వార ఫలాలు.. ఈ వారం ఈ రెండు రాశుల వారికి అనుకూలంగా లేదు, అందులో మీరు ఉన్నారా?-weekly horoscope in telugu may 5th to may 11th rasi phalalu check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు.. ఈ వారం ఈ రెండు రాశుల వారికి అనుకూలంగా లేదు, అందులో మీరు ఉన్నారా?

వార ఫలాలు.. ఈ వారం ఈ రెండు రాశుల వారికి అనుకూలంగా లేదు, అందులో మీరు ఉన్నారా?

HT Telugu Desk HT Telugu
May 05, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. మే 5వ తేదీ నుంచి మే 11వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వార ఫలాలు మే 5వ తేదీ నుంచి మే 11వరకు
వార ఫలాలు మే 5వ తేదీ నుంచి మే 11వరకు (pinterest)

రాశిఫలాలు (వార ఫలాలు) 05.05.2024 నుండి 11.05.2024 వరకు

సంవత్సరం : శ్రీ క్రోధి నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : చైత్రము

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. వ్యాపారులకు కాలం కలిసి వస్తుంది. వ్యాపార విస్తరణకు మంచి సమయం. విద్యార్థులకు విదేశాల్లో ఉన్నత విద్య కోసం అవకాశాలు రావచ్చు. ఆర్థికంగా మధ్యస్థంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. బంధువర్గంతో పనులు నెరవేరుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. మేష రాశివారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.

వృషభ రాశి

వార ఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగులకు మంచి సమయం. శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. అధికారుల అండదండలు ఉంటాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. ప్రయాణాలు కలసివస్తాయి. ఉద్యోగులకు పదోన్నతి, అనుకూల స్థాన చలన సూచన. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. కొత్త దుస్తులు, వస్తువులు కొనుగోలు చేస్తారు. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. భూలావాదేవీలు కలసివస్తాయి. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించండి. శనివారం రోజు దుర్గాదేవిని పూజించాలి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు లాభదాయకంగా పూర్తవుతాయి. శుభకార్య ప్రయత్నాల్లో బంధువుల సహకారం లభిస్తుంది. ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంటారు. కోర్టు కేసుల్లో అనుకూల తీర్పులు వెలువడుతాయి. వ్యాపార ఒప్పందాల్లో ఆచితూచి వ్యవహరించాలి. కొత్త పరిచయాలేర్పడతాయి. వివాదాలకు దూరంగా ఉండుట మంచిది. కనకధారా స్తోత్రాలు పఠించండి. మిథున రాశి వారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. దూర ప్రయాణాలు కలసివస్తాయి. ఉద్యోగులు అధికారులతో స్నేహంగా ఉండటానికి ప్రయత్నిస్తారు. కుటుంబముతో సంతోషంగా గడుపుతారు. అనవసరమైన చర్చలకు దూరంగా ఉండండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహిస్తారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితం పొందుతారు. వ్యాపారులకు మంచికాలం. కర్కాటక రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలంగా ఉన్నది. కుటుంబంతో ఆనందముగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం అనుకూలించును. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుస్తారు. అనుకున్న పనులు నెరవేరతాయి. కార్య సాఫల్యం ఉంది. ఆర్థికంగా కలసివస్తుంది. సమయానుకూల నిర్ణయాలతో ముందుకు సాగుతారు. సింహ రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. ఉద్యోగులకు పనిభారం పెరగవచ్చు. కుటుంబ పెద్దల సహకారం పొందుతారు. తీర్థయాత్రలకు వెళ్ళవచ్చు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రభుత్వ పనులలో కాలయాపన జరుగుతుంది. కోర్టు తీర్పులు అనుకూలంగా రావచ్చు. కన్యా రాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్రనామం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగులు తోటివారితో స్నేహంగా ఉంటారు. పదోన్నతి, అనుకూల బదిలీ ఉండవచ్చు. కళాకారులకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వృత్తిలో మంచి పేరు సంపాదిస్తారు. రోజువారీ వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. రావలసిన డబ్బు ఆలస్యంగా చేతికి అందుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం, గుర్తింపు లభిస్తాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు సఫలం అవుతాయి. మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ప్రారంభించిన పనులు శ్రద్ధతో పూర్తిచేస్తారు. అందరి సహకారం లభిస్తుంది. శ్రమకు తగిన ప్రతిఫలం వస్తుంది. బంధువులతో కార్య సాఫల్యం ఉంటుంది. ఉద్యోగులకు అనుకూల సమయం. అధికారుల అండదండలుంటాయి. వివాదాలకు దూరంగా ఉండండి. వ్యాపార భాగస్వాముల మధ్య అవగాహన పెరుగుతుంది. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. ఆరోగ్యం అనుకూలం. గురుదక్షిణామూర్తిని పూజించడం మంచిది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మిదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. వ్యాపారంలో రావలసిన సొమ్ము ఆలస్యంగా అందటంతో కొన్ని పనులు వాయిదా పడతాయి. ఉద్యోగులకు అధికారుల ఆదరణ లభిస్తుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. శ్రమతో లక్ష్యాలు పూర్తిచేస్తారు. స్నేహితుల రాకతో ఖర్చులు పెరుగుతాయి. భూ లావాదేవీలు కలసివస్తాయి. శుభకార్య ప్రయత్నాలు చురుగ్గా సాగుతాయి. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ధనూ రాశివారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్ట్రకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉదోగ్య ప్రయత్నాల్లో ఉన్నవారు శుభవార్త వింటారు. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. అధికారులతో స్నేహంగా ఉంటారు. గౌరవ మర్యాదలకు లోటుండదు. పదోన్నతి, బదిలీలు ఉండవచ్చు. ఉత్సాహంగా పనులు చేస్తారు. తీర్థయాత్రలు, విహారయాత్రలకు వెడతారు. గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. మకర రాశివారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. బరువు, బాధ్యతలు పెరిగినా సంతృప్తిగా ఉంటారు. వ్యాపారులకు ఒప్పందాలు అనుకూలిస్తాయి. కొత్త అవకాశాలు వస్తాయి. వాహనం వల్ల పనులు నెరవేరుతాయి. అయితే వృథా ఖర్చులతో ఇబ్బందులు రావచ్చు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలుంటాయి. ఆస్తి తగాదాలు కొంతవరకు పరిష్కారం అవుతాయి. కుంభ రాశి వారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ఉద్యోగులకు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. ఆస్తుల మూలంగా ఆదాయం పెరుగుతుంది. శుభవార్త వింటారు. ఆరోగ్యంపై జాగ్రత్త వహిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. రాజకీయ పనులలో పురోగతి ఉంటుంది. వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel