయవర్గాలకు ఒత్తిడులు పెరుగుతాయి. వారం మధ్యలో ఆకస్మిక ధన, వస్తులాభాలు. ఆకుపచ్చ, నీలం రంగులు. సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి.

సింహం

ఈ రాశి వారికి ఈ వారంలో ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యలు కొన్ని పరిష్కరించుకుంటారు. వాహనయోగం. సోదరులతో ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. నూతన ఉద్యోగ ప్రాప్తి, వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం. ఇంక్రిమెంట్లు దక్కుతాయి. రాజకీయవర్గాల యత్నాలు సఫలం. వారం చివరిలో ధనవ్యయం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

కన్య

ఈ రాశి వారికి ఈ వారంలో అవసరాలకు తగినంతగా డబ్బు సమకూరుతుంది. రుణభారాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపంలో పెడతారు. ఒక సమాచారం నిరుద్యోగులకు ఊరటనిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. కళారంగం వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం ప్రారంభంలో ధనవ్యయం, కుటుంబంలో చికాకులు. నేరేడు. ఆకుపచ్చ రంగులు. హనుమాన్ చాలీసా పఠించండి.

తుల

ఈ రాశి వారికి ఈ వారంలో నూతన ఉద్యోగాలు పొందుతారు. ముఖ్య వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. ఆప్తులు, బంధువులతో ఆనందంగా గడుపుతారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలు, అరుదైన ఆహ్వానాలు అందుతాయి. విద్యార్థులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో కీలకపోస్టులు రావచ్చు. పారిశ్రామికవర్గాలకు మరింత అనుకూలస్థితి. వారం చివరిలో అనారోగ్యం, గులాబీ, పసుపు రంగులు. గణేశ్తోత్రాలు పఠించండి.

వృశ్చికం

ఈ రాశి వారికి ఈ వారంలో చేపట్టిన పనులు స్వయంగా పూర్తి చేస్తారు. అనుకున్న లక్ష్యాలు సాధించే దిశగా కదులుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగాలలో కొత్త పోస్టులు వచ్చే అవకాశం. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. రాజకీయ వర్గాలకు అన్ని విధాలా కలసివచ్చే సమయం. వారం చివరిలో కుటుంబసభ్యులతో వైరం, ఆకుపచ్చ, గులాబీ రంగులు. హయగ్రీవస్తోత్రాలు పఠించండి.

ధనుస్సు

ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్యమైన పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఆర్థికంగా మునుపటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఉద్యోగ యత్నాలు అనుకూలిస్తాయి. ఎప్పుడో చేజారిన పత్రాలు తిరిగి లభ్యమవుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులకు తగినంతగా లాభాలు ఆర్జిస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాల మేరకు మార్పులు ఉండవచ్చు. కళారంగం వారి ఆశలు నెరవేరతాయి వారం ప్రారంభంలో మనశ్శాంతి లోపిస్తుంది. వృథా ఖర్చులు. నీలం, ఆకుపచ్చ రంగులు. దేవీస్తోత్రాలు పఠించండి.

మకరం

ఈ రాశి వారికి ఈ వారంలో ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ఆశ్చర్యకరమైన రీతిలో సమస్యల నుంచి బయట పడతారు. కొత్త వ్యక్తుల పరిచయం. అందరిలోనూ విశేష గౌరవమర్యాదలు లభిస్తాయి. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు, వారం ప్రారంభంలో మిత్రుల నుండి ఒత్తిడులు. ధనవ్యయం. ఎరుపు, పసుపు రంగులు. వేంకటేశ్వరస్తుతి మంచిది.

కుంభం

ఈ రాశి వారికి ఈ వారంలో ముఖ్యమైన పనుల్లో విజయం. ఆస్తుల వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. ఆర్థికంగా గతం కంటే మెరుగ్గా ఉంటుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసే సమయం. విద్యార్థులకు అనుకోని అవకాశాలు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. వ్యాపారాలు మరింత లాభిస్తాయి. ఉద్యోగాలలో మీ హోదాలు పెరుగుతాయి. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు, పసుపు, నేరేడు రంగులు. గణేశాష్టకం పఠించండి.

మీనం

ఈ రాశి వారికి ఈ వారంలో కొన్ని పనులు సజావుగా సాగుతాయి. ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులకు ఊహించని అవకాశాలు, వివాహయత్నాలు సానుకూలం కాగలవు, భూములు, వాహనాలు కొంటారు. వ్యాపారాలలో లాభాలు అనుకున్న మేరకు పొందుతారు ఉద్యోగాలలో ఊహించని మార్పులు సంభవం. రాజకీయవర్గాలకు ఆహ్వానాలు. వారం చివరిలో మానసిక అశాంతి. ఎరుపు, తెలుపు రంగులు. ఆంజనేయ దండకం పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
Whats_app_banner