వారఫలాలు.. ఈ వారం వీళ్ళు ఆచితూచి అడుగులు వేయాలి, వీరికి మాత్రం ఉత్తమకాలం నడుస్తోంది-weekly horoscope in telugu july 28th august 4th horoscope check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  వారఫలాలు.. ఈ వారం వీళ్ళు ఆచితూచి అడుగులు వేయాలి, వీరికి మాత్రం ఉత్తమకాలం నడుస్తోంది

వారఫలాలు.. ఈ వారం వీళ్ళు ఆచితూచి అడుగులు వేయాలి, వీరికి మాత్రం ఉత్తమకాలం నడుస్తోంది

HT Telugu Desk HT Telugu

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జులై 28వ తేదీ నుంచి ఆగస్ట్ 4వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వారఫలాలు జులై 28 నుంచి ఆగస్ట్ 4 వరకు (freepik )

వార ఫ‌లాలు 28-07-2024 నుంచి 04-08-2024

మాసం : ఆషాఢ‌ము, సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: ద‌క్షిణాయ‌నం

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం స‌త్ఫ‌లితాలున్నాయి. ముఖ్య కార్య‌క్ర‌మాల్లో మీ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. పని ఒత్తిడి, మానసికమైన ఒత్తిళ్లు ఉన్నా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. త‌ద్వారా పరిష్కారం లభి స్తుంది. ఇతరులకు మీరు అందించే సహకారం వలన లాభదాయకమైన ప్రతిఫలాన్ని పొందగలుగుతారు. విశేషమైన కార్యాలలో భాగస్వామ్యానికి అవకాశం ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో అనుకూలత లభిస్తుంది. “అమందానంద కందళిత హృదయారవింద గోవింద” అనే మంత్రాన్ని ప‌ఠించ‌డం విశేష ఫ‌లితాలు అందిస్తుంది.

వృషభ రాశి

వార ఫలాల ప్రకారం ఈ వారం వృషభ రాశి వారికి స‌మాజంలో గౌర‌వం పెరిగే అవ‌కాశాలున్నాయి. విశేషమైన ఆతిధ్యం లభించే అవకాశాలున్నాయి. వ్యవహారాలు అనుకూల ఫలితాలనిస్తాయి. వ్యాపారాభివృద్ధికి సూచనలున్నాయి. దీర్ఘకాలికమైన ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పెట్టుబడులకు దూరంగా ఉండ‌టం మంచిది. మీ బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించగలగడం కోసం ప్రయత్నించండి. ఇతరులపై భారం వేయడం వలన పనులలో ఆలస్యం జరిగే సూచనలున్నాయి. మీ పర్యవేక్షణ అవసరం. 'శ్రీరామ జయరామ జయజయరామ రామ” అనే మంత్రం చ‌దువుకోండి. అంతా మంచే జ‌రుగుతుంది.

మిథున రాశి

అభిప్రాయాలలో వైవిధ్యం అపార్థాలకు దారితీసే అవ‌కాశాలున్నాయి. భావవ్యక్తీకరణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. మాట‌లు కాస్త పొదుపుగా వాడండి. మీ కార్యనిర్వహణా దక్షత మరిన్ని బాధ్యతలను తీసుకురావచ్చు. ఇతరుల నుండి ఆశించిన సహకారం తగిన స్థాయిలో లభించకపోవచ్చు. శ్రమ అధికంగా ఉంటుంది. "లక్ష్మీ వాణీ నిషేవితాయై నమః" అనే మంత్రం చేసుకోవడం మంచిది. విషయాసక్తి వలన విద్యార్థులకు కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంటుంది. గురువులతో చ‌ర్చించి కీల‌క నిర్ణ‌యాలు తీసుకోండి. కుటుంబ‌స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

కర్కాటక రాశి

విందు, వినోదాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల‌తో మంచిచెడ్డ‌లు పంచుకుంటారు. దీంతో సంతోషంగా కాలం గ‌డుపుతారు. నూతన విషయాలపై విద్యార్థులు ఆసక్తి చూపిస్తారు. విశేషమైన కార్యక్ర మాలలో పాల్గొనటానికి అవకాశాలున్నాయి. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించడం వలన పనులలో విజయం సాధించడం సులభం అవుతుంది. వ్యాపారస్తులు కొంత స్వప్రయోజనాలను విడిచిపెట్టడం మేలు. “శ్రీ దత్త శరణం మమ” అనే మంత్రం చేసుకోవడం మంచిది. శుభ‌ఫ‌లితాలు పొందుతారు. అన్నింటా విజ‌యం సాధిస్తారు.

సింహ రాశి

ఆచితూచి అడుగులు వేయాలి. స్వలాభాపేక్షకు పరిమితులను పాటించడం మంచిది. రోగనిరోధకశక్తిని పెంపొందించుకునే ప్రయత్నం చేయడం మంచిది. ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్తలు పాటించండి. ఘర్షణలకు దూరంగా ఉంటూ సామరస్యంగా వ్యవహరించడం వలన సమస్యలు తీరే అవ‌కాశం ఉంది. ఇత‌రుల‌తో స‌త్సంబంధాలు పెరుగుతాయి. కొన్ని సంద‌ర్భాల్లో ఇత‌రుల ప‌ట్ల కోపంగా వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌త్య‌ర్థుల‌కు అది న‌చ్చ‌క‌పోవ‌చ్చు. దీంతో స‌మ‌స్య‌లు పెరుగుతాయి. “దుర్గాయై నమః” అనే మంత్రం చేసుకోవడం మంచిది. స‌త్ఫ‌లితాలు పొందుతారు.

కన్యా రాశి

కీల‌క విష‌యాల్లో మీరు చేసే ఆలోచనలు పలువురికి న‌చ్చ‌క‌పోవ‌చ్చు. ఇతరులకు సహకరించే మీ దృక్పథం ప్రశంసించబడే అవకాశా లున్నాయి. స‌మాజంలో పేరు ప్ర‌తిష్ట‌లు ల‌భిస్తాయి. అధికారవర్గంలోని వారి నుండి వచ్చే ఆదేశాలు మీకు శ్రమను అధికం చేయవచ్చు. ఇతరుల‌కు ఉచిత‌ సలహాలు ఇవ్వడం వలన కొంత‌మంది వ్యక్తులు దూరమవుతారు. కుటుంబ స‌భ్యుల స‌ల‌హాలు మీకు క‌లిసి వ‌స్తాయి. ఉత్త‌మ ఫ‌లితాలు పొందుతారు. “సదాశివకుటుంబిన్యై నమః" అనే మంత్రం చదువుకోండి.

తులా రాశి

ఈ వారం తులా రాశి వారికి అనువైన ఫ‌లితాలున్నాయి. ఆధ్యాత్మిక ధార్మిక కార్యక్రమాలకై ధనాన్ని వినియో గించే సూచనలున్నాయి. గురువుల సందేశాల‌తో మార్గ నిర్దేశాన్ని ఏర్ప‌ర‌చుకుంటారు. సంతానాభివృద్ధికి సంబంధించి శుభ‌వార్త‌లు వింటారు. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది. క్రీం అచ్యుతానంద గోవింద అనే మంత్రం చేసుకోండి. ముఖ్య‌మైన ప‌నులు త్వ‌రిత‌గ‌తిన పూర్త‌వుతాయి. ప్రతిరోజు పెరుగు దానం చేయ‌డం మంచిది. మీ ఆలోచనలు కొత్త మార్గాలను అన్వేషించడానికి, తగిన రీతిలో అభివృద్ధి చెందడానికి ఉపకరిస్తాయి. కుటుంబ‌స‌భ్యుల‌తో సంతోషంగా గ‌డుపుతారు.

వృశ్చిక రాశి

స‌మ‌యానుకూలంగా ప‌నులు పూర్తి చేస్తారు. పనులు సానుకూలం అవుతున్నప్పటికీ ప్రయోజనాలు సిద్దించడం ఆలస్యం కావచ్చు. ఇతరులకు సహకరించడం కోసం చేసే పనుల్లో విజయాలు సంతృప్తినిస్తాయి. కుటుంబ వ్యవహారాలలో వివాదాల‌కు తావు లేకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఆహార విషయంలో దోషాలు రాకుండా జాగ్రత్తపడాలి. భోజ‌న వేళ‌ల్లో జాగ్ర‌త్త‌లు పాటించ‌డం ముఖ్యం. శాకాహారానికి ప్రాధాన్య‌త ఇవ్వండి. “క్రీం అచ్యుతా నంద గోవింద" అనే మంత్రం చేసుకోవడం మంచిది. చేసే ప‌నిపై దృష్టి పెట్ట‌డం ముఖ్యం. చింతించ‌కండి స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

ధనుస్సు రాశి

పట్టుదలతో చేసే పనులు విజయాన్ని ఇస్తాయి. పంతాన్ని విడ‌నాడండి. పరిమితులను అనుసరించి ప్రవర్తించడం మంచిది. కోపోద్రేకాలకు లోనుకాకుండా ఉండ‌టం చాలా అవ‌స‌రం. ఆధ్యాత్మిక సాధన ద్వారా ఆటంకాలను సులభంగా అధిగమించగలుగుతారు. స‌మాజంలో ఉన్నతస్థాయి వ్యక్తుల, అధికారుల నుండి అనుకూలత పొందగలుగుతారు. వివాహ ప్రయత్నాలలో విజయావకాశాలు బాగు న్నాయి. “కళ్యాణరామ” అనే మంత్రం చ‌దువుకోవ‌డం ఉత్త‌మం. వైవాహిక బంధంలో ఉన్న ఇబ్బందులు తొల‌గిపోతాయి.

మకర రాశి

డ‌బ్బు విష‌యంలో జాగ్ర‌త్త ఉండాలి. అనవసర ఖర్చులను నియంత్రించుకోవడం అవసరం. సమాజంలో గుర్తించదగిన వ్యక్తిగా మార‌డానికి ఇది అనువైన కాలం. వ‌చ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. స్వలాభాపేక్ష నష్టానికి దారి తీస్తుంది. వ్యాపారస్తులకు రావలసిన డబ్బు ఆలస్యం కావడం, చేతికందినడబ్బు సద్వినియో గం కాకపోవడం వంటి వాటికి సూచనలున్నాయి. “సుమంతో సుమంతో శ్రీకార్తవీర్యార్జునాయ నమః" అనే మంత్రం చేసుకోవడం మంచిది.

కుంభ రాశి

వారఫలాల ప్రకారం కుంభ రాశి వారికి ఈ వారం కీల‌క‌ వ్యవహారాలలో అధికారుల అలసత్వం ఉంటుంది. దానివ‌ల్ల మీ పనులు కాస్త ఆల‌స్యం అవుతాయి. స‌రైన స‌మయానికి ప‌నులు పూర్తి కావు. ప్రభుత్వ సంబంధమైన విషయాలలో పనులు వాయిదా పడే సూచనలున్నాయి. సంస్థలలో అధికారులకి ఉద్యోగులకు మధ్య ప్రతికూలతలు ఏర్పడే సూచనలున్నాయి. “శ్రీ రాజమాంతంగ్యై నమః" అనే మంత్రం జ‌పించ‌డం మంచిది. చిన్నచిన్న అపార్థాలు పెద్ద సమస్యలు కాకముందే నివారించుకునే ప్రయత్నం చేయండి. కీల‌క విష‌యాల్లో పెద్ద వారి స‌ల‌హాలు తీసుకోవ‌డం ఉత్త‌మం .

మీన రాశి

ఉత్త‌మ కాలం న‌డుస్తోంది. చ‌దువు ప‌ట్ల మీకున్న ఆసక్తికి తగిన గుర్తింపు ప్రోత్సాహం లభిస్తుంది. కార్యసాధనకు కావలసిన ధనాన్ని పొందడానికి అవకాశాలున్నాయి. “జనని కనకవృష్టి దక్షి ణాంతేర్పయామి" అనే మంత్రాన్ని జ‌పించ‌డం ద్వారా సంపద అనుభవ యోగ్యమౌతుంది. ఇతరులకు సహకరించే లక్షణం ప్రశంసలను అందుకుంటుంది. ప్రభుత్వాధికారులు లేదా అనుబంధ వ్యక్తులతో పరిచయాలు ఏర్పడే సూచనలున్నాయి. ఆడంబరాల‌కు దూరంగా ఉండండి. ఖ‌ర్చులు నియంత్ర‌ణ‌లో ఉంచుకోండి.

పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ