Weekly Horoscope Telugu: ఈ వారం ఈ రాశుల వారికి అదృష్టం.. ఉద్యోగ ప్రాప్తి, ఆర్థిక లాభాలతో పాటు ఎన్నో
Weekly Horoscope Telugu: ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. 12.01.2025 నుంచి 18.01.2025 వరకు ఏ రాశి వారికి ఎలా ఉండబోతోందో ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు
రాశిఫలాలు (వారఫలాలు) 12.01.2025 నుంచి 18.01.2025 వరకు
ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం
మాసం: పుష్యం, తిథి : శు. చతుర్దశి నుంచి కృ. పంచమి వరకు
మేషం
ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని మంచీచెడ్డా విచారిస్తారు. మీపై వచ్చిన అభియోగాలు, ఆరోపణల నుండి బయటపడతారు. పలుకుబడి పెరిగి మీపై అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. పెండింగ్లో పడిన బాకీలు వసూలవుతాయి. ఖర్చులు పెరిగినా తట్టుకుని ముందుకు సాగుతారు. రుణ దాతలు ఒత్తిడులు తగ్గిస్తారు. అందరినీ కలుపుకుంటూ సంతోషంగా గడుపుతారు.
పెద్దల మాటలకు మరింత గౌరవం ఇస్తారు. వారి నిర్ణయాలు శిరోధార్యంగా భావిస్తారు. ఆరోగ్యం విషయంలో కొంత ఇబ్బంది ఎదురైనా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు దక్కుతాయి. పెట్టుబడులకు సరైన సమయం. ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. ఉన్నతాధికారులు మీ సేవలను గుర్తిస్తారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు విశేషంగా కలిసివస్తుంది. మహిళలకు మానసిక ప్రశాంతత లక్ష్మీస్తోత్రాలు పరించండి.
వృషభం
అనుకున్న పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. మిత్రులు శ్రేయోభిలాషులు మీపై మరిన్ని బాధ్యతలు ఉంచుతారు. కష్టాలు ఎదురైనా చెక్కుచెదరని ధైర్యంతో అధిగమించి ముందుకు సాగుతారు. వివాహాది వేడుకలపై నిర్ణయాలు తీసుకుంటారు. వాహనాలు, స్థలాలు కొంటారు. నిరుద్యోగులు కోరుకున్న అవకాశాలు సాధిస్తారు. తీర్ధయాత్రలు చేస్తారు. డబ్బుకు లోటులేకుండా గడుస్తుంది.
ఇతరులకు సైతం బాకీలు చెల్లిస్తారు. మీ ప్రేమాభిమానాలతో కుటుంబసభ్యులకు ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారాలలో ఆశించిన లాభాలు, పెట్టుబడులు అందుతాయి. విస్తరణలోనూ ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగాలలో అనుకూలమైన మార్పులు పొందుతారు. విధుల్లో ప్రతిబంధకాల నుంచి బయటపడతారు. రాజకీయవేత్తలు, కళాకారులకు పట్టింది బంగారమే అన్నట్లుంటుంది. మహిళలకు మానసిక ప్రశాంతత. దుర్గాదేవిస్తోత్రాలు వరించండి. భార్యాభర్తల మధ్య అపోహలు, అపార్ధాలు కలిగే సూచన ఉంది.
మిధునం
అభిప్రాయభేదాలు ఉన్నా మిత్రుల మాట అనుసరిస్తారు. ముఖ్య కార్యక్రమాలలో విజయం మీదే. ప్రముఖులు పరిచయం కాగలరు. శుభకార్యాలు నిర్వహణలో నిమగ్నమువుతారు. డబ్బు సకాలంలో అందుతుంది. కొన్ని చిక్కులు తొలగి మరింత ఊరట లభిస్తుంది. కుటుంబంలో సమస్యలు తీరతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. కొంతకాలంగా మిమ్మల్ని విభేదిస్తున్న సోదరులు అలకమాని సవ్యంగా మెలుగుతారు.
శారీరక రుగ్మతలు తీరి ఉపశమనం పొందుతారు. వ్యాపారాలను అనుకున్నరీతిలో విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. భాగస్వాములు పెరుగుతారు. ఉద్యోగాలలో కోరుకున్న విధంగా మార్పులు ఉంటాయి. ఉన్నతాధికారుల నుంచి సైతం సాయం అందుతుంది. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకు ఒక సంతోషకర సమాచారం రాగలదు. శివపంచాక్షరి పఠించండి.
కర్కాటకం
పలుకుబడి మరింత పెరుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. కొత్త పరిచయాలు ఉత్సాహాన్నిస్తాయి. అనుకోని విధంగా ధన లాభం. అప్పులు సైతం తీరతాయి. రెండుమూడు విధాలుగా ధనలబ్ది ఉంటుంది. కుటుంబసభ్యులతో మరింత ఆనందంగా గడువుతారు. కొత్త ఉత్నాహంతో ముందుకు సాగి విజయాలు సాధిస్తారు. సోదరులు, సోదరీలతో విభేదాలు తీరతాయి.
ఆస్తుల వ్యవహారాలలో సమస్యలు తీరతాయి. కొంత కలత చెందినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో ఆశించిన విధంగా లాభాలు అందుతాయి. పెట్టుబడులకు భాగస్వాములు ముందుకు రావడం శుభపరిణామం. అలాగే, విస్తరణలో ముందడుగు వేస్తారు. ఉద్యోగాలలో సమర్థతను అందరూ గుర్తిస్తారు. ప్రమోషన్లు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, పరిశోధకులు మరింత గుర్తింపు పొందుతారు. మహిళలకు విశేష ఖ్యాతి దక్కుతుంది. ఆదిత్య హృదయం పఠించండి.
సింహం
అనుకున్న కార్యక్రమాలు సజావుగా సకాలంలో పూర్తి. చేస్తారు. స్నేహితుల నుంచి ఆసక్తికర సమాచారం రాగలదు. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రముఖులను పరిచయం చేసుకుంటారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. భూముల క్రయవిక్రయాల ద్వారా మరింత సొమ్ము అందుతుంది. రుణవారలు క్రమేపీ తొలగుతాయి. మీరంటే అంతా ఇష్టపడతారు.
మీ మాటకు మరింత విలువ పెరుగుతుంది. ఆస్తుల వ్యవహారాలలో సోదరులతో అంగీకారానికి వస్తారు. కొంత సలత చేసినా తక్షణ ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో మరింతగా లాభిస్తాయి. విస్తరణ చర్యలు సఫలమవుతాయి. భాగస్వాములు నుంచి పూర్తి సహకారం అందుతుంది. ఉద్యోగాలలో కొన్ని అవాంతరాలు ఎదురైనా అధిగమిస్తారు. మంచి గుర్తింపు రాగలదు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం. సన్మానాలు మహిళలకు కుటుంబంలో విశేష ఆదరణ సుబ్రహ్మణ్యాష్టకం పఠించండి..
కన్యా
పరిస్థితులు క్రమేనా అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవమర్యాదలు పొందుతారు. తరచూ ఎదురయ్యే సమస్యల నుంచి గట్టెక్కుతారు. మిత్రులు మీకు సహాయసహకారాలు అందిస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. కొన్ని సమస్యలు తొలగుతాయి. అందరితోనూ సఖ్యతగా మసలుతారు. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. వివాహాది వేడుకల నిర్వహణపై సోదరులతో సమాలోచనలు సాగిస్తారు.
భార్యాభర్తల మధ్య మరింత అన్యోన్యత ఏర్పడవచ్చు. శారీరక రుగ్మతలు తొలగుతాయి. వ్యాపారాలలో అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఊహించని విధంగా లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో మరింత ప్రోత్సాహకరంగా ఉంటాయి. సహచరుల ద్వారా ఊహించని మద్దతు లభిస్తుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు రెట్టించిన ఉత్సాహం, పదవీయోగాలు, మహిళలకు ఆస్తి లాభ సూచనలు, వేంకటేశ్వరస్వామిని పూజించండి.
తుల
వారం మొదట్లో ఇబ్బందులు, చికాకులు. భూములు కొంటారు. ప్రత్యర్థులు సైతం మీకు విధేయులుగా మారతారు. కొన్ని వివాదాలను నేర్పుగా పరిష్కరించుకుంటారు. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. కాంట్రాక్టులు సైతం దక్కుతాయి. ఇంటి నిర్మాణాలు చేపడతారు. నిరుద్యోగులు అనుకున్న ఉద్యోగాలు పొందుతారు. అప్పుల బాధలు తొలగుతాయి. అందరితోనూ సఖ్యత ఏర్పడుతుంది. మీపట్ల కుటుంబసభ్యులు విశేష ప్రేమ చూపుతారు. వైద్యసేవలు పొందుతారు. వ్యాపారాలలో అనూహ్యంగా విస్తరణ కార్యక్రమాలు చేపడతారు.
ఆశించిన లాభాలు తథ్యం. భాగస్వాములతో వివాదాలు పరిష్కారం. ఉద్యోగాలలో కొత్త అశలు చిగురిస్తాయి. హోదాలు మరింత పొందుతారు. సహచరులతో ఉత్సాహంగా గడుపుతారు. పారిశ్రామిక, రాజకీయవేత్తల కృషి, ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు మానసిక ప్రశాంత చేకూరుతుంది. విష్ణుధ్యానం చేయండి..
వృశ్చిక
కొత్త కార్యక్రమాలు చేపట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. పరిస్థితులు అనుకూలించి ముందడుగు వేస్తారు. విద్యార్థులు సత్తా చాటుకునేందుకు తగిన సమయం. దూరప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఒక సంఘటన మీలో మార్పు తీసుకురాగలదు. ఉద్యోగయత్నాలు ఫలిస్తాయి. కొంత సొమ్ము అనుకోకుండా దక్కుతుంది. ఆస్తుల పంపకాలలోనూ లబ్ధి పొందుతారు.
మీ నిర్ణయాలు, అభిప్రాయాలను కుటుంబ సభ్యులు మన్నిస్తారు. శుభ కార్యాలతో హడావిడిగా గడుపుతారు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు తథ్యం. కొత్త పెట్టుబడులు సమకూర్చుకుంటారు. విస్తరణ కార్యక్రమాలు మరింత ముమ్మరం చేస్తారు. ఉద్యోగాలలో అనూహ్యంగా కొత్త హోదాలు దక్కుతాయి. పైస్థాయి ఆదేశాల మేరకు విధి నిర్వహణలో ముందడుగు వేస్తారు. కళాకారులు, పారిశ్రామికవేత్తలు ఆకస్మికంగా విదేశీ పర్యటనలు చేస్తారు. మహిళలకు ఆశ్చర్యకర సంఘటనలు ఎదురుకావచ్చు. గణేశాష్టకం వరించండి.
ధనుస్సు
అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖులు పరిచయమై సహాయపడతారు. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఇళ్లు, వాహనాలు కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. రుణాలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. సోదరులు, సంతానం నుంచి సమస్యలు తీరతాయి. అహ్లాదకర వాతావరణం నెలకొంటుంది. శారీరక రుగ్మతల నుంచి బయటపడతారు.
వ్యాపారాలలో భాగస్వాములు అందించే పెట్టుబడులతో మరింతగా విస్తరిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఆశించిన లాభాలు దక్కుతాయి. ఉద్యోగాలలో విధులు ప్రశాంతంగా నిర్వహిస్తారు. అటుపోట్లు అధిగమిస్తారు. పైస్థాయి అధికారులు సహాయం అందుతుంది. రాజకీయవేత్తలు, కళాకారులకు సంతోషకర సమాచారం అందుతుంది. విదేశీ పర్యటనలు ఉంటాయి. మహిళలకు మనశ్శాంతి చేకూరుతుంది. నవగ్రహస్తోత్రాలు పదించండి.
మకరం
ఎంత ప్రయత్నించినా ముఖ్యమైన కార్యక్రమాలు ముందుకు సాగవు. విద్యార్థులు, నిరుద్యోగులు ఎంతగా కృషి చేసినా ఫలితం కనిపించదు. కొన్ని ఒప్పందాలు వాయిదా వేసుకుంటారు. తరచూ తీర్ధయాత్రలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మరిన్ని సమస్యలు సృష్టిస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. అవసరాలకు తగినంతగా డబ్బు అందక ఇబ్బందిపడతారు. రుణవార్తలు మరింత పెరుగుతాయి. సోదరులు, తల్లిదండ్రులతో విరోధాలు నెలకొంటాయి.
చీటికిమాటికి కోపతాపాలు ప్రదర్శించడంపై కుటుంబసభ్యులు అసహనం వ్యక్తం. చేస్తారు. కొంత కలత చెందినా ఉపశమనం పొందుతారు. వ్యాపారాలలో విస్తరణలో ఆటంకాలు ఎదురుకావచ్చు. పెట్టుబడులు ఆలస్యమవుతాయి. భాగస్వాములతో విరోధాలు, ఆటంకాలు ఎదురుకావచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఒత్తిడులు పెరుగుతాయి. మహిళలకు మానసిక ఆందోళన, విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.
కుంభం
ఎంతటి పని అయినా నేర్పుగా పూర్తి చేస్తారు. ఆత్మీయుల సూచనలు పాటిస్తారు. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. కొంత సొమ్ము అందడంతో అవసరాలు తీరతాయి. అందరిపై ప్రేమాభిమానాలు చూపుతారు. పెద్దల సలహాలు, సూచనలు పాటిస్తూ ముందుకు సాగుతారు. వేడుకలు, ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది. వైద్య సేవలు విరమిస్తారు. వ్యాపారాలలో సజావుగా సాగి లాభాలు గడిస్తారు.
కొత్త భాగస్వాములు చేరతారు. విస్తరణ కార్యక్రమాలు విజయవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం, పైస్థాయి వారి ప్రశంసలు అందుతాయి. రాజకీయవేత్తలు, కళాకారులు మంచి గుర్తింపు పొందుతారు. విశేష కీర్తిప్రతిష్టలు పొందుతారు. మహిళలకు ఆశ్చర్యకర సంఘటనలు ఎదురుకావచ్చు. పుట్టింటి వారి సహాయం అందుతుంది. హనుమాన్ చాలీసా వరించండి..
మీనం
కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు అధిగమిస్తారు. పరిచయాలు మరింత పెరుగుతాయి. కొన్ని సంఘటనలు ఆకట్టుకుంటాయి. విద్యార్థులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. కాంట్రాక్టులు దక్కి ఉత్సాహంగా గడుపుతారు. తీర్థయాత్రలు చేస్తారు. ఇంటి నిర్మాణాలు చేపడతారు. నూతన ఉద్యోగప్రాప్తి, సొమ్ముకు ఇబ్బందులు తొలగుతాయి.
రెండుమూడు విధాలుగా ధవప్రాప్తి శుభకార్యాల సందడి నెలకొంటుంది సోదరులు, సోదరీలతో ఆనందంగా గడుపుతారు. కొంత కలత చెందినా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు ఆర్జిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో కోరుకున్న మార్పులు సంభవం. పైస్థాయి వారి ప్రశంసలు, అభినందనలు అందుకుంటారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులు అవార్డులు పొందుతారు. కనకధారాస్తోత్రాలు పఠించండి.
టాపిక్