ఈవారం రాశి ఫలాలు.. మూడు రాశుల వారికి గ్రహబలం పుష్కలం, ఆదాయ వృద్ధి
Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జులై7వ తేదీ నుంచి జులై 13 వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
రాశిఫలాలు (వార ఫలాలు) 07.07. 2024 నుండి 13.07.2024 వరకు
సంవత్సరం : శ్రీ క్రోధి నామ, ఆయనం : ఉత్తరాయణం, మాసం: ఆషాడము
మేష రాశి
గతంతో పోలిస్తే మేషరాశికి ఈ వారం సత్ఫలితాలు కనిపిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో ప్రోత్సాహకరంగా ఉంటుంది. వ్యాపారంలో ఆర్థిక లాభాలు పొందుతారు. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. కుటుంబసభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలు చేపడతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కీలక పనుల్లో ముందుచూపుతో వ్యవహరించండి. భూ వ్యవహారాలకు సంబంధించిన ప్రణాళికలు అమలు చేస్తారు. ఇష్టదేవతారాధనతో మంచి ఫలితాలు ఉన్నాయి.
వృషభ రాశి
గొప్ప ఫలితాలు సాధిస్తారు. చేపట్టిన పనులను సమయానుగుణంగా పూర్తి చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాల్లో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల వల్ల మేలు జరుగుతుంది. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. ఆదాయం బాగుంటుంది. సంతానపరమైన శుభవార్తలు వింటారు. నూతన వ్యక్తుల పరిచయాలు మేలు చేస్తాయి. స్పష్టమైన ఆలోచనలతో ముందడుగు వేస్తారు. గణపతి ఆరాధన శుభప్రదం.
మిథున రాశి
వారఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఈ వారం కూడా గ్రహానుకూలత కొనసాగుతోంది. విజయావకాశాలు మెండుగా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వ్యాపారంలో మాత్రం మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. మనోధైర్యంలో ముందుకు అడుగేయండి. సమాజంలో పేరు సంపాదిస్తారు. ఆర్థికపరంగా కలిసి వస్తుంది. వృత్తిఉద్యోగాల్లో మంచి వృద్ధి. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఇతరులను గుడ్డిగా నమ్మకండి. ఆంజనేయ ఆరాధన ఉత్తమం.
కర్కాటక రాశి
గ్రహబలం ఉన్నప్పటికీ.. ముఖ్య వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలి. డాక్యుమెంట్లపై సంతకాలు చేసేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి. ఆర్థిక స్థితి బాగుంటుంది. వృత్తి ఉద్యోగాల్లో అనుకూల కాలం. వ్యాపారంలో అభివృద్ధి సాధిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. అనుభవజ్ఞుల సలహాలు మేలు చేస్తాయి. స్థిరాస్తికి సంబంధించిన నిర్ణయాలు అనుకూలిస్తాయి. ఇబ్బంది పెట్టేవారికి దూరంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో ముక్కుసూటిగా వ్యవహరించడం మేలు. శివారాధనతో మరిన్ని శుభఫలితాలు సిద్ధిస్తాయి.
సింహ రాశి
శుభకాలం నడుస్తోంది. విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ధనధాన్య లాభాలు కలుగుతాయి. విందువినోదాల్లో పాల్గొంటారు. బాధ్యతలు పెరుగుతాయి. నూతన వస్తుయోగం ఉంది. శత్రువులపై విజయం సాధిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయి. శుభవార్తలు వింటారు. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్త వహించండి. సుబ్రహ్మణ్యస్వామి దర్శనం మేలు చేస్తుంది.
కన్యా రాశి
స్థిరమైన ఆలోచనలు మంచి ఫలితాన్నిస్తాయి. అవసరమైనప్పుడు నిపుణుల సలహా తీసుకోండి. చేపట్టిన పనులు వెంటనే పూర్తవుతాయి. మీ మీ రంగాల్లో విజయాలు అందుకుంటారు. విశేషమైన ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. ఆస్తిని వృద్ధి చేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో ధైర్యంగా ఉంటారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. విద్యార్థులు పట్టుదలతో శ్రమించాలి. ఇష్టదేవతా దర్శనం సకల శుభాలనూ ప్రసాదిస్తుంది.
తుల రాశి
అవసరానికి తోటివారి సాయం లభిస్తుంది. ధనలాభం సూచితం. వచ్చిన అవకాశం అందిపుచ్చుకునేందుకు ప్రయత్నించండి. అపరిచితులతో జాగ్రత్త. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. గృహ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి కాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో సంతృప్తికర ఫలితాలు అందుకుంటారు. అనుకున్న పనులు పూర్తి చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలు వేసుకుంటారు. ఈశ్వరారాధన శుభప్రదమైనది.
వృశ్చిక రాశి
ఆటంకాలు తగ్గుతాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలతలు ఉంటాయి. మీ పనితీరుకు తగిన ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యుల సహకారం లభిస్తుంది. ఆదాయం పర్వాలేదనిపిస్తుంది. పెట్టుబడులు, నూతన ప్రయోగాలకు దూరంగా ఉండండి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు లభిస్తాయి. అనవసరమైన అప్పులు చేయకుండా ముందు జాగ్రత్త తీసుకోండి. నవగ్రహ ప్రదక్షిణలతో మేలు కలుగుతుంది.
ధనుస్సు రాశి
ఆనందమైన కాలం నడుస్తోంది. చక్కటి శుభ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. భవిష్యత్ ప్రణాళికలు రచిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. ఇబ్బందులు ఎదురైనా అధిగమిస్తారు. మీకు ఏమాత్రం ఉపకరించని వ్యక్తులను నిర్మొహమాటంగా దూరం పెట్టండి. ఉద్యోగపరంగా అధికారులతో సంయమనం పాటించండి. వ్యాపార లక్ష్యాలను నెరవేర్చుకుంటారు. ఆరోగ్యం సహకరిస్తుంది. ఇష్టదేవతారాధన మేలు చేస్తుంది.
మకర రాశి
గ్రహబలం ఉంది. చేపట్టిన పనుల్లో ఆశించిన దానికంటే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. అనుకోని ధనలాభం కలుగుతుంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు. సంతానపరంగా శుభపరిణామాలు ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కీలక విషయాల్లో పెద్దలను కలుస్తారు. కుటంబ పరిస్థితులు బాగుంటాయి. బంధుమిత్రులు సహకరిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. ఇష్టదేవతారాధన శుభ ఫలితాలను కలిగిస్తుంది.
కుంభ రాశి
వారఫలాల ప్రకారం కుంభ రాశి వాళ్ళు ఈ వారం ముఖ్య విషయాల్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడు అనుభవజ్ఞుల సలహాలు తప్పనిసరి. ముందస్తు ప్రణాళికలతో చేపట్టిన పనుల్లో శ్రమను తగ్గించుకుంటారు. ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సామాన్య ఫలితాలు. కుటుంబపరంగా చిన్నపాటి అభిప్రాయభేదాలు. అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకండి. బంధుమిత్రుల రాకపోకలతో ధనవ్యయం. మీ సహనమే మీకు శ్రీరామరక్ష. ఇష్టదేవతా స్తుతితో మరిన్ని శుభాలు పొందుతారు.
మీన రాశి
అభీష్టాలు ఫలిస్తాయి. చేపట్టిన పనులు సమర్థవంతంగా పూర్తిచేస్తారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. అందరితో సఖ్యంగా ఉండండి. మేలు జరుగుతుంది. ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకోవద్దు. శుభకార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల వాతావరణం. నిరుద్యోగులకు ఆశావహ పరిస్థితులు. ఆర్థికంగా మంచి ఫలితాలు. నూతన పరిచయాలు లాభిస్తాయి. దక్షిణామూర్తిని ధ్యానించండి.