వారఫలాలు.. ఈ వారం ఆరు రాశుల వారికి అనుకూలంగా లేదు, అన్ని రంగాలలో ఎదురుదెబ్బలే-weekly horoscope in telugu june 16th to june 22nd check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వారఫలాలు.. ఈ వారం ఆరు రాశుల వారికి అనుకూలంగా లేదు, అన్ని రంగాలలో ఎదురుదెబ్బలే

వారఫలాలు.. ఈ వారం ఆరు రాశుల వారికి అనుకూలంగా లేదు, అన్ని రంగాలలో ఎదురుదెబ్బలే

HT Telugu Desk HT Telugu
Jun 16, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జూన్16వ తేదీ నుంచి జూన్ 22 తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

జూన్ 16 నుంచి 22వ తేదీ వరకు వారఫలాలు
జూన్ 16 నుంచి 22వ తేదీ వరకు వారఫలాలు (freepik)

రాశిఫలాలు (వార ఫలాలు) 16.06. 2024 నుండి 22.06.2024 వరకు

సంవత్సరం : శ్రీ క్రోధి నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : జ్యేష్టము

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. అన్ని రంగాల వారికి అనుకూలంగా ఉంటుంది. చాలాకాలంగా పూర్తి కాని పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఇతరులకు మీ ఆలోచనలు ఎంతగానో ఉపయోగపడతాయి. దీర్ఘకాలిక రుణ బాధల నుండి బయటపడతారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలసివస్తాయి. ప్రభుత్వ అధికారులతో పరిచయాలేర్పడతాయి. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. బంధువులతో మాట పట్టింపులుంటాయి. మేష రాశి మరింత శుభఫలితాలు ఈవారం పొందడానికి దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రణాళికాబద్ధంగా ముఖ్యమైన వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని విషయాలలో ఓర్పు వహించడం మంచిది. ఆత్మీయులతో విభేదాలు పరిష్కారమవుతాయి. పాత సంఘటనలను గుర్తుకు తెచ్చుకుని బాధపడతారు. కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రులతో వివాహాది వేడుకలలో పాల్గొంటారు. వ్యాపారాల విస్తరణలో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. కనకధారా స్తోత్రం పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో ఆటంకాలు తొలగుతాయి. గృహమున సొంత ఆలోచనలు అమలు చేయడంతో ముందడుగు వేస్తారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. వ్యాపారాలలో కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. నూతన వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. ఒక సంఘటన మిమ్మల్ని మరింత అశ్చర్యానికి గురి చేస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ధనవ్యయ సూచనలున్నాయి. ఆరోగ్య విషయాలలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. నవగ్రహ పీడాహర స్తోత్రం పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. సోదరులతో అకారణంగా స్థిరాస్తి వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలలో భాగస్వాములతో ఒప్పందాలు రద్దు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించడం మంచిది. గృహ నిర్మాణ ప్రయత్నాలలో ఆటంకాలు కలుగుతాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. అన్ని రంగాల వారికి ఒత్తిడులుంటాయి. దూరపు బంధువుల నుండి శుభవార్తలు అందుతాయి. దూర ప్రయాణాలు కలసివస్తాయి. దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

వార ఫలాల ప్రకారం సింహ రాశి వారికి ఈవారం మీకు అనుకూలంగా లేదు. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు తప్పవు. కుటుంబ సభ్యులతో ఆలయాలను సందర్శిస్తారు. స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. భూ సంబంధిత క్రయ విక్రయాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. నిరుద్యోగులకు శ్రమ తప్ప ఫలితం కనిపించదు. వ్యాపారాలకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యమైన వ్యవహారాలలో ఒప్పందాలు వాయిదాపడతాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి చికాకులు తప్పవు. దూరప్రయాణ సూచనలున్నాయి. వ్యాపారస్తులు నూతన లాభాలను అందుకుంటారు. ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్యనారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యా రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. నూతన కార్యక్రమాలు చేపట్టి అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. వ్యాపారులకు నూతన పెట్టుబడులు అందుతాయి. నూతన గృహ నిర్మాణానికి సకాలంలో ధనం అందుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత మిత్రుల నుంచి అందిన సమాచానం ఆనందాన్నిస్తుంది. సంఘంలో పేరు కలిగిన వ్యక్తుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాల్లో సొంత ఆలోచనలు చేయడం మంచిది. నూతన భూ, వాహనాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు అనుకూలం. అన్ని రంగాల వారికి కలసి వచ్చేటటువంటి వారం. విష్ణు సహస్రనామం పారాయణం, ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. వ్యాపారాలు మరింత లాభసాటిగా సాగుతాయి. స్థిరాస్తి విషయంలో సమస్యలు అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. మీ తెలివితేటలతో దీర్ఘకాలిక వివాదాల నుంచి బయటపడతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో కొంతవరకు పని ఒత్తిడి నుండి ఉపశమనం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమలకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. శ్రమతో కాని పనులు పూర్తి కాదు. తులారాశివారు మరింత శుభఫలితాలు పొందడం కోసం కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తికాక చికాకు కలుగుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ విషయంలో ఆలోచనలు స్థిరంగా ఉండవు. విద్యార్థులకు శ్రమకు తగిన ఫలితం కనిపించదు. సోదరులతో స్థిరాస్తి ఒప్పందాలు వాయిదాపడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ వహించాలి. వృత్తి ఉద్యోగాలలో పరిస్థితులు అంతగా అనుకూలించవు. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు. శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తికావు. దూరపు బంధువుల నుండి ఆశ్చర్యకమైన విషయాలు తెలుస్తాయి. కుటుంబ వ్యవహారాలు కొంత మానసికంగా చికాకు కలిగిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. మిత్రుల నుంచి రుణ ఒత్తిడులు పెరుగుతాయి. అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండదు. నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. కొన్ని వ్యవహారాలలో అంచనాలు అందుకోవడంతో విఫలమవుతారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అధికమవుతాయి. అన్ని రంగాల వారికి కొత్త సమస్యలు తప్పవు. నూతన వాహన యోగముంది. శుభవార్తలు అందుకుంటారు. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గా దేవిని పూజించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. ముఖ్యమైన పనులలో శ్రమకు తగిన ఫలితం కనిపించదు. బంధువులతో వివాదాలు కొంతవరకు పరిష్కారమవుతాయి. స్థిరాస్తి విషయాలలో ఒప్పందాలు వాయిదాపడతాయి. అనుకున్న పనులలో ఆలస్యం అయినా నిదానంగా పూర్తి చేస్తారు. ఆరోగ్యపరంగా చికాకులు తప్పవు. నిరుద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు రావు. ఇంటా బయటా పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదాపడతాయి. ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నాయి. ఆప్తుల నుండి శుభవార్తలు అందుతాయి. వాహనయోగమున్నది. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్నిపఠించండి.

కుంభ రాశి

వార ఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. నూతన కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఆత్మీయులతో ఆనందముగా గడుపుతారు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు పెద్దల సలహాలు తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పాత రుణాలు తీర్చగలుగుతారు. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు అధిగమించి ముందుకు సాగుతారు. వృత్తి ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నాయి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. కొన్ని వ్యవహారాలలో అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగాలలో అలోచనలు నిలకడగా ఉండవు. సన్నిహితులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. పెద్దల ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. నిరుద్యోగులకు ఒత్తిడులు పెరుగుతాయి. దైవదర్శనం చేసుకుంటారు. వ్యాపారాలలో సామాన్య లాభాలు అందుతాయి. శుభవార్తలు అందుకుంటారు. నూతన వాహన యోగముంది. సోదరుల నుంచి ధన సహాయం అందుతుంది. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
WhatsApp channel