వారఫలాలు.. ఈ వారం బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు, గౌరవ పురస్కారాలు అందుతాయి-weekly horoscope in telugu june 2 nd to june 8th check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వారఫలాలు.. ఈ వారం బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు, గౌరవ పురస్కారాలు అందుతాయి

వారఫలాలు.. ఈ వారం బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు, గౌరవ పురస్కారాలు అందుతాయి

HT Telugu Desk HT Telugu
Jun 02, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జూన్2వ తేదీ నుంచి జూన్8వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వారఫలాలు జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు
వారఫలాలు జూన్ 2 నుంచి 8వ తేదీ వరకు (pinterest)

రాశిఫలాలు (వార ఫలాలు) 02.06. 2024 నుండి 08.06. 2024 వరకు

సంవత్సరం : శ్రీ కోధి నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : వైశాఖము

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో పనిచేస్తే అనుకున్నది సాధిస్తారు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగంలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మీ మీ రంగాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. వ్యాపారంలో అనుభవంతో నిర్ణయాలు తీసుకోవాలి. అభిప్రాయభేదాలు రాకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో కలసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. సౌమ్యంగా సంభాషిస్తే ఇబ్బందులుండవు. అనారోగ్య సమస్యలను అశ్రద్ధ చేయవద్దు. మొహమాటం వల్ల ధనవ్యయం జరుగుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. మేష రాశి మరింత శుభఫలితాలు ఈవారం పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వారఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు. ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. ఏకాగ్రతతో పనిచేస్తే ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో ఆనందముగా గడిపెదరు. దూర ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం సహకరిస్తుంది. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అవసరానికి తగిన సహాయం చేసేవారున్నారు. బంధుప్రీతి కలదు. స్థిరాస్తికి సంబంధించిన వ్యవహారాలలో సత్ఫలితాలను సాధిస్తారు. కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుణ్ణి పూజించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. కీలక వ్యవహారాల్లో సమాచార లోపం లేకుండా చూసుకోవాలి. ఉద్యోగంలో మేలు చేకూరుతుంది. వ్యాపారంలో అనుకూల ఫలితాలున్నాయి. వాగ్వివాదాలకు దూరంగా ఉండాలి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఆలోచనలు చేయండి. ఫలితాలు సొంతం అవుతాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేస్తారు. కొన్ని చర్చలు మీకు లాభిస్తాయి. మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఇస్తాయి. ఇబ్బందులు తొలగుతాయి. అధికారుల వద్ద వినయవిధేయలతో వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ధనాన్ని పొదుపు చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఉద్యోగంలో పై అధికారుల సహకారం ఉంటుంది. సమాజంలో గౌరవ పురస్కారాలు అందుకుంటారు. కొన్ని సందర్భాల్లో నిపుణుల సలహాలు అవసరం అవుతాయి. అపార్థాలకు తావు లేకుండా చూసుకోవాలి. ఆరోగ్యం అనుకూలించును. ఒక వ్యవహారంలో నిజాయితీతో వ్యవహరించి ప్రశంసలు పొందుతారు. నిబద్ధతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. కొన్ని కీలకమైన వ్యవహారాల్లో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఆత్మవిశ్వాసంతో చేసే పనులు సత్ఫలితాలిస్తాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. స్వల్ప అనారోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగంలో అనుకూల ఫలితాలున్నాయి. ముఖ్యమైన పనుల్లో ఆచితూచి ముందుకు సాగాలి. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు చాలా వరకు మేలు చేస్తాయి. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోరాదు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా సమర్ధవంతంగా ఎదుర్కొంటారు. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్యనారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రారంభించబోయే పనుల్లో గొప్ప ఫలితాలు సాధిస్తారు. సంతోషంగా గడిపెదరు. శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో ఆనందముగా గడుపుతారు. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. మీకు కొత్త బాధ్యతలు వస్తాయి. ప్రారంభించబోయే పనులో ఒత్తిడి పెరగకుండా ముందస్తు ప్రణాళికతో ముందుకు సాగాలి. ముందుచూపుతో వ్యవహరిస్తే మంచి ఫలితాలను అందుకుంటారు. ఎప్పటి పనులు అప్పుడే పూర్తి చేయాలి. వ్యాపారంలో జాగ్రత్తలు అవసరం. నలుగురిలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. విష్ణు సహస్రనామం పారాయణ మరియు ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ప్రతిభకు ప్రశంసలుంటాయి. ఒక వ్యవహారంలో డబ్బు అందుతుంది. కీలకమైన సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. గతంలో కాని పనులు ఇప్పుడు పూర్తవుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడిపెదరు. వ్యాపారస్తులకు అనుకున్న లాభాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభాలుంటాయి. సోదరుల నుంచి కూడా సహాయం అందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. కొద్దిపాటి ఆరోగ్య సమస్యలుంటాయి. ఉద్యోగస్తులకు కోరుకున్న ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఉంటాయి. తులా రాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలున్నాయి. బంధుమిత్రులతో కలసి శుభకార్యాల్లో పాల్గొంటారు. మీరు చేసే పనులు వెంటనే పూర్తవుతాయి. బంధువుల సహకారం ఉంటుంది. ప్రతి పనిని కుటుంబముతో చర్చించిన తరువాతే మొదలు పెట్టాలి. అనవసర ఖర్చులను నియంత్రించాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంతో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఉత్సాహంగా పనిచేస్తారు. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. అందరి మన్ననలు పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలసి ఆనందముగా గడిపెదరు. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కొన్ని సంఘటనలు ఉత్సాహపరుస్తాయి. లాభదాయకమైన కాలం. వ్యాపారంలో ఒత్తిడి లేకుండా నిర్ణయాలు తీసుకోండి. కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. మంచి ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. అనుకున్న పనులు వెంటనే పూర్తవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

వారఫలాల ప్రకారం మకర రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలున్నాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా శుభఫలితాలున్నాయి. ఒక పనిలో మీ ప్రతిభకు గుర్తింపు వస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మంచి జరుగుతుంది. ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం అనుకూలించును. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ అదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. కొన్ని ముఖ్యమైన వ్యవహరాల్లో ఆత్మీయుల సూచనలు పనిచేస్తాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. పట్టుదలతో ముందుకు సాగి అనుకున్నది సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీ మనసుకు ఇబ్బంది కలిగిస్తుంది. అనుకోని కలహసూచన ఉన్నది. ఒక వ్యవహారంలో పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. ఒక శుభవార్త మీకు మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో మాట పట్టింపులు వచ్చే సూచనలున్నాయి. అనవసరంగా కష్టాలను కొన్ని తెచ్చుకుంటారు. కొన్ని వార్తలు మీకు బాధను కలిగిస్తాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ దైవరాధన మానకండి. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రొక్త శని స్తోత్రాన్ని పఠించాలి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. వ్యాపారంలో లాభాలున్నాయి. పక్కా ప్రణాళికతో సత్ఫలితాలు వస్తాయి. పెద్దల ఆశీర్వచనాలు లభిస్తాయి. శత్రువులపై మీదే పై చేయి అవుతుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ఓర్పుగా వ్యవహరించాలి. మొహమాటాన్ని దరిచేరనీయకండి. ముఖ్య విషయాల్లో నిక్కచ్చిగా ఉండటమే మంచిది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. తోటివారి సహకారంతో అనుకున్న ఫలితాలు సిద్ధిస్తాయి. అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel