Weekly horoscope in telugu: ఈవారం రాశి ఫలాలు.. వీరు ఖర్చులు తగ్గించుకోవాలి-weekly horoscope in telugu check astrological zodiac sign predictions for week starts from june 4 to june 10 2023 ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  Rasi Phalalu  /  Weekly Horoscope In Telugu Check Astrological Zodiac Sign Predictions For Week Starts From June 4 To June 10 2023

Weekly horoscope in telugu: ఈవారం రాశి ఫలాలు.. వీరు ఖర్చులు తగ్గించుకోవాలి

HT Telugu Desk HT Telugu
Jun 04, 2023 01:01 AM IST

Weekly horoscope in telugu: ఈ వారం రాశి ఫలాలు (తెలుగు వార ఫలితము) 04.06.2023 నుండి 10.06.2023 వరకు గల కాాలానికి పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

నేటి రాశిఫలాలు
నేటి రాశిఫలాలు

Rasi phalalu this week ఈ వారం రాశి ఫలాలు (తెలుగు వార ఫలితము) 04.06.2023 నుండి 10.06.2023 వరకు గల కాాలానికి పంచాంగ కర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందించారు.

ట్రెండింగ్ వార్తలు

సంవత్సరం : శోభకృత్‌ నామ, అయనం : ఉత్తరాయనం, మాసం : జ్యేష్టము

ఈవారం మేషరాశి ఫలాలు

మేషరాశి వారికి ఈ వారం మధ్యస్థము నుండి చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. చికాకులు అధికముగా ఉండును. ఆవేశపూరిత నిర్ణయాలకు దూరంగా ఉండాలి. మేషరాశికి జన్మస్థానమునందు బుధ, గురు, రాహువులు, వాక్‌ స్థానం నందు రవి ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. చతుర్ధ స్థానము నందు కుజ, శుక్రుల ప్రభావంచేత కుటుంబ విషయాలయందు చికాకులు ఏర్పడు సూచన. పనుల యందు ఆటంకములు, చికాకులు కలుగును. కుటుంబ విషయాల్లో జాగ్రత్త వహించాలి. అనారోగ్య సూచనలు అధికముగా ఉన్నాయి. మేషరాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు ఆర్థిక సమస్యలు అధికముగా ఉన్నాయి. ఖర్చులు తగ్గించుకోవాలని సూచన.

మేషరాశి వారికి శనియొక్క అనుకూల స్థితి వలన ధనపరమైనటువంటి విషయాల్లో అనుకూల ఫలితాలను పొందెదరు. మేషరాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని, సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించడం మంచిది. సుబ్రహ్మణ్య అష్టకం పఠించాలి.

వృషభరాశి ఈవారం ఫలితాలు

ఈవారం వృషభ రాశి జాతకులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యయ స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత ప్రయాణములు, ఖర్చులు అధికముగా ఉండును. జన్మరాశి యందు రవి ప్రభావం చేత అనారోగ్య సూచనలు అధికము. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. శారీరక శ్రమ, ఒత్తిడి అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితములుండును. వ్యాపారస్తులకు ఖర్చులు అధికముగా ఉండును.

వృషభరాశివారికి దశమము నందు శని ప్రభావం చేత ఆర్థికపరంగా లాభము చేకూరును. వృషభ రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరున్ని, దుర్గా దేవిని పూజించడం మంచిది.

ఈవారం మిథునరాశి ఫలాలు

మిథున రాశి వారికి ఈ వారం రాశి ఫలాలు మధ్యస్థముగా ఉన్నాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించండి. ఖర్చులు అధికమగును. మిథున రాశి వారికి వాక్‌ స్థానమునందు కుజుడు, వ్యయస్థానము నందు రవి ప్రభావం చేత గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల చికాకులు ఇబ్బందులు కలుగుగును. వివాదాలు ఏర్చడు సూచన.

బుధ, గురు, రాహువులు లాభములో సంచరించుట చేత మిథునరాశివారికి కొన్ని పనులు అనుకూలించును. ఉద్యోగస్తులకు మధ్యస్థ ఫలితాలున్నాయి. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము. ఈ వారం మరింత శుభఫలితాల కోసం మిథునరాశి వారు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం. శనివారం రోజు శనికి తైలాభిషేకం చేసుకోవడం మంచిది.

కర్కాటకరాశి వార ఫలాలు

కర్మాటక రాశి వారికి ఈ వారం చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. జన్మరాశియందు కుజుని, అష్టమ శని ప్రభావం చేత శారీరక శ్రమ, మానసిక ఒత్తిళ్ళు ఏర్పడును. లాభస్థానము నందు రవి, దశమ స్థానము నందు బుధ గురు, రాహువుల ప్రభావం చేత వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరోగ్య విషయముల యందు కుటుంబ వ్యవహారముల యందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉందును. అష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

కర్మాటక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సోమవారం శివాలయంలో అభిషేకం చేసుకోవడం మంచిది. శివాష్టకము మరియు లింగాష్ట్రకాన్ని పఠించండి.

ఈవారం సింహరాశి ఫలాలు

సింహరాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలున్నాయి. వ్యయస్థానములో కుజ, శుక్రుల సంచారంచేత ఖర్చులు అధికమగును. ఇష్టమైన వస్తువులు కొనే ప్రయత్నం చేసెదరు. లాభ స్థానములో శుక్రుడు దశమ స్థానములో రవి ప్రభావం చేత, భాగ్య స్థానములో బుధ, గురు, రాహువుల ప్రభావం చేత సింహరాశి వారికి చేసే ప్రతి పని అనుకూలించును. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు కలసివచ్చును. ఖర్చులు అధికముగా జరుగు సూచన. నూతన వస్తువుల కోసం ధనాన్ని అధికముగా ఖర్చు చేస్తారు. ఆర్థికపరమైన నిర్ణయాలు అనుకూలించును. విద్యార్థులకు అనుకూలమైన సమయము. స్త్రీలు కుటుంబ విషయాల యందు, ఆరోగ్య విషయూాల యందు జాగ్రత్తలు వహించాలి.

సింహరాశి వారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ఆదివారం రోజు సూర్యాష్టకము పఠించాలి. గురువారం దక్షిణామూర్తిని పూజించాలి.

కన్యారాశి వారఫలాలు

కన్యారాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. వ్యాపార విషయాలు లాభించును. కన్యారాశి వారికి లాభస్థానములో కుజ, శుక్రుల ప్రభావంచేత ధనలాభము కలుగును. అనుకున్న పనులు పూర్తి చేసెదరు. అష్టమ స్థానము నందు బుధ, గురు, రాహువుల సంచారం వలన ఆరోగ్య విషయాల యందు, కుటుంబ వ్యవహారాల యందు జాగ్రత్తలు వహించాలి. స్త్రీ సౌఖ్యం కలుగును.

కన్యారాశి వారికి మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన అనుకున్న ప్రతీ పని పూర్తి చేసెదరు. ప్రయాణములు లాభించును. కన్యారాశి జాతకులు ఈవారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం బుధవారం రోజు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం, ఆదివారం ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది.

ఈవారం తులా రాశి వార ఫలాలు

తులారాశి జాతకులకు ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. దశమ స్థానము నందు కుజ, శుక్రుల ప్రభావంచేత తులారాశి ఉద్యోగస్తులు కార్యాలయంలో విభేదాల జోలికి వెళ్లరాదు. కళత్ర స్థానము నందు బుధ, గురు, రాహువుల ప్రభావం చేత కుటుంబము నందు చికాకులు ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండాలని సూచన. కుటుంబ విషయాల యందు, ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

తులారాశి జాతకులు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం రోజు దత్తాత్రేయుని ఆరాధించడం మంచిది. శనివారం శనికి తైలాభిషేకం చేసుకుని దుర్గాదేవిని ఆరాధించడం వలన మరింత శుభఫలితాలు పొందెదరు.

వృశ్ఛిక రాశి ఈవారం రాశి ఫలాలు

వృశ్చిక రాశికి ఈ వారం మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. కళత్ర స్థానము నందు రవి ప్రభావం చేత కుటుంబము నందు సమస్యలు ఏర్పడు సూచన. అర్జాష్టమ శని ప్రభావంచేత ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. మానసికంగా ఉల్లాసముగా ఉందెదరు. కుటుంబ విషయాల యందు శ్రమ అధికముగా ఉందును. స్త్రీలకు మధ్యస్థ సమయము. విద్యార్థులకు అనుకూల సమయము.

వృశ్చిక రాశివారు ఈ వారం మరింత శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, మంగళవారం దుర్గాదేవిని పూజించడం మంచిది.

ఈవారం ధనూ రాశి వార ఫలాలు

ధనూరాశి జాతకులకు ఈ వారం అనుకూల ఫలితాలు ఉన్నాయి. అష్టమ కుజ, శుక్రుల ప్రభావంచేత ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కుటుంబ సభ్యులతో సమస్యలు ఏర్పడు సూచన. ఐదో స్థానమందు నందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత అనుకున్న పనులు పూర్తి చేసెదరు. మానసికంగా ఉల్లాసంగా ఉందెదరు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలించును. ధన లాభము కలుగును. ఉద్యోగస్తులు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారస్తులకు మధ్యస్థ సమయము.

మరింత శుభ ఫలితాలు పొందడం కోసం ధనూరాశి వారు గురువారం రోజు దక్షిణామూర్తిని పూజించడం, శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి.

మకర రాశి ఈవారం రాశి ఫలాలు

మకర రాశి వారికి ఈ వారం అనుకూల ఫలితాలు ఉన్నాయి. ప్రయాణములు అనుకూలించును. ఆరోగ్యము అనుకూలించును. ఖర్చులు పెరుగు సూచన. చతుర్ధ స్థానమునందు బుధ, గురు, రాహువుల అనుకూలత వలన పంచమ స్థానమునందు రవి అనుకూలత వలన అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. వివాదాలకు దూరంగా ఉండాలని సూచన. వ్యాపారస్తులకు కష్టకాలము. విద్యార్థులకు చెడు ఫలితాలు అధికముగా ఉన్నాయి. మకరరాశి వారికి ఏలినాటి శని ప్రభావం చేత ధన విషయమునందు జాగ్రత్తలు వహించాలి.

మకర రాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయాలి. శనివారం రోజు దశరథ ప్రోక్త శని స్తోత్రం వంటివి పఠించాలి. శివారాధన చేయడం వలన శుభ ఫలితము కలుగును.

ఈవారం కుంభరాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈ వారం మధ్యస్థమునుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. ఏలినాటి శని ప్రభావం చేత ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఆరో స్థానము నందు కుజ, శుక్రులు ప్రభావంచేత శత్రు పీడ అధికమగును. పనుల యందు ఆలస్యములు ఏర్పడినప్పటికి అనుకున్నపనులు ఏదోవిధంగా పూర్తి చేసెదరు. ధనపరమైనటువంటి విషయాలయందు శ్రమ అధికమగును. ఉద్యోగస్తులకు మధ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఖర్చులతో కూడియున్నటువంటి సమయము. విద్యార్థులకు మధ్యస్థ ఫలితములు కలుగును.

కుంభ రాశివారు ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం శనివారం రోజు శనికి తైలాభిషేకం చేయించుకోవడం, దుర్గా దేవికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించి దుర్గాష్టకం చదువుకుని ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగును.

మీన రాశి ఈవారం రాశి ఫలాలు

మీన రాశి వారికి ఈ వారం మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నవి. ప్రయాణాలు అనుకూలించును. ఆరోగ్య విషయాలకై ధనమును ఖర్చు చేసెదరు. ఏలినాటి శని ప్రభావం, వాక్‌ స్థానమునందు బుధ, గురు, రాహువుల ప్రభావంచేత వాదనలకు దూరంగా ఉండాలి. కుటుంబ సభ్యులతో ఉద్యోగ వ్యాపారాల యందు చర్చలకు, వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ఉద్యోగస్తులకు మథ్యస్థ సమయము. వ్యాపారస్తులకు ఆర్ధిక సమస్యలు అధికముగా ఉండును. విద్యార్థులకు మధ్యస్థ సమయము.

మీనరాశి వారు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం గురువారం దక్షిణామూర్తిని, దత్తాత్రేయుని పూజించడం మంచిది. విష్ణుసహస్రనామ పారాయణ చేయడం వలన శుభ ఫలితాలు కలుగును. గురువారం రోజు శనగలు తాంబూలాన్ని దానం ఇవ్వడం మంచిది.

-బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ

మొబైల్‌ 9494981000

WhatsApp channel