Weekly Horoscope: ఈ వారం వీళ్ళకు అదృష్టం, ధనం.. ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలను పాటించాలో తెలుసుకోండి-weekly horoscope telugu this week these zodiac signs will get luck money and many more check your zodiac sign also ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Horoscope: ఈ వారం వీళ్ళకు అదృష్టం, ధనం.. ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలను పాటించాలో తెలుసుకోండి

Weekly Horoscope: ఈ వారం వీళ్ళకు అదృష్టం, ధనం.. ఏ రాశుల వారు ఎలాంటి పరిహారాలను పాటించాలో తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu
Jan 19, 2025 03:00 AM IST

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 19.01.2025 నుంచి 25.01.2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు

Weekly Horoscope: ఈ వారం వీళ్ళకు అదృష్టం, ధనం
Weekly Horoscope: ఈ వారం వీళ్ళకు అదృష్టం, ధనం

రాశిఫలాలు (వారఫలాలు) 19.01.2025 నుంచి 25.01.2025 వరకు

సంబంధిత ఫోటోలు

ఆయనము: ఉత్తరాయణం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం

మాసం: పుష్యం, తిథి : కృ. పంచమి నుంచి కృ. ఏకాదశి వరకు

మేషం

ఈ వారం పెట్టుబడులకు సంబంధించిన విషయాలు వ్యవహారాలు మనస్పూర్తిని కలిగిస్తాయి. మీకు భాషా పరిజ్ఞానం లేదని లేదా కొన్ని అంశాల పట్ల అవగాహన లేదని కొంతమంది చులకన చేసే అవకాశం ఉన్నది. ఇట్టి వాటికి తావివ్వకుండా మీరు నేర్చుకోగలిగితే అన్నింటా విజయాన్ని సాధించగలుగుతారు. నూతన విద్యల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. నేర్చుకునే అవకాశాలు గ్రహస్థితులు సూచిస్తున్నాయి. ప్రతిరోజు దేవి దేవతలకు ప్రథమ తాంబూలాన్ని సమర్పించండి.

వృషభం

ఈ వారం ఎవ్వరి మీద ఆధారపడకుండా మీరు తీసుకునే నిర్ణయాలు ఎంతగానో మేలు చేస్తాయి. జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మీకు అక్కరకు వస్తాయి. వృత్తి రీత్యా స్వల్పమైన ఒడుదుడుకులు ఏర్పడతాయి. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. క్రయవిక్రయాలలో లాభాల అందుకో గలుగుతారు. దూర ప్రాంతాల్లో పెట్టుబడులకు తగిన సమయం. స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి ఉంటారు. వాళ్లకు విలువైన వస్తువులు, వస్త్రాలు కొనిస్తారు.

మిథునం

ఈ వారం బహుమతులుగా ఇవ్వాలన్న ఆలోచనలు ముడిబడతాయి. రెన్యువల్స్ కోసం దరఖాస్తులు దాఖలు చేస్తారు. కళ్ళకు చక్రాలు కట్టుకొని మరి పనిచేస్తారు. ప్రయోజనాలను కోల్పోకూడదు మన పిల్లలకి దక్కాలి అని భావిస్తారు, శుభవార్త వింటారు. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది. విదేశాలలో ఉన్నవారికి సొంత ఇంటి కల నెరవేరుతుంది. వైద్య విద్య పట్ల మక్కువ చూపిస్తారు.

కర్కాటకం

ఈ వారం విదేశీయాన ప్రయత్నాలు, విదేశాలలోని ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు బాగుంటుంది. పరపతి కలిగిన వారి తోటి పరిచయాలు మేలు చేకూరుస్తాయి. నిత్యం సిద్ధ గంధంతో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని పూజించండి. లలితకళలలో ప్రావీణ్యతను పొందడానికి శిక్షణా తరగతులలో చేరతారు. మంచి మధ్యవర్తిగా వ్యవహరించి ఇరువర్గాల మధ్యన సంఖ్యతను సమకూరుస్తారు. జీవితాన్ని కొత్త కోణంలో చూస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాది విషయాలు మీరు ఆశించిన స్థాయిలో ఉండటం మీ మానసిక సంతోషానికి కారణమవుతాయి.

సింహం

ఈ వారం వాహనాలు కొనుగోలు అమ్మకాల విషయాలు అనుకూలంగా ఉంటాయి. భుసంభంధిత లావాదేవీలు లాభిస్తాయి. అష్టమూలికా తైలంతో లక్ష్మి తామర వత్తులతో దీపారాధన చేయండి. పూజల్లో నాగబంధం కుంకుమను ఉపయోగించండి. వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. నదుము నొప్పి ఇబ్బంది పెడుతుంది. కొన్ని రోజులు ఉద్యోగానికి సెలవు తీసుకుంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి. వివాహాది విషయ వ్యవహారాలు ముడిబడతాయి.

కన్య

ఈ వారం పలువురి మెప్పును పొందుతారు. దీర్ఘకాలిక ఆశయాలను దృష్టిలో ఉంచుకొని ఈరోజు నుంచి నెమ్మదిగా పొదుపు పథకాలు ప్రారంభిస్తారు. స్నేహితుల సహాయము అందుకుంటారు. జీవిత భాగస్వామి పట్ల ప్రేమ అనురాగం కలిగి ఉంటారు. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. మీ ఇష్టదేవుళ్లకు మహాతీర్థం పొడితో అభిషేకం చేయడండి. ప్రయోజనాలని అందుకుంటారు. వైద్య విద్య పట్ల మక్కువ చూపిస్తారు. శుభవార్తలు వింటారు, కుటుంభం పురోగతి బాగుంటుంది.

తుల

ఈ వారం పోటీ పరీక్షల్లో పాల్గొంటారు. గణితం విద్య, వైద్య విద్య, ప్రభుత్వ ఉద్యోగం కోసం రాసే పరీక్షల్లో విజయం సాధిస్తారు. పరపతి పలుకుబడి కలిగిన వదులతో పరిచయాలు ఏర్పడతాయి. నూతన ఉద్యోగ అవకాశాల కోసం చేసే దరఖాస్తులు, ఇంటర్వ్యూ ఫలిస్తాయి. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. అష్టమూలిక తైలంతో లక్ష్మి తామర వత్తులతో దీపారాధన చేయండి. క్రీడారంగంలోని వారికి అనుకూలంగా ఉంది. కొద్దిపాటి ఒత్తిడిని కూడా భరించలేని పరిస్థితి ఏర్పడుతుంది. శారీరికంగా బలహీనత ఈ పరిస్థితికి కారణం అవుతుంది.

వృశ్చికం

ఈ వారం కొత్త ఆలోచనలు. ప్రణాళికలు రూపొందిస్తారు. మీ ప్రతిభ పాటవాలను వెలుగులోకి తీసుకు వస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల సంఘసేవ కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. జిల్లేడు వత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి ఆటంకాలన్నీ తొలగిపోతాయి. కొన్ని సందర్భాలలో నిజాలు మాట్లాడుకోలేని పరిస్థితిని నెలకుంటాయి.

ధనస్సు

ఈ వారం కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సహోద్యోగులతో భేదాభిప్రాయాలు చోటు చేసు కుంటాయి. మీ మానసిక స్థితిని అర్ధం చేసుకోగలిగిన వారు నిజంగా ఎవరు అనేది ఈ వారం తెలుసుకోగలుగుతారు. నరదృష్టి అధికంగా ఉంటుంది. సుమంగళి పసుపుతో గౌరీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుతూ అర్చన చేయండి. సాంకేతిక విద్యలపై ఆసక్తి చూపుతారు. సంఘంలో కీర్తి పెంపొందుతుంది. జాయింట్ వ్యవహారములో వివాహ సంబంధములో అనుకోని వ్యక్తి సహకరిస్తాడు.

మకరం

ఈ వారం ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు. కుక్కలకు జీవరాసులకు మంచినీళ్లను పెట్టండి. రహస్య మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది. స్నేహితుల ద్వారా నూతన వ్యాపారాలకు పెట్టుబడులను అందిస్తారు. బంధువులతో సమస్యలు ఏర్పడతాయి.

కుంభం

ఈ వారం రాజకీయాలు ఆకర్షిస్తాయి పలువురితో పరిచయాలు అందుకు కారణం అవుతుంది. స్వల్పమైన అనారోగ్య సమస్యలతో సతమతమవుతారు.. కొత్త బాధ్యతలను స్వీకరిస్తారు. ప్రయోజనాలని అందుకుంటారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయట పడడానికి చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయంలో హనుమాన్ సింధూరం తో అర్చన జరిపింది. నుదుటన ఈ బొట్టును ధరించండి. శనీశ్వరాలయంలో తైలాభిషేకం జరిపించండి నలుపు వత్తులతో నువ్వుల నూనెతో దీపారాధన చేయండి.

మీనం

ఈ వారం సాంకేతిక విద్యలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురు కాగలవు, వాహనం, స్థలాలు కొనుగోలు యత్నాలు ఫలించవు. దూరపు బంధువుల నుంచి అందిన సమాచారం కొంత ఊరట కలిగిస్తుంది. స్త్రీ సంతానం పట్ల మక్కువ కలిగి ఉంటారు వాళ్లకు విలువైన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. చేతికి కుబేర కంకణాన్ని ధరించండి లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది. ఇంట్లో వ్యాపార ప్రదేశాల్లో కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నర దిష్టి తొలగిపోతుంది.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner

సంబంధిత కథనం