Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారు దుర్గా దేవిని పూజించాలి-weekly horoscope in telugu check your vedik astrology predictions for week may 28 2023 to june 3 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Weekly Horoscope In Telugu Check Your Vedik Astrology Predictions For Week May 28 2023 To June 3 2023

Weekly Horoscope: ఈ వారం రాశి ఫలాలు.. ఈ రాశుల వారు దుర్గా దేవిని పూజించాలి

HT Telugu Desk HT Telugu
May 28, 2023 01:02 AM IST

Weekly Horoscope: ఈవారం రాశి ఫలాలు (వార ఫలాలు) మే 28, 2023 నుండి జూన్ 3, 2023 వరకు గల వారంలో జాతక ఫలాలను పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

ఈవారం శుభ ఫలితాల కోసం పలు రాశుల వారు దుర్గా దేవిని పూజించాలని సూచన
ఈవారం శుభ ఫలితాల కోసం పలు రాశుల వారు దుర్గా దేవిని పూజించాలని సూచన

Weekly Horoscope: ఈవారం రాశి ఫలాలు (వార ఫలాలు) మే 28, 2023 నుండి జూన్ 3, 2023 వరకు గల వారంలో జాతక ఫలాలను పంచాంగకర్త చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం: శోభకృత నామ, అయనం: ఉత్తరాయనం, మాసం: జ్యేష్టం

మేషరాశి ఈవారం రాశి ఫలాలు

మేషరాశి జాతకులకు ఈ వారం చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మేషరాశికి జన్మస్థానము నందు బుధ, గురు, రాహువులు, వాక్‌ స్థానం నందు రవి ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. పనులు యందు ఆటంకములు, చికాకులు కలుగును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకు ఈ వారం రాశి ఫలాలు అనుకూలంగా ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన. మేషరాశి వారికి శని యొక్క అనుకూల స్థితివలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందెదరు.

మేషరాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గా దేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి.

ఈవారం వృషభ రాశి ఫలాలు

వృషభ రాశి జాతకులకు ఈ వారం రాశి ఫలాలు అంత అనుకూలంగా లేవు. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. వ్యయ స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ఖర్చులు అధికముగా ఉండును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శారీరక శ్రమ, ఒత్తిడి అధికముగా ఉండును. వృషభ రాశి జాతకులైన ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములు ఉండును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికముగా ఉండును. వృషభరాశి వారికి దశమము నందు శని ప్రభావం చేత ఆర్ధికపరంగా లాభము చేకూరును.

వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్దాదేవిని పూజించడం మంచిది.

మిథునరాశి వారికి ఈవారం రాశి ఫలాలు

మిథున రాశి జాతకులకు ఈ వారం అనుకూలముగా ఉంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఖర్చులు అధికమగును. మిథున రాశి వారికి జన్మరాశి యందు శుక్రుడు, వాక్‌ స్థానమునందు కుజుని ప్రభావం చేత వివాదాలు ఏర్పడు సూచన. ధనాన్ని కొన్ని ముఖ్యమైన పనుల కోసం ఖర్చు చేసెదరు. బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుట చేత మిథున రాశి వారికి కలసివచ్చును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము.

ఈ వారం మరింత శుభఫలితాల కోసం మిథునరాశి వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

ఈవారం కర్కాటక రాశి ఫలాలు

కర్కాటక రాశి జాతకులకు ఈ వారం మధ్యస్థము నుండి చెడు ఫలితాలు ఉన్నాయి. జన్మరాశి యందు కుజుని ప్రభావంచేత శారీరక శ్రమ అధికముగా ఉండును. అయినప్పటికి లాభస్థానమునందు రవి, దశమ స్థానమునందు బుధ గురు, రాహువుల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయముల యందు కుటుంబ వ్యవహారముల యందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్రీలు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

కర్కాటక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకము, లింగాష్టకాన్ని పఠించండి.

సింహరాశి వారఫలాలు

సింహరాశి జాతకులకు ఈ వారం అనుకూల ఫలితాలు ఉన్నాయి. లాభ స్థానములో శుక్రుడు, దశమ స్థానములో రవి ప్రభావం చేత భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ఫ్రభావం చేత సింహరాశి వారికి చేసే ప్రతి పని అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు అధికముగా ఉండు సూచన. నూతన వస్తువుల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేస్తారు. ఆర్థికమపరమైన నిర్ణయాలు అనుకూలించును. విద్యార్థులకు అనుకూలమైన సమయము. స్త్రీలు కుటుంబ విషయాలయందు, ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి.

సింహరాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సూర్యాష్టకము పఠించాలి. గురువారం దక్షిణామూర్తిని పూజించాలి.

ఈవారం కన్యారాశి ఫలాలు

కన్యా రాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. కన్యా రాశి వారికి లాభస్థానములో కుజుడు, రాజ్యస్థానములో శుక్రుడు, భాగ్య స్థానములో రవి అనుకూల ప్రభావం చేత ధనలాభము, వస్తు లాభము, కీర్తి కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. అష్టమ స్థానము నందు బుధ, గురు, రాహువుల సంచారం వలన ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు జా(గ్రత్త వహించాలి. స్త్రీ సౌఖ్యం కలుగును. కన్యారాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును.

కన్యారాశి ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

తులా రాశి వార ఫలాలు

తులారాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి చెడు ఫలితాలున్నాయి. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల 'ప్రభావంచేత కుటుంబము నందు సమస్యలు, వాదనలు అధికమగును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. అష్టమ రవి ప్రభావం చేత ఉద్యోగంలో శ్రమ అధికముగా ఉండును. దశమంలో కుజుడు, భాగ్యములో శుక్రుని అనుకూల ప్రభావం చేత సమస్యలు అధిగమించి ముందుకు వెళ్ళెదరు. కుటుంబ విషయాలయందు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

తులారాశి జాతకులు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని దుర్దాదేవిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు.

వృశ్చిక రాశి ఈ వారం రాశి ఫలాలు

వృశ్చిక రాశి జాతకులకు ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉండెదరు. అష్టమ స్థానము నందు శుక్రుడు, కళత్ర స్థానమందు రవి ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉండును. స్త్రీలకు మధ్యస్థ సమయము. విద్యార్థులకు అనుకూల సమయము.

వృశ్చిక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మంగళవారం దుర్గాదేవిని పూజించడం మంచిది.

ధనూ రాశి జాతకులకు వార ఫలాలు

ధనూరాశి వారికి ఈ వారం మథ్యస్థము నుండి అనుకూల ఫలితాలున్నాయి. అష్టమ కుజుని ప్రభావంచేత కుటుంబములో మానసిక ఘర్షణలు, వాదనలు ఏర్పడు సూచన. ఏడో స్థానము నందు శుక్రుడు, ఐదో స్థానం నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉండెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగును. ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి వారం. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము.

మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ధనూరాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించాలి.

మకర రాశి వార ఫలాలు

మకర రాశివారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలున్నాయి. ప్రయాణములు అనుకూలించును. ఆరోగ్య విషయంలో మార్పు కలుగును. చతుర్ధ స్థానము నందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన, పంచమ స్థానము నందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. కళత్ర స్థానము నందు కుజుని ప్రభావం చేత కుటుంబములో సమస్యలు, ఘర్షణలు అధికమగును. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. వ్యాపారస్తులకు కష్టకాలము. విద్యార్థులకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మకరరాశి వారికి ఏలినాటి శని ప్రభావంచేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి.

మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయాలి. శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం పఠించాలి. శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును.

కుంభ రాశి జాతకులకు ఈవారం రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈ వారం అనుకూలముగా ఉంది. ఆరో స్థానమునందు కుజుడు, ఐదో స్థానము నందు శుక్రుడు, తృతీయ స్థానమునందు రాహువు అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని అనుకున్న విధంగా పూర్తి చేసెదరు. ప్రయాణములు అనుకూలించును. ఏలినాటి శని ప్రభావంచేత శారీరక శ్రమ, ధన వ్యయము ఏర్పడును. బంధుమిత్రులతో ఆనందముగా గడిపెదరు. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును.

కుంభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, దుర్గాదేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం చదువుకుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.

ఈవారం మీన రాశి ఫలాలు

మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నవి. ఏలినాటి శని ప్రభావం వల్ల, వాక్‌ స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాల యందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఖర్చులు చేయడానికి కూడా అనుకూలంగా లేనటువంటి సమయము. ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు మథ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

మీన రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును. గురువారం రోజు శనగలు, తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ 9494981000

WhatsApp channel