వారఫలాలు.. ఈ రాశి వారికి ఈ వారం స్థిరాస్తుల వృద్ధికి కలిసి వచ్చే కాలం-weekly horoscope in telugu june 30th to july 6th horoscope check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వారఫలాలు.. ఈ రాశి వారికి ఈ వారం స్థిరాస్తుల వృద్ధికి కలిసి వచ్చే కాలం

వారఫలాలు.. ఈ రాశి వారికి ఈ వారం స్థిరాస్తుల వృద్ధికి కలిసి వచ్చే కాలం

HT Telugu Desk HT Telugu
Jun 30, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జూన్30వ తేదీ నుంచి జులై 6వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

జూన్ 30 నుంచి జులై 6వరకు వార ఫలాలు
జూన్ 30 నుంచి జులై 6వరకు వార ఫలాలు

రాశిఫలాలు (వార ఫలాలు) 30.06. 2024 నుండి 06.07.2024 వరకు

సంవత్సరం : శ్రీ క్రోధి నామ, ఆయనం : ఉత్తరాయణం, మాసం: జ్యేష్టము, (జులై 6 నుంచి ఆషాఢ‌మాసం ప్రారంభం)

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం గ్రహసంచారాలు అనుకూలంగా ఉండుటచే ఈ వారమంతా సానుకూలంగా సాగుతుంది. ఎంతోకాలంగా పూర్తి కాని ముఖ్యమైన ప‌నులను ఈ వారం పూర్తి చేసే అవ‌కాశం క‌నిపిస్తుంది. ఇంటా బయటా మీకు సాయం చేసేవారున్నారు. వృత్తి, ఉద్యో గాల్లో మీ నిర్ణయాలకు స‌రైన గుర్తింపు ల‌భిస్తుంది. ఆర్థికంగా బ‌ల‌ప‌డ‌తారు. నూతన వ్యాపారాలలో అడుగు పెట్టగలరు. ఆది, సోమ, బుధ వారములు అనుకూలంగా ఉన్నాయి.

వృషభ రాశి

వృష‌భ రాశివారు ఈ వారం అనుకున్న ప‌నుల‌ను అనుకున్న స‌మ‌యానికి పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల‌తో ఉత్సాహంగా గ‌డుపుతారు. ఆదాయ మార్గాలు వృద్ధి చెందేందుకు కావాల్సిన‌ ప్ర‌య‌త్నాలు చేస్తారు. పిల్లల భ‌విష్య‌త్తు పట్ల ఏకాగ్రత చూపుతారు. అధికారులతో స‌త్సంబంధాలు ఏర్ప‌ర‌చుకోవ‌డానికి ఇది స‌రైన స‌మ‌యం. తోటి సహచరులు, బంధువుల నుంచి కాస్త ఇబ్బందులు త‌లెత్తె అవ‌కాశం ఉంది. ఈ రాశివారికి శని, ఆదివారాలు శుభ‌ఫ‌లితాలు క‌లుగును.

మిథున రాశి

వార ఫలాల ప్రకారం ఈ వారంలో విజ్ఞానపరంగా మంచి అవకాశాలు అందుకునేందుకు ఆస్కారం ఉంది. కొత్త అంశాలు నేర్చుకుంటారు. ఖర్చులు త‌గ్గించుకోవ‌డంతోపాటు అద‌న‌పు రుణ ప్ర‌య‌త్నాల‌కు కాస్త దూరంగా ఉండాలి. వృత్తి, వ్యాపారాలు ప‌ర్వాలేద‌నిపిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో బాధ్యతాయుతంగా ఉండాలి. ఉద్యోగ మార్పులు, నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సోమ, మంగళవారాలు క‌లిసి వ‌చ్చును. అందుకు అనుగుణ‌మైన జాగ్ర‌త్త‌లు పాటించాలి.

కర్కాటక రాశి

క‌ర్కాట‌క రాశివారు ఈవారం వృత్తి, ఉద్యోగ పర‌మైన ఒత్తిళ్ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. స్థిరాస్తుల వృద్ధికి క‌లిసి వ‌చ్చే కాలం. చేప‌ట్టిన ప‌నుల‌కు స‌రైన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకోవాలి. అన్ని విష‌యాల్లో మీకు కుటుంబ‌స‌భ్యుల స‌హ‌కారం మెండుగా ఉంటుంది. మీ వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను ఇత‌రుల‌తో చ‌ర్చించవ‌ద్దు. ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి. వృత్తి, ఉద్యోగాలందు బాధ్యత పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు ఉత్సాహపరుస్తాయి. శని, ఆది, సోమ వారాలు అనుకూలంగా ఉన్నాయి.

సింహ రాశి

ఈ వారం సింహ‌రాశి గ్ర‌హ‌స్థితి గ‌తంతో పోలిస్తే కాస్త మెరుగ్గానే ఉంది. స్వల్ప అనారోగ్య భావనలు, మానసిక ఒత్తిడి ఉన్నా ఉత్సా హంగా వ్యవహరించుకోగలరు. వృత్తి, ఉద్యోగాలందు సానుకూల ప‌రిస్థితులు ఉంటాయి. వ్యాపారాలు చెల్లింపులు పూర్తి చేసుకొనేందుకు అనువైన ఆదాయం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలు అనుకూలంగా సాగుతాయి. ఆహార విరామాదులందు జాగ్రత్తలు తప్పనిసరి. ఈ రాశివారికి ఆది, సోమ, బుధ వారములు అనువైనవి.

కన్యా రాశి

ఈ వారంలో పనికిరాని విషయాల గురించి ఆలోచించి కాలం వృధా చేసుకోక‌పోవ‌డం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో గౌర‌వ ప్ర‌తిష్ఠ‌లు పొందే అవ‌కాశం ఉంది. ప్రయాణాల్లో ఒకింత జాగ్రత్తలు తప్పనిసరి. వివాహ, ఉద్యోగ ప్రయత్నాల్లో తొందరపాటులొద్దు. ఇతరులతో వివాదములకు దూరంగా ఉండండి. విద్యార్థులకు నూతన అవకాశాలు ఏర్పడతాయి. గురు, శుక్ర, బుధ వారాలు అనుకూలిస్తాయి.

తులా రాశి

ఈ వారం తులా రాశి వారి గ్ర‌హ‌స్థితి మంద‌కొండిగా ఉంది. నిరుత్సాహం దరిచేరనీయకండి. మీ కృషికి తగిన ఫ‌లితాలు ద‌క్కుతాయి. కావలసినవారితో ఎక్కువ సమయం గడపండి. చిన్నపనైనా సొంతంగానే చేసుకోండి. వృత్తి, ఉద్యోగాల్లో మానసిక సంతృప్తిని పొందుతారు. ప్రయాణాలు ఎక్కువ‌గా చేయాల్సి ఉంటుంది. సంతానం నుండి సంతృప్తిక‌ర‌మైన వార్త‌లు వింటారు. విద్యార్థులు టార్గెట్ విధానాలు పాటిం చాలి. శని, ఆది, సోమ వారాలు అనువైనవి.

వృశ్చిక రాశి

గ్ర‌హ‌సంచారాలు సామాన్య ఫలితాలు ఇవ్వగలవు. పట్టుదలతో అనుకున్నవి సాధిస్తారు. అవసరాలకు స‌రైన స‌మ‌యంలో ఆదాయం అందుతుంది. న్యాయ‌ప‌ర‌మైన అంశాల్లో విజ‌యాలు అందుకుంటారు. అధికారుల విశ్వసనీయత పొందగలుగుతారు. అదనపు బాధ్యతలు స్వీక‌రిస్తారు. వివాహ, ఉద్యోగ యత్నాలు వేగవంతం అవుతాయి. గురు, శుక్ర, సోమ వారాలు అనుకూలంగా ఉన్నాయి.

ధనుస్సు రాశి

వార ఫలాల ప్రకారం ఈ వారం ధనుస్సు రాశి వారికి ఖర్చులందు నియంత్రణ అవ‌స‌రం. పట్టుదలతో ప్ర‌తికూల‌త‌లు నిరోధించుకోండి. కీలక అంశాలపై దృష్టి పెట్టండి. గత ఇబ్బందులు అధిగమించే ప్రయత్నం చేయండి. వృత్తి, వ్యాపారాలందు నూతన టార్గెట్స్, ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. సంతాన వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. శని, ఆది, బుధ వారాలు ఈ రాశివారికి శుభ‌ప్ర‌దంగా ఉన్నాయి.

మ‌కర రాశి

ఈ వారంలో మీదైన తరహాలో వ్యవహారాలు పూర్తిచేస్తారు. ఊహించిన విధంగా ఆదాయం ఉంటుంది. భూ-గృహ వాహన లావాదేవీలు పూర్తి చేస్తారు. పాత బాకీలు కొంత‌వ‌ర‌కూ ముట్ట‌చెబుతారు. ఆధ్యాత్మిక ప్ర‌యాణాలు చేస్తారు. వ్యాపారాల్లో నూతన భాగస్వామ్యం ఏర్పరచుకుంటారు. ఉద్యోగుల‌కు క‌లిసి వ‌చ్చే స‌మ‌యం. గురు, శుక్ర, సోమ వారాలు అనువైనవి.

కుంభ రాశి

ఊహించని విధంగా ఆలోచనలు కలిసి వస్తాయి. గత సమస్యలకు పరిష్కారాలు పొందుతారు. ఆర్థిక అవసరాల పట్ల అంచనా ఏర్ప‌డుతుంది. వ్యాపారాలు అనుకూలిస్తాయి. తోటి సహచరులతో సత్సంబంధాలు ఏర్ప‌డ‌తాయి. చ‌ట్ట‌ప‌ర‌మైన స‌మ‌స్య‌ల నుంచి కాస్త ఊర‌ట ల‌భిస్తుంది. శ్ర‌మ‌తో అనుకున్న‌వి సాధిస్తారు. గురు, శుక్ర, శని, బుధ వారాలు అనుకూలంగా ఉన్నాయి.

మీన రాశి

ఈ వారంలో అన్ని పనుల్లో కొంత ఊరట పొందగలుగుతారు. అవ‌స‌ర‌మైన ప‌నుల‌పై దృష్టి పెడ‌తారు. అనారోగ్య స‌మ‌స్య‌లు కాస్త ఇబ్బంది పెడ‌తాయి. ఆత్మీయులు, బంధువులతో ఆత్మీయంగా మెలుగుతారు. సంతానంలో ఒకరికి ఉపాధి ఏర్పడుతుంది. వాగ్విషయాల్లో, హావభావ ప్రకటనలందు జాగ్రత్తలు తప్పనిసరి చేయండి. శని, ఆది, సోమ వారాలు అనువైనవి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
Whats_app_banner