వారఫలాలు.. ఈ వారం వీరికి సమాజంలోని ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి-weekly horoscope may 26th to june 1st check mesha rasi to meena rasi results in telugu ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వారఫలాలు.. ఈ వారం వీరికి సమాజంలోని ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి

వారఫలాలు.. ఈ వారం వీరికి సమాజంలోని ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి

HT Telugu Desk HT Telugu
May 26, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. మే 26వ తేదీ నుంచిజూన్ 1వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వారఫలాలు మే 26 నుంచి జూన్ 1 వరకు
వారఫలాలు మే 26 నుంచి జూన్ 1 వరకు (pinterest)

రాశిఫలాలు (వార ఫలాలు) 26. 05. 2024 నుండి 01.06.2024 వరకు

సంవత్సరం : శ్రీ కోధి నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : వైశాఖము

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారపరంగా ఆశించిన లాభాలు అందుకుంటారు. బంధుమిత్రుల రాక ఆనందాన్నిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల సహకారంతో పదోన్నతులుంటాయి. పాత మిత్రులను కలుసుకుని విందు, వినోదాల్లో పాల్గొంటారు. మీరు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వృధా ఖర్చులుంటాయి. మేష రాశి మరింత శుభఫలితాలు ఈవారం పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. వృత్తి ఉద్యోగాలలో అనుకోని స్థాన చలన మార్పులుంటాయి. గృహమున ఆకస్మికముగా మార్పులు చేస్తారు. బంధుమిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగులకు లభించిన అవకాశాలు వాయిదాపడతాయి. కుటుంబ సభ్యుల నుండి విమర్శలు తప్పవు. చిన్ననాటి మిత్రుల నుండి ఆహ్వానాలు కొంత ఆనందం కలిగిస్తాయి. నూతన వస్త్ర అభరణాలు కొనుగోలు చేస్తారు. దూరప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నాయి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. వ్యాపారస్తులకు అంత అనుకూలంగా లేదు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి. కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. మానసిక చికాకులు అధికమవుతాయి. ప్రతి చిన్న విషయానికి అందోళన చెందుతారు. శత్రు సమస్యల నుంచి బయటపడతారు. బంధుమిత్రుల రాక ఆనందాన్నిస్తుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. నిరుద్యోగుల కష్టానికి తగగిన అవకాశాలు లభిస్తాయి. జీవిత భాగస్వామితో ఆనందముగా గడుపుతారు. వ్యాపారస్తులకు స్వల్ప లాభాలుంటాయి. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

వారఫలాల ప్రకారం కర్కాటక రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. బంధుమిత్రుల సహకారం ఉంటుంది. కీలకమైన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులు జాగ్రత్తగా పనిచేయాలి. రుణ సమస్యలు లేకుండా చూసుకోవాలి. శారీరక శ్రమ పెరుగుతుంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన వారం. కొన్ని సంఘటనలు ఆలోచింపచేసేలా ఉంటాయి. ధనపరంగా పొదుపును పాటించాలి. కుటుంబ సభ్యులకు మేలు జరుగుతుంది. ఆరోగ్యపరంగా అనుకూలం. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరాదు. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలంగా ఉన్నది. అనుకున్న సమయానికి అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. బంధుమిత్రులతో దూర ప్రయాణ సూచనలున్నాయి. చిన్ననాటి మిత్రులతో నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల సహకారంతో పదోన్నతులు పెరుగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. నూతన గృహ నిర్మాణానికి బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. సంతానం విద్యా విషయాలపై దృష్టి సారిస్తారు. ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్య నారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. చిన్ననాటి మిత్రుడు రాక ఆనందాన్నిస్తుంది. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్లు లభిస్తాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలుంటాయి. గృహనిర్మాణ ప్రయత్నంలో అవరోధాలు తొలగుతాయి. ప్రయాణాలు వాయిదాపడతాయి. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా ముందుకు సాగి విజయం సాధిస్తారు. విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు వహించాలి. విష్ణు సహస్రనామం పారాయణం, ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మానసిక ధైర్యంతో ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో అధికారులతో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారమవుతాయి. కోర్టు సంబంధిత వివాదాల నుండి బయటపడతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపార ప్రారంభానికి మిత్రుల నుండి పెట్టుబడులు అందుతాయి. విద్యార్థులకు అనుకూలం. నిరుద్యోగులకు ఉద్యోగ యోగమున్నది. ధనపరంగా మధ్యవర్తిత్వం చేయడం మంచిది కాదు. చాలాకాలంగా బాధిస్తున్న అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. తులా రాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. పాత రుణాలు కొంతవరకు తీర్చుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా సాగుతాయి. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. నూతన వస్తు, వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకశాలు లభిస్తాయి. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుకుంటారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. ఉద్యోగస్తు పని ఒత్తిళ్ళ నుండి విశ్రాంతి లభిస్తుంది. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. కుటుంబ సభ్యులతో అకారణంగా వివాదాలేర్ప డతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలుంటాయి. ప్రతి చిన్న విషయానికి కోపతాపాలు అధికమవుతాయి. చేపట్టిన కార్యక్రమాలు కొంత ఆలస్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు అదనపు పని బాధ్యతలుంటాయి. స్థిరాస్తి విషయంలో సోదరులతో ఒప్పందాలు వాయిదా పడతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారపరంగా మీరు తీసుకునే నిర్ణయాలు అంతగా కలసిరావు. నూతన వస్త్ర, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

మవారఫలాల ప్రకారం మకర రాశివారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. ఏ పని చేపట్టిన సమయానికి పూర్తికాక ఇబ్బందులు కలుగుతాయి. ఇతరులతో మాట్లాడే విషయంలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలున్నాయి. జీవిత భాగస్వామితో వివాదాలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాలలో అలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఒక వ్యవహారంలో బంధుమిత్రుల నుండి వ్యతిరేకత పెరుగుతుంది. నూతన వస్త ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. ధన ఆదాయ మార్గాలు తగ్గుతాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. వ్యాపార వ్యవహారాలు నిదానంగా సాగుతాయి. ఆర్థికపరమైన ఊహించని సమస్యలు ఎదుర్కొంటారు. శత్రుపరమైన సమస్యలు కొంతవరకు బాధిస్తాయి. నమ్మినవారి వల్లే మోసం జరుగుతుంది. ఉద్యోగస్తులకు అంత అనుకూలంగా లేదు. పనిభారం అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. గృహ నిర్మాణ ప్రయత్నాలు మధ్యలో నిలిచిపోతాయి. రుణదాతల నుండి ఒత్తిడి అధికమవుతుంది. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో విందువినోదాల్లో పాల్గొంటారు. సంతానపరంగా విద్యా విషయాలు కొంత అనుకూలిస్తాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. నూతన వ్యాపారాలు ప్రారంభించి మంచి లాభాలు అందుకుంటారు. కొన్ని వివాదాలలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకుని బయటపడతారు. దూర ప్రయాణాలు లాభిస్తాయి. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. పాత మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. మీ గౌరవ మర్యాదలకు లోటు ఉండదు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో దైవదర్శనం చేసుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూలమైన వారం. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త, ఆధ్యాత్మిక వేత్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel