Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు.. మీ రాశిఫలితం చెక్ చేసుకోండి-weekly horoscope telugu check your astrology prediction for september 17th to 23rd weekly horoscope ,రాశి ఫలాలు న్యూస్
Telugu News  /  Rasi Phalalu  /  Weekly Horoscope Telugu Check Your Astrology Prediction For September 17th To 23rd Weekly Horoscope

Weekly Horoscope : ఈ వారం రాశిఫలాలు.. మీ రాశిఫలితం చెక్ చేసుకోండి

ఈ వారం రాశి ఫలాలు
ఈ వారం రాశి ఫలాలు

Weekly Horoscope : ఈవారం రాశి ఫలాలు తేదీ సెప్టెంబరు 17.09.2023 నుండి 23.09.2023 వరకు జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

తెలుగు రాశిఫలితములు (వార ఫలితము) 17.09.2023 నుండి 23.09.2023 వరకు, సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : దక్షిణాయనం, మాసం : భాద్రపదం

ట్రెండింగ్ వార్తలు

మేషరాశి

మేషరాశి వారికి ఈ వారం మీకు అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. దీర్జకాలిక రుణ బాధల నుండి క్రమక్రమంగా బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. అధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. ప్రభుత్వ అధికారులతో పరిచయాలు విసతమవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. చాలాకాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇతరులకు మీ అలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఆర్థిక వ్యవహారాలు మరింత మెరుగవుతాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. మేషరాళశివారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుడిని పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభరాశి

వృషభరాశివారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. దీర్హకాలిక అరోగ్య సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. కుటుంబ సభ్యులతో అధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగ్గా ఉంటాయి. బంధుమిత్రులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో అవాంతరాలు అధిగమించి ముందుకు సాగుతారు. ముఖ్యమైన వ్యవహారాలను ప్రణాళికలను రూపొందించుకుని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. కొన్ని విషయాలలో ఓర్పుతో వ్యవహరించటం మంచిది. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. చిన్న తరహా పరిశ్రమలకు మరింత అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వారం చివరిలో పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. స్వల్చ అనారోగ్యం సూచనలు ఉన్నవి. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారంరోజు దుర్దాదేవిని పూజించాలి.

మిథునరాశి

మిథునరాశివారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. గృహమున సొంత ఆలోచనలు అమలు చేయడంలో ముందడుగు వేస్తారు. వారం మధ్యలో ఒక సంఘటన మిమ్మల్ని మరింత అశ్చర్యానికి గురి చేస్తుంది. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరానికి ధన సహాయం లభిస్తుంది. వ్యాపారాలలో కొన్ని సమస్యల పరిష్కారంలో ముందడుగు వేస్తారు. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో ధనవ్యయ సూచనలు ఉన్నవి. అనారోగ్య విషయాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. మిథునరాశివారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే అదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటకరాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. ఇంటా బయట చిత్ర విచిత్ర సంఘటనలు ఎదురవుతాయి. గృహ నిర్మాణయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ కలిగిస్తుంది. సోదరులతో అకారణంగా స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. ముఖ్యమైన వ్యవహారాలలో అలోచనలు నిలకడగా ఉండవు. అన్ని రంగాల వారికి ఒత్తిడులు పెరుగుతాయి. వారం చివరిలో దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు కలిసొస్తాయి. కర్కాటకరాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పరించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహరాశి

సింహరాశి వారికి ఈవారం మీకు అనుకూలంగా లేదు. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారులకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. చుట్టుపక్కల వారితో స్థ్‌రస్తి వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయవిక్రయాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వారం ప్రారంభంలో దూర ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపారస్తులు నూతన లాభాలను అందుకుంటారు. సింహరాశివారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యారాశి

కన్యారాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. నూతన భూ వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన గృహ నిర్మాణానికి సకాలంలో ధనం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. పాత మిత్రుల నుంచి అందిన సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. సంఘంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. వారం చివరిలో ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. కన్యారాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులారాశి వారికి ఈ వారం మీకు కలసివచ్చును. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. తెలివితేటలతో దీర్హకాలిక వివాదాల నుంచి బయటపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. ఇంటాబయట కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. ఉద్యోగాలలో కొంతవరకు పనిజత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లఖిస్తాయి. వారం ప్రారంభంలో ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శ్రమ తో కాని పనులు పూర్తి కావు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. విద్యార్థులకు శమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత థ్‌ద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు అంతగా అనుకూలించవు. వివాదాలకు కొంత దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయలేక నిరాశ పెరుగుతుంది. ఆర్థిక విషయాలు అంతంత మాత్రంగా ఉంటాయి. బంధు మిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ విషయంలో అలోచనలు స్థిరంగా ఉండవు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు వారం ప్రారంభంలో శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. ఆర్థికంగా వాతావరణం అనుకూలంగా ఉంటుంది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్షీ అష్టకం పఠించండి.

ధనూ రాశి

ధనూరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. మిత్రుల నుంచి బుణ ఒత్తిడులు పెరుగుతాయి. ఆర్థికంగా అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులు కలుగుతాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడం విఫలమవుతారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. కొన్ని పనులు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు కొంత మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహారించాలి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అధికమవుతాయి. అన్ని రంగాల వారికి కొత్త సమస్యలు తప్పవు. వారం ప్రారంభంలో శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన యోగం ఉన్నది. ధనూరాశివారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశివారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకోడిగా సాగుతాయి. విద్యార్థులకు ఆశించిన అవకాశములు లభించవు వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా పడతాయి. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నవి. వారం మధ్యలో అప్తుల నుండి శుభ వార్తలు అందుతాయి. వాహన యోగం ఉన్నది. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించక నిరాశ చెందుతారు. బంధువులతో వివాదాలు కొంతవరకు రాజి చేసుకుంటారు. స్థిరాస్తి వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదా వేస్తారు. అనుకున్న పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. ఇంటాబయట పని ఒత్తిడి పెరుగుతుంది. మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి

కుంభరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. దీర్హకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడి పాత రుణాలు తీర్చగలుగుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దలు సలహాలు తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. అధ్యాత్మిక 'సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో గృహమున సందడిగా గడుపుతారు. నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వారం మధ్యలో ఆకస్మిక ధన వ్యయ సూచనలు ఉన్నవి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. కుంభ రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. రుణయత్నాలు వేగవంతం చేస్తారు. గృహమున ఒక విషయంలో ఓర్చుగా వ్యవహరించడం మంచిది. పెద్దల ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనం చేసుకుంటారు. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేయలేరు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించక నిరాశ పెరుగుతుంది. వారం మధ్యలో శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన అనుకూలత కలుగుతుంది. సోదరుల నుంచి ధన సహాయం అందితుంది. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

WhatsApp channel