Weekly Horoscope : ఈ వారం రాశి ఫలాలు.. మీ రాశి ఎలా ఉంది?
Weekly Horoscope : ఈవారం రాశి ఫలాలు తేదీ సెప్టెంబరు 10వ నుంచి 16వ తేదీ వరకు జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు. మేష రాశి నుంచి మీన రాశి వరకు వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.
తెలుగు రాశిఫలితములు (వార ఫలితము), 10.09.2028 నుండి 16.09.2023 వరకు, సంవత్సరం : శోభకృత్ నామ, అయనం : దక్షిణాయనం, మాసం : శ్రావణం
ట్రెండింగ్ వార్తలు
మేషరాశి
మేషరాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా కలసివచ్చును. మాతృ స్థానములో శుక్రుని ప్రభావం వలన కుటుంబ సౌఖ్యం, ఆనందం పొందెదరు. లాభస్థానములో శని అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూల ఫలితాలుందును. జన్మరాశియందు గురు, రాహువుల ప్రభావంచేత ఒత్తిళ్ళు కలుగు సూచన. మేషరాశివారు ఈవారం దక్షిణామూర్తిని పూజించాలి. ఆదివారం, మంగళవారం, శనివారం రాహుకాల సమయంలో దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యుణ్ణి పూజించినట్లయితే మరింత శుభఫలితాలు కలుగుతాయి.
వృషభరాశి
వృషభరాశివారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యయస్థానములో గురు, రాహువుల ప్రభావం వలన ఆర్థిక విషయాల్లో మరియు ఖర్చుల యందు జాగ్రత్తలు వహించాలి. శుక్రుడు, రవి, బుధుల అనుకూల గ్రహస్థితి వలన అనుకున్న ముఖ్యమైన పనులు ఈవారం పూర్తి చేసెదరు. శత్రువులపై విజయాన్ని పొందెదరు. స్త్రీలకు అనారోగ్య సమస్యలు వేధించును. విద్యార్థులకు కలసివచ్చును. పరీక్షలయందు అనుకూలత ఏర్పడును. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించండి. శనివారంరోజు దుర్దాదేవిని పూజించాలి.
మిథున రాశి
మిథునరాశివారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. లాభములో గురు, రాహువుల ప్రభావం వలన ఉద్యోగంలో అభివృద్ధి కలుగును. వ్యాపారస్తులకు వ్యాపారంలో ఆశించిన ఫలితాలేర్చడును. భాగ్యస్థానములో శని కేంద్రస్థానములో కుజుని ప్రభావం వలన కుటుంబములో కొంత అసహనం కలుగును. స్త్రీలకు అనుకూలమైన వారం. మిథునరాశివారు ఈ వారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదివారం సూర్యాష్టకాన్ని పఠించండి.
కర్కాటక రాశి
కర్మాటక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. జన్మరాశియందు శుక్రుడు, వాక్ స్థానములో రవి ప్రభావం వలన ప్రతీ పనియందు చికాకులు, ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ శని ప్రభావం వలన కుటుంబంనందు, పనులయందు అశాంతి కలుగును. వ్యాపారస్తులకు అనుకూలంగా లేదు. విద్యార్థులు కష్టపడవలసిన సమయం. కర్మాటకరాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీదాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
సింహరాశి
సింహరాశి వారికి ఈవారం మీకు అనుకూలంగా లేదు. జన్మరాశియందు రవి, బుధుల ప్రభావం వలన చికాకులు, సమస్యలు అధికముగా ఉండును. ఆరోగ్య విషయంలో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. వాక్ స్థానములో కుజుని ప్రభావం చేత కుటుంబములో గొడవలు, సమస్యలు మనస్పర్థలు కలుగు సూచన. వ్యసనముల కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. ఖర్చులు నియంత్రించుకోవాలి. సింహరాశివారు ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే ఆదిత్య హృదయాన్ని పారాయణ చేయండి. వేంకటేశ్వరస్వామిని పూజించండి.
కన్యారాశి
కన్యారాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. జన్మరాశియందు కుజుడు, వాక్ స్థానమునందు చంద్రుని ప్రభావం వలన ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. మీ మాటల వల్ల ఎదుటివారికి ఇబ్బంది కలుగును. ప్రయాణముల కోసం మీరు చేయు ప్రణాళిక సత్ఫ్భలితాలిచ్చును. వ్యయస్థానములో రవి, బుధులు ప్రభావం వలన ముఖ్యమైన పనులు కోసం ధనాన్ని ఖర్చు చేసెదరు. లాభములో శుక్రుని ప్రభావం వలన ఆర్థికపరమైనటువంటి లాభములు కలుగును. కన్యారాశి వారు ఈవారం మరింత శుభఫలితాలు కోసం మహావిష్ణువును పూజించాలి. విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
తులా రాశి
తులారాశి వారికి ఈ వారం మీకు కలసివచ్చును. ప్రయాణం కోసం మీరు చేయు ప్రయత్నములు ఫలించును. పంచమంలో శని అనుకూల ప్రభావం వలన సంతానం వలన ఆనందము కలుగును. కళత్ర స్థానములో గురు, రాహువులు జన్మస్థానం నందు కేతువు మరియు వ్యయస్థానమునందు కుజుని ప్రభావం వలన కుటుంబ సభ్యులతో వాదనలు కలుగును. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. ఈవారం మరింత శుభఫలితాలు పొందాలనుకుంటే దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహపీడాహర స్తోత్రాన్ని పఠించడం. సంకటనాశన గణపతి స్తోత్రాన్ని పఠించడం మంచిది.
వృశ్చిక రాశి
వృళ్చిక రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికి లాభస్థానములో కుజుడు దశమంలో రవి, బుధల అనుకూలత వలన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో అనుకూల ఫలితాలున్నాయి. శారీరక శ్రమ కలిగినప్పటికి అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. ఆరోగ్యం అనుకూలించును. బద్ధకాన్ని విడచిపెట్టాలి. విద్యార్థులకు మధ్యస్థ సమయం. రుణ విమోచక అంగారక స్తోత్రం చదవండి. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం లక్ష్మీదేవిని పూజించండి. లక్ష్మీ అష్టకం పఠించండి.
ధనూ రాశి
ధనూరాశి వారికి ఈ వారం మీకు కలసివచ్చును. తృతీయ స్థానములో శని అనుకూల ప్రభావం పంచమంలో గురుని అనుకూల ప్రభావం దశమంలో, కుజుని అనుకూల ప్రభావంచేత నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో లాభదాయకంగా ఉండును. వ్యాపారస్తులకు ఈవారం కలసివచ్చును. విద్యార్థులకు ఈవారం పరీక్షలలో అనుకూల ఫలితాలు కలిగించును. అష్టమ శుక్రుని ప్రభావం వలన ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ధనూరాశివారు ఈవారం మరింత శుభఫలితాల కోసం సూర్యాష్టకాన్ని పఠించడం. శివాలయంలో అభిషేకం చేసుకోవడం వలన శుభఫలితాలు కలుగుతాయి.
మకర రాశి
మకర రాశివారికి ఈ వారం అంత అనుకూలంగా లేదు. అష్టమ రవి, బుధుల ప్రభావం వలన మకరరాశివారు ఆరోగ్య విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. అర్జాష్టమ శని ప్రభావం వలన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో చికాకులు ఇబ్బందులు ఏర్పడును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఉద్యోగస్తులకు కష్ట సమయం. మనస్తాపం కలుగు సూచనలు. మీకు మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించడం మంచిది.
కుంభ రాశి
కుంభరాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా లేదు. అష్టమ కుజుడు, జన్మరాశి యందు శని (ఏలినాటి శని) ప్రభావం చేత ఆరోగ్య విషయాలయందు ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలి. కళత్రస్థానమునందు రవి సంచారం వలన కుటుంబమునందు చికాకులు కలుగును. తృతీయ స్థానమునందు గురు, రాహువుల ప్రభావంచేత పనులుయందు ఒత్తిళ్ళు ఏర్పడును. ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం వేంకటేశ్వరస్వామిని పూజించండి. నవగ్రహ పీడాహర స్తోత్రాలను పఠించండి.
మీన రాశి
మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. ఏలినాటి శని ప్రభావం మరియు అష్టమస్థానమునందు కేతువు ప్రభావంచేత అనారోగ్య సమస్యలు వేధించును. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్త వహించడం మంచిది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో రాజకీయ ఒత్తిళ్ళు ఏర్పడును. వ్యాపారస్తులకు ధననష్టం కలుగు సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయం. మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం నవగ్రహ ఆలయాల్లో శనికి తైలాభిషేకం చేసుకోవాలి. దక్షిణామూర్తిని పూజించండి. లలితా సహస్ర నామాన్ని పఠించండి.