వార ఫలాలు.. ఈ రాశుల వారికి నలుగురిలో గుర్తింపు..విందు, వినోదాల్లో పాల్గొంటారు
Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. మార్చి 31వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
రాశిఫలాలు (వార ఫలాలు) 31.03.2024 నుండి 06.04.2024 వరకు
సంవత్సరం : శోభకృత్ నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : ఫాల్గుణం
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. కుటుంబసభ్యులతో ఆనందముగా గడిపెదరు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో అజాగ్రత్త పనికిరాదు. ప్రయాణాలు కలసివస్తాయి. అన్నదమ్ముల సహకారం ఉంటుంది. కొన్ని సమస్యలు వచ్చినా వెంటనే పరిష్కారమవుతాయి. ఆరోగ్యం అనుకూలించును. సాహసించి పనులు చేస్తారు. ఉత్సాహంగా ఉంటారు. పలుకుబడితో పనులు నెరవేరతాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. విద్యార్థులకు అనుకూల సమయం. మేషరాశి మరింత శుభఫలితాలు ఈవారం పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది.
వృషభ రాశి
వార ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మంచివారితో స్నేహం కలుగుతుంది. ఉన్నత విద్యా ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం అనుకూలం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.
మిథున రాశి
మిథున రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రారంభించిన పనులు నిదానంగా సాగుతాయి. విందు, వినోదాల్లో పాల్గొంటారు. అవసరానికి డబ్బు అందుతుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్యులతో సఖ్యత నెలకొంటుంది. శుభవార్త వింటారు. ఆకస్మిక మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. భూలావాదేవీలకు అనుకూలం. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబముతో ఆనందముగా గడిపెదరు. పలుకుబడి పెరుగుతుంది. ఉత్సాహంగా పనులు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లో అనుకూల తీర్పులు వెలువడతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. స్థిర,చరాస్తుల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.
సింహ రాశి
సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. అధికారులతో భేదాభిప్రాయములు రావచ్చు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సినిమా రంగంలో వారికి కొత్త అవకాశాలు వస్తాయి. శుభకార్య విషయాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. రాబడి పెరుగుతుంది. ఖర్చులుంటాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అవకాశాలు ఏర్పడతాయి. స్థిరాస్తి వ్యవహారాల్లో సోదరులతో అభిప్రాయ భేదాలు ఏర్పడవచ్చు. ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్యనారాయణమూర్తిని పూజించండి.
కన్యా రాశి
కన్యా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. పదోన్నతి, అనుకూల బదిలీ అవకాశాలున్నాయి. బాల్యమిత్రులను కలుసుకుంటారు. వాహన మరమ్మత్తులు ముందుకు రావచ్చు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితాలు వస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. ఆరోగ్య విషయంలో స్వల్ప ఇబ్బందులుంటాయి. విష్ణు సహస్రనామం పారాయణం, ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.
తులా రాశి
తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంచివారి సహచర్యం లభిస్తుంది. కొత్త దుస్తులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు ఒత్తిళ్ళు ఉంటాయి. శుభవార్త వింటారు. ఆరోగ్యం అనుకూలం. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. తీర్థయాత్రలు, నదీ స్నానాలు చేస్తారు. పెద్దల సహాయ సహకారాలు అందుతాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. శుభకార్యాలకు హాజరవుతారు. అన్నదమ్ములతో కలసిమెలసి ఉంటారు. వ్యాపారస్తులకు అనుకూలం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. పాత బాకీలు వసూలు అవుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు అనుకూల సమయం. అధికారుల మన్ననలు అందుకుంటారు. కొన్ని విషయాల్లో తాత్మాలిక ప్రయోజనాలు పొందుతారు. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.
ధనూ రాశి
వార ఫలాల ప్రకారం ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. పనుల్లో విజయం సాధిస్తారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఆర్థిక సమస్యలు తీరతాయి. శుభవార్త ఆనందాన్నిస్తుంది. చాలాకాలంగా ఉన్న సమస్యకు పరిష్కారం లభిస్తుంది. రోజువారీ కార్యకలాపాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పలుకుబడి పెరుగుతుంది. సాహసంతో ముందుకు వెళతారు. ఉద్యోగస్తులకు అనుకూలం. సమయపాలన అవసరం. న్యాయపరమైన సమస్యలు అధిగమిస్తారు. ఆరోగ్యం అనుకూలం. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.
మకర రాశి
మకర రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉన్నది. శుభకార్యాలు చేస్తారు. కుటుంబముతో సంతోషంగా గడుపుతారు. పెద్దల సలహా పాటిస్తారు. బంధుమిత్రులతో పనులు నెరవేరతాయి. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగస్తులకు పై అధికారుల సహాయం లభిస్తుంది. నలుగురిలో గుర్తింపు పొందుతారు. ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలకు హాజరవుతారు. కళాకారులకు గుర్తింపు లభిస్తుంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.
కుంభ రాశి
కుంభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహకారం లభిస్తుంది. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. రావలసిన డబ్బు కొంత ఆలస్యంగా చేతికి అందుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది. కొత్త పరిచయాలు బాగా కలసివస్తాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొనసాగుతాయి. ఆరోగ్యంగా ఉంటారు. ఉల్లాసంగా పనులు చేస్తారు. బంధుమిత్రుల రాకతో ఇల్లు సందడిగా ఉంటుంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త ఉద్యోగంలో చేరే అవకాశముంది. ఆదాయం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, స్థానచలన మార్పులుంటాయి. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. శుభకార్య ప్రయత్నాలలో పెద్దల సహకారం ఉంటుంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
మొబైల్ : 9494981000