వార ఫలాలు.. ఈ వారం కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి, వాహనం కొనుగోలు చేస్తారు-weekly horoscope in telugu march 17th to march 23rd horoscope check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వార ఫలాలు.. ఈ వారం కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి, వాహనం కొనుగోలు చేస్తారు

వార ఫలాలు.. ఈ వారం కోర్టు కేసులు పరిష్కారం అవుతాయి, వాహనం కొనుగోలు చేస్తారు

HT Telugu Desk HT Telugu
Mar 17, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. మార్చి 17వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

మార్చి 17వ తేదీ నుంచి 23 వరకు వార ఫలాలు
మార్చి 17వ తేదీ నుంచి 23 వరకు వార ఫలాలు (pixabay)

రాశిఫలాలు (వార ఫలాలు) 17.03.2024 నుండి 23.03.2024 వరకు

సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : ఫాల్గుణ

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. భూములు, వాహనములు కొనుగోలు చేస్తారు. ఆస్తి వివాదాల నుండి గట్టేక్కుతారు. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. చిరాస్తి వివాదాలు పరిష్కారంవ్ అవుతాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. అనారోగ్య సమస్యలు ఉంటాయి. మేషరాశి మరింత శుభఫలితాలు ఈవారం పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ప్రశంసలు అందుతాయి. శారీరక సమస్యలు కొంత ఇబ్బంది పెట్టవచ్చు. ముఖ్యమైన పనులు కొంత నెమ్మదిగా పూర్తికాగలవు. ఆర్థిక వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.

మిథున రాశి

వార ఫలాల ప్రకారం మిథున రాశివారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు మంచి గుర్తింపు వస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశములుంటాయి. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. రాజకీయ నాయకులు శుభవార్తలు వింటారు. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. వ్యాపారస్తులకు అనుకూల సమయం. కొత్త పెట్టుబడులు అందుతాయి. కోర్టు కేసులు కొన్ని పరిష్కారం అవుతాయి. ఉద్యోగస్తులకు ఇబ్బందులు తొలగుతాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. ప్రముఖుల నుండి కీలక సమాచారం అందుతుంది. ధన వ్యయముండును. భూ వివాదాలు పరిష్కారమవుతాయి. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆస్తి వివాదములు పరిష్కారమవుతాయి. వాహనములు, గృహములు కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. వ్యాపారస్తులకు లాభసాటిగా వుంటుంది. ఉద్యోగస్థులకు మధ్యస్థ సమయం. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్య నారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

వార ఫలాల ప్రకారం కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు ఉన్నత పదవులు ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేస్తారు. శత్రువులు మిత్రువులుగా మారతారు. కొన్ని విషయాలలో మీ సత్తా నిరూపించుకుంటారు. విష్ణు సహస్రనామం, ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. గృహనిర్మాణ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఉద్యోగస్థులకు అనుకూల మార్పులు ఉంటాయి. ధన వ్యయముండును. శ్రమ పెరిగినా ఫలితం కనిపించదు. అనుకున్న మేరకు డబ్బు చేతికి అందుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి. స్థిరాస్తి వివాదములు పరిష్కార దిశకు చేరతాయి. ఆరోగ్యం అనుకూలం. మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. మీరు చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనములు, భూములు కొనుగోలు చేస్తారు. సభలు సమావేశములలో పాల్గొంటారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులు అనుకొన్న లక్ష్యాలు సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. కళారంగం వారికి కొత్త అవకాశాలుంటాయి. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. వాహనములు, భూములు కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్థులకు పదోన్నతులుంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి. ముఖ్యమైన పనులలో విజయం సాధిస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. ఆస్తి వివాదములు నెలకొంటాయి. విద్యార్థులు, నిరుద్యోగుల ప్రయత్నములు నెమ్మదిగా సాగుతాయి. గృహ నిర్మాణాల్లో ఆటంకాలుంటాయి. వ్యాపాస్తులకు మద్యస్థ సమయం. ఉద్యోగస్తులకు పని ఒత్తిడులు పెరుగుతాయి. వాహన యోగముంది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. కొన్ని వివాదముల నుండి బయట పడతారు. నిరుద్యోగలుకు శుభ వార్తలు. వ్యాపారస్తులకు లాభదాయకం. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెట్టును. గతంలో నిలిచిపోయిన పనులు పూర్తిచేస్తారు. కొత్త వ్యక్తుల పరిచయం సంతోషం కలిగిస్తుంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథపప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు లాభదాయకం. ఉద్యోగస్తులకు అనుకోని పదోన్నతులు. కాంట్రాక్టర్లకు అనుకూల సమయం. ముఖ్యమైన పనులు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ శ్రమ ఫలిస్తుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. దుబారా ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner