Weekly Horoscope Telugu। ఈ వారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఈవారం అన్ని విధాల కలిసివచ్చును!-weekly horoscope telugu check your astrology this week from may 21 to may 27 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Weekly Horoscope Telugu। ఈ వారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఈవారం అన్ని విధాల కలిసివచ్చును!

Weekly Horoscope Telugu। ఈ వారం రాశి ఫలాలు.. ఆ రాశి వారికి ఈవారం అన్ని విధాల కలిసివచ్చును!

HT Telugu Desk HT Telugu
May 21, 2023 01:15 AM IST

Weekly Horoscope Telugu: ఈ వారం మీ రాశి ఫలాలు, మే 21 నుంచి మే 27, 2023 వరకు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి. ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించిన వార ఫలాలు ఇక్కడ ఉన్నాయి.

Weekly Horoscope Telugu :
Weekly Horoscope Telugu : (freepik)

Weekly Horoscope Telugu: తెలుగు రాశి ఫలాలు (వార ఫలితము) 21.05.2023 నుండి 27.05.2023 వరకు

సంవత్సరం : శోభకృత్ నామ, అయనం : ఉత్తరాయనం, మాసం : జ్యేష్టము

మేష రాశి :

మేషరాశి వారికి ఈ వారం చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మేషరాశికి జన్మస్థానమునందు బుధ, గురు, రాహువుల మరియు వాక్ స్థానం నందు రవి ప్రభావంచేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. పనులుయందు ఆటంకములు, చికాకులు కలుగును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉ న్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశి వారికి శనియొక్క అనుకూల స్థితివలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందెదరు. మేషరాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి.

వృషభ రాశి :

వృషభరాశి వారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. వ్యయ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శారీరక శ్రమ, ఒత్తిడి అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములుండును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికముగా ఉండును. వృషభరాశివారికి దశమమునందు శని ప్రభావంచేత ఆర్ధికపరంగా లాభము చేకూరును. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని మరియు దుర్గాదేవిని పూజించడం మంచిది.

మిథున రాశి :

మిథునరాశివారికి ఈ వారం అనుకూలముగా ఉంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఖర్చులు అధికమగును. మిథున రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వాక్ స్థానమునందు కుజుని ప్రభావంచేత వివాదాలు ఏర్పడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుటచేత మిథున రాశి వారికి కలసివచ్చును. ఉ ద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. ఈ వారం మరింత శుభఫలితాల కోసం మిథునరాశి వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి :

కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థము నుండి చెడు ఫలితాలున్నాయి. జన్మరాశియందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ అధికముగా ఉండును. అయినప్పటికి లాభస్థానమునందు రవి, దశమ స్థానమునందు బుధ గురు, రాహువుల ప్రభావంచేత వృత్తి ఉ ద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయములయందు కుటుంబ వ్యవహారములయందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము. కర్కాటక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకము మరియు లింగాష్టకాన్ని పఠించండి.

సింహ రాశి :

సింహరాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. లాభ స్థానములో శుక్రుడు దశమస్థానములో రవిప్రభావంచేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశివారికి చేసే ప్రతి పని అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు అధికముగా జరుగు సూచన. నూతన వస్తువుల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేస్తారు. ఆర్ధికమపరమైన నిర్ణయాలు అనుకూలించును. విద్యార్థులకు అనుకూలమైన సమయము. స్త్రీలు కుటుంబవిషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. సింహరాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సూర్యాష్టకము పఠించడం, గురువారం దక్షిణామూర్తిని పూజించాలి.

కన్య రాశి :

కన్యారాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కన్యారాశి వారికి లాభస్థానములో కుజుడు, రాజ్యస్థానములో శుక్రుడు, భాగ్య స్థానములో రవి అనుకూల ప్రభావంచేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. అష్టమస్థానము నందు బుధ, గురు, రాహువుల సంచారం వలన ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. స్త్రీ సౌఖ్యం కలుగును. కన్యారాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును. కన్యారాశి ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి :

తులారాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత కుటుంబము నందు సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. అష్టమ రవి ప్రభావం చేత ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. దశమంలో కుజుడు, భాగ్యములో శుక్రుని అనుకూల ప్రభావం చేత సమస్యలు అధిగమించి ముందుకు వెళ్ళుదరు. కుటుంబ విషయాలయందు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు మధ్యస్థ సమయము. తులారాశి వారికి మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని దుర్గాదేవిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు.

వృశ్చిక రాశి :

వృశ్చికరాశికి ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉండును. స్త్రీలకు మధ్యస్థ సమయము. విద్యార్థులకు అనుకూల సమయము. వృశ్చిక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని మరియు దుర్గాదేవిని మంగళవారం రోజు పూజించడం మంచిది.

ధనుస్సు రాశి :

ధనూరాశి వారికి ఈ వారం మధ్యస్థము నుండి అనుకూల ఫలితాలున్నాయి. అష్టమ కుజుని ప్రభావంచేత కుటుంబములో మానసిక ఘర్షణలు, వాదనలు ఏర్పడు సూచన. ఏడో స్థానమునందు శుక్రుడు, ఐదో స్థానమందు నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగును. ఉ ద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారం. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ధనూరాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి.

మకర రాశి :

మకర రాశివారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రయాణములు అనుకూలించును. ఆరోగ్య విషయంలో మార్పు కలుగును. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన పంచమస్థానమునందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. కళత్ర స్థానమునందు కుజుని ప్రభావంచేత కుటుంబములో సమస్యలు, ఘర్షణలు అధికమగును. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. వ్యాపారస్తులకు కష్టకాలము. విద్యార్థులకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మకరరాశివారికి ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయాలి. శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి. మరియు శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును.

కుంభ రాశి :

కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలముగా ఉంది. ఆరో స్థానమునందు కుజుడు ఐదో స్థానమునందు శుక్రుడు తృతీయ స్థానమునందు రాహువు అనుకూల స్థితివలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. ప్రయాణములు అనుకూలించును. ఏలినాటి శని ప్రభావంచేత శారీరక శ్రమ, ధన వ్యయము ఏర్పడును. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం మరియు దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం చదువుకుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.

మీన రాశి :

మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నవి. ఏలినాటి శని ప్రభావం మరియు వాక్ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాలయందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు చేయడానికి ఇవ్వడానికి కూడా అనుకూలంగా లేనటువంటి సమయము. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు మథ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉ ండును. విద్యార్థులకు మధ్యస్థ సమయము. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును. గురువారం రోజు శనగలు మరియు తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,

మొబైల్ 9494981000.

- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
- బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ,
WhatsApp channel

సంబంధిత కథనం