వారఫలాలు- ఈ రాశుల వారికి ఈ వారం అద్భుతంగా ఉండబోతుంది-weekly horoscope in telugu september 29th to october 5th horoscope check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వారఫలాలు- ఈ రాశుల వారికి ఈ వారం అద్భుతంగా ఉండబోతుంది

వారఫలాలు- ఈ రాశుల వారికి ఈ వారం అద్భుతంగా ఉండబోతుంది

HT Telugu Desk HT Telugu
Sep 29, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ  వరకు వారఫలాలు
సెప్టెంబర్ 29వ తేదీ నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు వారఫలాలు (pixabay)

రాశి ఫలాలు (వార‌ ఫలాలు) 29.09.2024 నుంచి 05.10.2024 వ‌ర‌కు

మాసం : భాద్ర‌ప‌ద‌ము, (అక్టోబ‌ర్ 3 నుంచి ఆశ్వయుజము)

సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేషం

ఈ వారం మేష రాశి వారికి శుభ ఫ‌లితాలు అందిస్తుంది. ఆలోచనలు కలిసి వస్తాయి. ఇంటి నిర్మాణ యత్నాలు కొంతమేర ఫలిస్తాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. స‌మాజంలో కీర్తి పెరుగుతుంది. రావలసిన సొమ్ము అందుతుంది. అందరిలోను గౌరవం పెరుగుతుంది. వ్యాపారులు ఉత్సాహవంతంగా సంస్థలను నడుపుతూ అందర్నీ ఆకట్టుకుంటారు. కొత్త పెట్టుబడులు, భాగస్వాములు సమకూరతారు. ఉద్యోగులకు విధి నిర్వహణలో ప్రశాంతంగా గ‌డుపుతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు నూతనోత్సాహం ల‌భిస్తుంది. పరిశోధకుల కృషి ఫలిస్తుంది.

వృషభం

కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్ప‌డ‌తాయి. ప్రముఖుల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఇంటి నిర్మాణాల్లో అవాంతరాలు తొలగుతాయి. అనుకున్న కార్యాలు సకాలంలో చక్కదిద్దుతారు. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. రావలసిన సొమ్ము అందుతుంది. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపార, వాణిజ్య వర్గాల కృషి ఫలిస్తుంది. నూతన పెట్టుబడులు. ఉద్యోగులకు కొత్త పోస్టులు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ఆశాజనకంగా ఉంటుంది.

మిథునం

ఈ వారం వారఫలాల ప్రకారం మిథున రాశి వాళ్ళు అనుకూల పరిస్థితుల మధ్య ముందుకు సాగుతారు. విద్యార్థులకు కోరుకున్న అవకాశాలు ద‌క్కుతాయి. చిత్రమైన సంఘటనలు ఎదుర‌వుతాయి. ఇంటి నిర్మాణాలు కలిసి వస్తాయి. రావలసిన సొమ్ము సకాలంలో అందుతుంది. సోదరులతో విభేదాలు తీరతాయి. ఉద్యోగయత్నాలు సానుకూలంగా పూర్తి అవుతాయి. వ్యాపార, వాణిజ్యవర్గాలకు లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఉన్నత పోస్టులు దక్కవచ్చు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వైద్యులు ప్రావీణ్యాన్ని చాటుకుంటారు.

కర్కాటకం

ఎంతటి కార్యమైనా పట్టుదలతో పూర్తి చేస్తారు. సమాజంలో పేరుప్రతిష్టలు ల‌భిస్తాయి. అనుకోని సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన విద్యా వకాశాలు ద‌క్కుతాయి. వాహన, గృహ కొనుగోలు యత్నాలు సానుకూలం అవుతాయి. రావలసిన డబ్బు అందుతుంది. కుటుంబంలోని అందరితోనూ సంతోషకరంగా గడుపుతారు. వ్యాపారులకు అనుకున్న పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు ఉన్న‌త‌ స్థితిలోని వారు చేదోడుగా నిలుస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులు సత్తా చాటుకుంటారు. పరిశోధకులకు ఇబ్బందులు తొలగుతాయి.

సింహం

ముఖ్యమైన కార్యాల్లో విజయం సాధిస్తారు.స్నేహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వాహన, గృహయోగాలు క‌లిసి వ‌స్తాయి. ఆస్తుల విషయంలో వివాదాల పరిష్కారం అవుతాయి. అనుకున్న ఆదాయం సమకూరే సమయం ఇది. అప్పులు తీరతాయి. వ్యాపార, వాణిజ్య వర్గాలకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు కోరుకున్న విధంగా మార్పులు ఉండవచ్చు. పారిశ్రామిక, రాజకీయవేత్తలు మరింత నేర్పుగా వ్యవహరించి విజయాలు సాధిస్తారు. క్రీడాకారులకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి.

కన్య

పరిస్థితులు అనుకూలిస్తాయి. విద్యార్థుల యత్నాలు సఫలం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఇంటి నిర్మాణాలలో అవాంతరాలు తొలగుతాయి. సొమ్ము అప్రయత్నంగా దక్కుతుంది. సోదరుల నుంచి కీలక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. వ్యాపార, వాణిజ్యవర్గాల యత్నాలు సఫలం అవుతాయి. పెట్టుబడులకు ఢోకాలేదు. ఉద్యోగులు విధి నిర్వహణ ప్రశాంతంగా గడుపుతారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది.

తుల

కొత్త కార్యాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. ఆలోచనలు అమలు చేసి సత్తా చాటుకుంటారు. నిరుద్యోగులకు ఆశించిన ఉద్యోగాలు ద‌క్కుతాయి .కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. స్థిరాస్తుల వివాదాలు కొంతమేర తీరతాయి. అదనపు ఆదాయం అందే అవ‌కాశం ఉంది. కుటుంబ సభ్యులతో వివాదాల సర్దుబాటు కావ‌చ్చు. వ్యాపార, వాణిజ్యవర్గాలకు పెట్టుబడులు సమకూరతాయి. ఉద్యోగులకు అవాంతరాలు తొలగుతాయి. కళాకారులు, రాజకీయవేత్తలకు నూతనోత్సా హం. క్రీడాకారుల యత్నాలు సఫలం అవుతాయి.

వృశ్చికం

ఆలోచనలు వెంటనే అమలు చేస్తారు. ప్రముఖుల నుంచి కీలక సమాచారం రావడంతో ఊపిరి పీల్చుకుంటారు. కొత్త కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. సమాజంలో గౌరవానికి ఎటువంటి లోటు రాదు. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం అవుతాయి. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్ప‌డుతుంది. రావలసిన సొమ్ము అందుతుంది. వ్యాపారులకు గతం కంటే మరిన్ని లాభాలు. ఉద్యోగులు సమర్థవంతంగా పనిచేస్తారు. రాజకీయ, పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు. పరిశోధకులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

ధనుస్సు

ఆశ్చర్యకరమైన రీతిలో కార్యక్రమాలు పూర్తి. ఆస్తులు వ్యవహారాల్లో చిక్కులు తొలగుతాయి. వాహనాలు, ఆభరణాలు సమకూర్చుకుంటారు. పట్టుదలతో అనుకున్న ఉద్యోగాలు సాధిస్తారు. పరిచయాలు పెరుగుతాయి. రాబడి ఉత్సాహం గా ఉంటుంది. వ్యాపార, వాణిజ్యవర్గాల కృషి ఫలిస్తుంది. భాగస్వాములతో కొత్త ఒప్పందాలు. ఉద్యోగుల సేవలకు గుర్తింపు. పారిశ్రామికవేత్తలకు అనూహ్యమైన అవకాశాలు. కళాకారులు, క్రీడాకారులు విజయాల బాటలో నడుస్తారు.

మకరం

స్నేహితులు మీపై విమర్శలు చేయొచ్చు. నిదానం పాటించాలి. ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వివాహాది వేడుకల నిర్వహణపై దృష్టి. ముఖ్యుల నుంచి ఆహ్వానాలు. రావలసిన డబ్బు సమకూరుతుంది. మీ అభిప్రాయాలను అందరూ గౌరవిస్తారు. వ్యాపారులకు అనుకున్న లాభాలు. ఉద్యోగులు ఒడిదుడుకులు అధిగమిస్తారు. రాజకీయవేత్తలు, కళాకారులకు ఉత్సాహవంతం. క్రీడాకారులు లక్ష్యసాధనలో ముందుకు సాగుతారు.

కుంభం

ఈ వారం వారఫలాల ప్రకారం కుంభ రాశి వారి ముఖ్యమైన కార్యాలు ఎట్టకేలకు పూర్తి అవుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. భూములు, వాహనాలు కొంటారు. ఆదాయం గతం కంటే మెరుగ్గా ఉంటుంది. సోదరులు, సోదరీలతో వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపార, వాణిజ్యవర్గాలకు కొన్ని సమస్యలు తీరతాయి. పెట్టుబడులు అనూహ్యంగా దక్కు తాయి. ఉద్యోగులు పైవారి దృష్టిలో పడతారు. పారిశ్రామికవేత్తలు, కళాకారులకు అనుకూలం. క్రీడాకారులకు నూతనోత్సాహం.

మీనం

అనుకున్న కార్యాలు ముందుకు సాగవు. స్నేహితులతో అకారణ తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండక ఎటూ తేల్చుకోలేరు. కొన్ని నిర్ణయాలు మార్చుకుంటారు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. ఆత్మీయుల నుంచి పిలుపు అందుతుంది. పరిచయాలు పెరుగుతాయి. కొంత సొమ్ము అప్రయత్నంగా లభిస్తుంది. కొత్త నిర్ణ యాలు తీసుకుంటారు. వ్యాపారులు గతం కంటే మెరుగుపడి లాభాల బాటపడతారు. రాజకీయవేత్తలకు మంచి గుర్తింపు. కళాకారులు, వైద్యులకు ఉత్సాహవంతంగా ఉంటుంది.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ