ఈ వారం రాశి ఫలాలు.. వీరిని స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి-weekly horoscope in telugu july 14th to july 20th horoscope check zodiac signs result ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  ఈ వారం రాశి ఫలాలు.. వీరిని స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి

ఈ వారం రాశి ఫలాలు.. వీరిని స్వల్ప అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి

HT Telugu Desk HT Telugu

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. జూన్14వ తేదీ నుంచి జూన్20వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

జులై 14 నుంచి 20వ తేదీ వరకు ఈవారం రాశి ఫలాలు

రాశి ఫలాలు (వార‌ ఫలాలు) 14-07-2024 నుంచి 20-07-2024

మాస‌ము: ఆషాడ‌ము, ఆయ‌నం: ఉత్త‌రాయ‌నం

మేష రాశి

ఈ వారం మేషరాశి వారికి ఒకింత అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాలు క‌లిసి వ‌స్తాయి. ముడిపడని వ్యవహారాలలో స్పష్టత ఏర్పడుతుంది. దూర ప్రాంత ప్రయాణాలు, తత్సంబంధిత వ్యవహారాలు సానుకూలంగా ఉంటాయి. ముఖ్యమైన నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. శుభకార్యాలను పూర్తి చేయగలుగుతారు. సంతాన యోగక్షేమాలపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరిస్తారు.

వృషభ రాశి

సభలు, సమావేశాలకు ఆహ్వానాలు అందుకుంటారు. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ప్రభుత్వ, చట్ట పరమైన ఇబ్బందుల నుండి బయట పడతారు. శుభ కార్యాలు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. గృహం కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది.

మిథున రాశి

ఈ వారం వారఫలాల ప్రకారం మిథున రాశి వారికి స్వల్ప ధన లాభ సూచనలున్నాయి. వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వ, ప్రైవేటు సంబంధమైన పెండింగ్ బిల్లులు మంజూరవుతాయి. వృత్తి, ఉద్యోగాల పరంగా అనుకూలమైన మార్పులు చోటు చేసుకుంటాయి. పెట్టుబడుల విషయంలో ఆచి తూచి వ్యవహ‌రించాలి. బుద్ధికుశలతతో అధిక లాభాలు పొందుతారు.

కర్కాటక రాశి

విందు వినోద కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. నూతన వస్తువులు, వస్త్రాలు కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా చెప్పుకోదగిన ఇబ్బందులేమీ ఉండవు. నూతన వ్యాపారం ప్రారంభిస్తారు. ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త అవ‌స‌రం. విస్తృతంగా చర్చలు సాగిస్తారు. ప్రయాణాలు తప్పకపోవచ్చు. ఉపకరించే విషయాలను సకాలంలో తెలుసుకోండి.

సింహ రాశి

దేవాలయాలు సందర్శిస్తారు. కుటుంబ, వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించి కీల‌క‌ ఆలోచ‌న‌లు చేస్తారు. సంతృప్తికర ఫలితాలు సాధిస్తారు. సంగీత, సాహిత్యాల పట్ల విశేషంగా అభిరుచి కనబరుస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో నిదానంగా వ్యవహరిస్తే లాభపడతారు. ఆర్థికపరమైన సర్దుబాట్లు చేసుకోవడం కష్టతరంగా పరిణమిస్తుంది.

కన్యా రాశి

కోపతాపాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన పత్రాల మీద సంతకాలు చేసేటప్పుడు జాగ్ర‌త్త‌లు పాటించండి. కొత్తవారితో స్నేహం చేస్తారు. వ్యాపారంలో తాత్కాలిక భాగస్వాములను చేర్చుకుంటారు. ఉద్యోగావకాశాలు కలిసి వస్తాయి. చేతికి కుబేర కంకణం ధరించండి, లక్ష్మీ కటాక్షం ఏర్పడుతుంది.

తులా రాశి

పనులు నిదానంగా సాగినప్పటికీ ప్రయోజనాలకు ముప్పు వాటిల్లదు. కుటుంబంలో స్వల్ప మ‌న‌స్పర్థలు చోటు చేసుకుంటాయి. ఉన్నతికి ఉపకరించే అంశాల పట్ల అధిక శ్రద్ధ కనబరచవలసి ఉంటుంది. కొనుగోలు, అమ్మకాలకు సంబంధించిన విషయాలలో మెళకువలు అవసరం. ఆర్థిక స్థితిగతులపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.

వృశ్చిక రాశి

మిమ్మల్ని మీరు నిరూపించుకొనే అవకాశాలు ఉన్నాయి. విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వీసా ప్ర‌యత్నాలు అనుకూలిస్తాయి. అనవసరమైన విషయాలతో కాలం వృధా చేయ‌కండి. మధ్యవర్తిత్వం వహించి ఒక కార్యక్రమం సానుకూల పరుస్తారు. విందు, వినోద కార్యక్రమాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆ పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.

ధనుస్సు రాశి

ఆర్థికంగా క‌లిసి వచ్చే కాలం. బహుముఖంగా ప్రజ్ఞా పాటవాలు కనబరుస్తారు. వృత్తి, ఉద్యోగాల పరంగా మీ స్థాయి పెంపొందుతుంది. ఆరోగ్య పరమైన జాగ్రత్తలు అవసరం. కోర్టు వ్యవహారాలు సానుకూలపడతాయి. రాజకీయ పరిచయాలు లాభిస్తాయి. ఓర్పు స‌హ‌నంతో చేసే ప్ర‌తి ప‌ని మీకు ఉప‌యోగ‌ప‌డుతుంది.

మకర రాశి

ఈ వారం రాశి ఫలాల ప్రకారం మకర రాశి వారికి స్వ‌ల్ప ఆరోగ్య‌ సమస్యలు ఎదుర్కొంటారు. రుణాలు తీరుస్తారు. గ‌తంలో తనఖా పెట్టిన‌ వస్తువులు విడిపిస్తారు. వివాదాస్పదమైన విషయాలకు దూరంగా ఉండండి. కీల‌క‌మైన విష‌యాల్లో నిర్మొహమాట వైఖరి కనబరుస్తారు. అష్టమూలికా తైలంతో దీపారాధన చేయడం శుభప్రదం.

కుంభ రాశి

రక్త సంబంధీకులతో ఏర్పడిన విభేదాలు పరిష్కార బాటలో ఉంటాయి. ఆదాయం పెంపొందించుకునే అన్ని మార్గాలను సమర్థవంతంగా చేజిక్కించుకుంటారు. కారణం లేని చికాకులు వేధిస్తాయి. మానసిక ఉల్లాసం కోసం ఆధ్యాత్మికత పట్ల మక్కువ చూపిస్తారు. కొంత‌కాలంగా ఇబ్బందిపెట్టిన స‌మ‌స్య‌లకు ప‌రిష్కారం దొరుకుతుంది.

మీన రాశి

జీవిత భాగస్వామి సలహాలు, సూచనలు పాటించి లాభ‌ప‌డ‌తారు. ఆత్మీయుల వ‌ల్ల క‌లిసి వ‌స్తుంది. శ్రమ అధికంగా ఉంటుంది. ఫలితాలు మాత్రం అందుకు తగిన విధంగా ఉండవు. ఓర్పుతో ముందుకు అడుగు వేయండి. కీల‌క విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం.

చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ
చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ