ఈ వారం వారఫలాలు- ఈ రాశి వారికి ఊహించనివి జరిగితే, వీరికి మాత్రం అన్నింటా విజయమే-weekly horoscope in telugu november 10th to 16th check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ వారం వారఫలాలు- ఈ రాశి వారికి ఊహించనివి జరిగితే, వీరికి మాత్రం అన్నింటా విజయమే

ఈ వారం వారఫలాలు- ఈ రాశి వారికి ఊహించనివి జరిగితే, వీరికి మాత్రం అన్నింటా విజయమే

HT Telugu Desk HT Telugu
Nov 10, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. నవంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

నవంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు వారఫలాలు
నవంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు వారఫలాలు (pinterest)

రాశిఫలాలు (వారఫలాలు) 10-11-2024 నుంచి 16.11.2024

మాసం: కార్తీకము,

ఆయనము: దక్షిణాయనం, సంవత్సరం: శ్రీ క్రోధినామ సంవత్సరం

మేషం

అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన ప్రతి పనిలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగావకాశం. పలుకుబడి పెరుగుతుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. స్వల్పంగా అనారోగ్యం కలుగుతుంది. గౌరవమర్యాదలు పెరుగుతాయి. రాజకీయనాయకులకు, వ్యాపారవేత్తలకు కలసివస్తుంది. అదృష్ట రంగులు ఎరుపు, బంగారు రంగు. హనుమాన్‌ చాలీసా పఠనం మంచిది.

వృషభం

ఈ వారం వార ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఊహించనివి జరుగుతాయి. కొత్తపనులను ప్రారంభిస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు ప్రమోషన్లు దక్కుతాయి. రాజకీయనాయకులకు, కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మిత్రులతో విభేదాలు తలెత్తవచ్చు. స్వల్ప అనారోగ్య సూచన. నలుపు, లేత గులాబీ రంగులు. కనకధారా స్తోత్రం పఠించండి.

మిథునం

ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. విద్యార్థుల ఆశలు ఫలిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సూచన. సకాలంలో పనులు పూర్తవుతాయి. మంచి గుర్తింపు లభిస్తుంది. ఇంటి నిర్మాణ యత్నాలు కలసివస్తాయి. ఇంటి నిర్మాణయత్నాలు కలసివస్తాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన సమాచారం. రాజకీయవర్గాలకు సన్మానాలు. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలు. మానసిక అశాంతి. తెలుపు, ఆకుపచ్చ రంగులు, ఈశ్వరారాధన ఉత్తమం.

కర్కాటకం

కుటుంబ సమస్యలు వేధిస్తాయి. పనులు సజావుగా సాగవు. బంధుమిత్రులతో వివాదాలు. వ్యాపారులకు నిరాశాజనకంగా ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు, రాజకీయ నాయకులకు కష్టం మిగులుతుంది. అనారోగ్యం తలెత్తుతుంది. ఆకస్మిక ధనలాభ సూచన. లేత ఆకుపచ్చ, నేరేడు రంగులు. దేవీఖడ్గమాల స్తోత్రం పఠించండి.

సింహం

అంతా అనుకూలంగా ఉంటుంది. పలుకుబడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యులతో మనస్పర్థలు తొలగుతాయి. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. వాహనయోగం. భూములు, కొంటారు. వివాహాది శుభకార్యాలకు హాజరవుతారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు రాగలవు. కళాకారులకు సన్మానాలు. వారం చివరిలో వృథా ఖర్చులు. గులాబీ, తెలుపు రంగులు, నృసింహ స్తోత్రాలు పఠించండి.

కన్య

అనుకున్న పనులు పూర్తవుతాయి. అందర్నీ మాటలతో ఆకట్టుకుంటారు. ఆత్మీయుల నుంచి పిలుపు రావచ్చు. ఆకస్మిక ధనలాభం. వాహనయోగం. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. కుటుంబంలో శుభకార్యాల ప్రస్తావన. ఆలయాలు సందర్శిస్తారు. ఉద్యోగులకు మంచి సమాచారం అందుతుంది. పారిశ్రామికవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో వ్యయ ప్రయాసలు. ఆరోగ్యసమస్యలు తలెత్తుతాయి. ఎరుపు, నేరేడు రంగులు. శ్రీరామస్తోత్రాలు పఠించండి.

తుల

ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. భార్య ద్వారా ఆస్తిలాభ సూచనలు. పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయమవుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. అందరూ సహకరిస్తారు. ఇంటి నిర్మాణయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు ప్రశంసలు అందుతాయి. రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో ఆరోగ్య సమస్యలు. నీలం, ఆకుపచ్చ రంగులు, లక్ష్మీగణపతి స్తోత్రాలు పఠించండి.

వృశ్చికం

వివాదాలు పరిష్కారం అవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సూచన. విద్యార్థులు మంచి సమాచారాన్ని అందుకుంటారు. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి. వ్యాపారాలు లాభసాటిగా జరుగుతాయి. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతం అవుతాయి. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆకుపచ్చ, పసుపురంగులు. విష్ణు సహస్రనామాలు పఠించండి.

ధనుస్సు

ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. చేపట్టిన పనులు పూర్తవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. పెద్దల సహకారం లభిస్తుంది. ఉద్యోగులకు గుర్తింపు లభిస్తుంది. రాజకీయ నాయకుల ఆశలు నెరవేరుతాయి. వారం మధ్యలో అనారోగ్య సూచన. పసుపు, లేత గులాబీ రంగులు. హయగ్రీవ స్తోత్రాలు పఠిస్తే మరిన్ని మంచి ఫలితాలు పొందుతారు.

మకరం

అన్నింటా విజయం లభిస్తుంది. పనులన్నీ పూర్తవుతాయి. అన్నింటా మీదే పైచేయి. విద్యార్థులకు కలసివచ్చే కాలం. వాహనాలు, ఆభరణాలు కొంటారు. ఒత్తిడులు తొలగుతాయి. వ్యాపారులకు అనుకూలంగా ఉంటుంది. కళాకారులు సత్కారాలు, సన్మానాలు అందుకుంటారు. ఉద్యోగుల శ్రమకు గుర్తింపు. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. గులాబీ, నేరేడు రంగులు. దక్షిణామూర్తి స్తోత్రం పఠించండి.

కుంభం

వారఫలాల ప్రకారం కుంభ రాశి వారికి అనుకున్న పనులు పూర్తవుతాయి. ఆర్థిక సమస్యలు కొలిక్కి వస్తాయి. వాహన యోగం. భూములు కొంటారు. కొత్తవారితో పరిచయాలు కలుగుతాయి. వ్యాపారాల్లో మంచి లాభాలు గడిస్తారు. ఉద్యోగులకు పదోన్నతియోగం. విదేశీ ప్రయాణాలు చేస్తారు. వారం మధ్యలో అనవసర ధనవ్యయం. పసుపు, తెలుపు రంగులు. శివపంచాక్షరి జపించండి.

మీనం

అనుకున్నది సాధిస్తారు. కొత్త ఆలోచనలు కలసివస్తాయి. ఆదాయం బాగుంటుంది. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ సూచన. ఉద్యోగులకు పదోన్నతి అవకాశాలు. కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారాల్లో ఆశలు చిగురిస్తాయి. వారం చివరిలో ఖర్చులు పెరుగుతాయి. ఆకుపచ్చ, ఎరుపు రంగులు. అంగారక స్తోత్ర పఠనం మంచి ఫలితాలనిస్తుంది.

Whats_app_banner