వార ఫలాలు.. ఈ వారం విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలమైన సమయం-weekly horoscope in telugu february 25th to march 2nd rasi phalalu check zodiac signs future prediction ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Weekly Horoscope In Telugu February 25th To March 2nd Rasi Phalalu Check Zodiac Signs Future Prediction

వార ఫలాలు.. ఈ వారం విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు అనుకూలమైన సమయం

HT Telugu Desk HT Telugu
Feb 25, 2024 02:00 AM IST

Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. ఫిబ్రవరి25వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.

వార ఫలాలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 వరకు
వార ఫలాలు: ఫిబ్రవరి 25 నుంచి మార్చి 2 వరకు

రాశిఫలాలు (వార ఫలాలు) 25.02.2024 నుండి 02.03.2024 వరకు

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : ఉత్తరాయణం, మాసం : మాఘం

మేష రాశి

మేష రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూల ఫలితాలున్నాయి. చంద్రుడు అనుకూల సంచారం వలన అనుకున్న ముఖ్యమైన పనులు పూర్తి చేసెదరు. జన్మగురుని ప్రభావంచేత పనులయందు ఒత్తిళ్ళు ఇబ్బందిపెట్టును. నరఘోషలు వంటివి ఏర్పడు సూచన. పరిస్థితులు ఎలా ఉన్నప్పటికి లాభస్థానములో బుధ, గురు, శని ప్రభావం వలన పనులయందు లాభము, జయము కలుగును. దశమస్థానములో కుజ, శుక్రుల అనుకూలత వలన ఉద్యోగస్తులకు ఈవారం అనుకూల ఫలితాలుంటాయి. వ్యాపారస్తులకు ఇది కలసివచ్చేటటువారం. విద్యార్థులకు అనుకూలమైన ఫలితాలు కలుగును. జన్మగురుని ప్రభావం వలన కొంత ఒత్తిళ్ళు ఏర్పడతాయి. దక్షిణామూర్తిని పూజించడం మంచిది.

వృషభ రాశి

వృషభ రాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. లాభస్థానములో రాహువు ప్రభావం వలన పనులయందు పట్టు ఏర్పడును. దశమంలో రవి, బుధ, శని అనుకూలత వలన ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగును. ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వంటివి అనుకూలించును. వ్యయస్థానములో గురుని ప్రభావం ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. విద్యార్థులకు అనుకూలమైనటువంటివారం. వ్యాపారస్థులకు ఖర్చులతో కూడినటువంటి సమయం. కనకధారా స్తోత్రాన్ని పఠించడం మంచిది. గురువారం రోజు దత్తాత్రేయుని పూజించండి.

మిథున రాశి

మిథున రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలపరంగా అష్టమ కుజ, శుక్రల ప్రభావంచేత మధ్యస్థ ఫలితాలు ఏర్పడుతున్నాయి. లాభములో గురుడు, దశమంలో రాహువు ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారపరంగా అనుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థులకు ఈవారం కలిసివచ్చును. ఉద్యోగస్తులకు కొంత భయాందోళనలు కలుగు సూచన. వ్యాపారస్తులకు అనుకూల సమయం. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించడం మరింత శుభఫలితాలు కలుగుతాయి. శివాష్టకం పఠించడం మంచిది.

కర్కాటక రాశి

కర్కాటక రాశి వారికి ఈ వారం మీకు అంత అనుకూలంగా లేదు. ఆయుస్థానమైనటువంటి అష్టమస్థానములో రవి, బుధ, శనుల ప్రభావం వలన ఈ రాశి వారికి ఆరోగ్య సమస్యలు, వృత్తి, కుటుంబ సమస్యలు ఇబ్బందిపెట్టు సూచన. భాగ్యములో రాహువు, దశమంలో గురుని ప్రభావం వలన ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు అధికంగా ఉండును. వ్యాపారస్తులకు కొంత కష్టకాలం. విద్యార్థులకు ఈవారం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి. కళత్ర స్థానములో కుజుడు, అష్టమశని ప్రభావం చేత కుటుంబ విషయాలు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి. నవగ్రహ ఆలయ దర్శనం మంచిది.

సింహ రాశి

సింహ రాశి వారికి ఈవారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వాక్‌ స్థానములో కేతువు అష్టమ రాహువు ప్రభావం వలన గొడవలకు, ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు భాగ్యములో గురుని అనుకూల ప్రభావం వలన మధ్యస్థంనుండి అనుకూల ఫలితాలు ఈవారం ఏర్పడుతున్నాయి. ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో వాదనలకు దూరంగా ఉండండి. శత్రు స్థానములో శుక్ర, కుజుల అనుకూలత వలన శత్రువర్గంపై విజయాన్ని పొందెదరు. కోర్టు వ్యవహారాలు అనుకూలించును. ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది. సూర్య నారాయణమూర్తిని పూజించండి.

కన్యా రాశి

కన్యారాశి వారికి ఈ వారం మీకు అనుకూలంగా ఉన్నది. ప్రయాణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించును. మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. పంచమంలో కుజ శుక్రుల అనుకూలత వలన వీరు చేసే ప్రయత్నాలు ఫలించును. ఆరో స్థానములో రవి, బుధ, శునుల అనుకూల ప్రభావం చేత ధనలాభము, కీర్తి కలుగును. జన్మరాహువు, కళత్ర కేతువు ప్రభావంచేత పనులు, ప్రయాణముల యందు ఒత్తిళ్ళు ఏర్పడును. అష్టమ గురుని ప్రభావంచేత ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించడం మంచిది. గత కొంత కాలంతో పోల్చుకుంటే ఈ రాశికి మార్పు తెచ్చేటటువంటి వారం. ఈ రాశి వారికి శుభ ఫలితాలు ఇస్తుంది. మీరు చేసే ప్రయత్నాలన్నీ సత్ఫలితాలు ఇచ్చే సూచనలు అధికముగా ఉన్నాయి. విష్ణు సహస్రనామం పారాయణ, ఆదిత్య హృదయాన్ని పఠించడం మంచిది.

తులా రాశి

తులా రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. చతుర్ధంలో కుజ, శుక్రుల అనుకూలత వలన కుటుంబ సౌఖ్యం, ఆనందం పొందెదరు. పంచమంలో రవి, బుధ, శనుల ప్రభావం వలన నిర్ధిష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్ళి విజయాలను పొందెదరు. ఆర్థిక సమస్యల నుండి బయట పడతారు. కళత్రంలో గురుని అనుకూలత, ఆరో స్థానంలో రాహువు అనుకూలత వలన ఉద్యోగస్తులకు సత్ఫలితాలు కలుగును. వ్యాపారస్తులకు ఈవారం అనుకూలంగా ఉంది. విద్యార్థులకు శుభఫలితాలు ఏర్పడును. కృష్ణాష్టకాన్ని పఠించండి.

వృశ్చిక రాశి

వృశ్చిక రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. శని ప్రభావం ఉన్నప్పటికి పంచమంలో రాహువు, లాభములో కేతువు అనుకూల ప్రభావంచేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో పురోగతి లభించును. మాతృస్థానములో కుజ, శుక్రుల ప్రభావంచేత బంధు మిత్రులతో సోదరీమణులతో ఆనందముగా గడుపుతారు. చతుర్ధంలో రవి, బుధ, శనుల ప్రభావం చేత శారరీక శ్రమ కలుగును. ప్రయాణాల కోసం ప్రణాళికలు రచించెదరు. ఉద్యోగస్తులకు పనులయందు ఒత్తిళ్ళు కొంత అధికముగా ఉండును. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయం. విద్యార్థులకు మధ్యస్థ ఫలితాలు ఏర్పడును. మరింత శుభఫలితాలు కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథ ప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

ధనూ రాశి

ధనూ రాశి వారికి ఈ వారం మీకు అనుకూల ఫలితాలున్నాయి. ధనస్థానములో కుజ, శుక్రుల ప్రభావంచేత ధనలాభం, సౌఖ్యం కలుగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. మాతృ వర్గీయులతో స్నేహము అధికమగును. కుటుంబ సభ్యులతో ఆహ్లాదకరంగా గడుపుతారు. పంచమ స్థానములో గురుని అనుకూలత వలన కుటుంబ సౌఖ్యం సంతాన సౌఖ్యం, ఆనందము పొందెదరు. ఉద్యోగస్తులకు అనుకూలమైన వారం. వ్యాపారస్తులకు శుభ ఫలితాలు కలుగును. విద్యార్థులకు ఈవారం కలసివచ్చును. మరింత శుభ ఫలితాల పొందడం కోసం సుబ్రహ్మణ్యుడిని, దుర్గాదేవిని పూజించడం మంచిది.

మకర రాశి

మకర రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థ ఫలితాలున్నాయి. జన్మరాశియందు కుజ, శుక్రుల ప్రభావంచేత ఈవారం ఆరోగ్య సమస్యలు వేధించును. ఏలినాటి శని ప్రభావం చేత శారీరక సమస్యలు, మానసిక వేదన అధికముగా ఉండును. ఆరోగ్య విషయాల్లో శ్రద్ద వహించడం మంచిది. వాక్‌ స్థానములో రవి, బుధ, శనులు ప్రభావం వలన వాదనలకు దూరంగా ఉండాలని సూచన. ఉద్యోగస్తులకు ఈవారం పని ఒత్తిళ్ళు, చికాకులు అధికముగా ఉండును. వ్యాపారస్థులకు అంత అనుకూలంగా లేదు. ఖర్చులు నియంత్రిచుకోవాలని సూచన. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

కుంభ రాశి

కుంభ రాశి వారికి ఈ వారం మీకు ఒత్తిళ్ళతో కూడియున్నటువంటి వారం. జన్మరాశిలో ఏలినాటి శని, జన్మశని ప్రభావం చేత అలాగే కుంభరాశికి జన్మరాశిలో రవి, బుధుల ప్రభావంచేత పనులయందు ఒత్తిళ్ళు, చికాకులు అధికమగును. పనులయందు ఆలస్యము, బద్దకం వంటివి ఏర్పడును. ఆరోగ్య విషయాలయందు శ్రద్ద వహించాలి. వాక్‌ స్థానములో రాహువు, తృతీయ స్థానములో గురుని ప్రభావం వలన అనవసర మాటలు పడే స్థితి ఏర్పడును. వ్యయస్థానములో కుజ, శుక్రుల ప్రభావం వలన ఖర్చులు అధికమగును. మొత్తంమీద ఈవారం కుంభరాశికి అంత అనుకూలంగా లేదు. అప్పు చేయవద్దు, అప్పు ఇవ్వవద్దు అని సూచన. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయం. వ్యాపారస్తులకు కష్టకాలం. విద్యార్థులకు మధ్యస్థ సమయం. మరింత శుభఫలితాలు పొందడం కోసం శనికి తైలాభిషేకం చేసుకోవాలి. నవగ్రహ పీడాహర స్తోత్రాన్ని పఠించండి. దశరథప్రోక్త శని స్తోత్రాన్ని పఠించండి.

మీన రాశి

మీన రాశి వారికి ఈ వారం మీకు మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. జన్మరాహువు ప్రభావం వలన ఆరోగ్య సమస్యలు, పనుల యందు ఒత్తిళ్ళు కలుగు సూచన. బృహస్పతి అనుకూల ప్రభావం చేత ధనలాభం కలుగును. లాభ స్థానములో కుజ, శుక్రుల ప్రభావం వలన కుటుంబ సౌఖ్యం, శారీరక సౌఖ్యం, ఆనందం పొందెదరు. వ్యయస్థానములో రవి, బుధ, శనుల ప్రభావంచేత ఏలినాటి శని ప్రభావం వలన ఖర్చులు, అప్పుల బాధ పెరుగు సూచన. ఎవ్వరికీ అప్పు ఇవ్వద్దు. నూతన వ్యాపారం, స్పెక్యులేషన్‌, పెట్టుబడులకు అనుకూలంగా లేదు. మరింత శుభఫలితాలు పొందడం కోసం గురు దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి. ఆదిత్య హృదయ పారాయణం చేయడం మంచిది. శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ : 9494981000

బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ, మొబైల్‌ : 9494981000
WhatsApp channel