ఈ వారం వారఫలాలు.. ఆర్థికస్థితి అంతంత మాత్రం, రుణబాధల వల్ల మనశ్శాంతి ఉండదు
Weekly Horoscope Telugu: ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. ఆగస్ట్ 4వ తేదీ నుంచి ఆగస్ట్ 10వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
రాశి ఫలాలు (వార ఫలాలు) 4-08-2024 నుంచి 10-08-2024 వరకు
మాసం: ఆషాఢము (5వ తేదీ నుంచి శ్రావణం) , సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేష రాశి
మేష రాశి వారికి ఈ వారం గ్రహాల సంచారం బాగుంది. పట్టిందల్లా బంగారం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆప్తులతో సంభాషణ ఉల్లాసాన్నిస్తుంది. వస్త్ర ప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. ఆదివారం నాడు పనులు సాగవు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుకుంటారు. ఆరోగ్యం సంతృప్తికరంగా ఉంటుంది. కొత్త విషయాలు తెలుసుకుంటారు. మీ సాయంతో ఒకరికి మంచి జరుగుతుంది. పిల్లల యత్నాలు ఫలిస్తాయి. ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయి. జాగ్రత్తలు వహించండి. సూర్య భగవానుడిని ఆరాధించండి.
వృషభ రాశి
ఈ వారం వారఫలాల ప్రకారం వృషభ రాశికి అనుకూలంగా ఉంది. ఆదాయం కలిసి వస్తుంది. ఇబ్బందులు తొలగుతాయి. అసాధ్యమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. అపరిచితులతో జాగ్రత్త. వాగ్వాదాలకు దిగవద్దు. ఎదుటివారి తీరును గమనించి మెలగండి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. మంచి జరుగుతుంది.
మిథున రాశి
ఆర్ధికంగా ఫర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. విమర్శలకు ధీటుగా స్పందిస్తారు. పనులు చురుకుగా సాగుతాయి. మంగళవారం నాడు అనవసర జోక్యం తగదు. మీ గౌరవానికి భంగం కలుగ కుండా మెలగండి. ఆర్ధిక లావాదేవీల్లో ఏకాగ్రత వహించండి. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఒక ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. మీ బలహీనతలు అదుపులో ఉంచుకోండి. ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించండి. మంచి జరుగుతుంది.
కర్కాటక రాశి
కర్కాటక రాశి వారికి సర్వత్రా అనుకూలమే. సమస్యలు సద్దుమణుగుతాయి. ప్రణాళికలు వేసుకుంటారు. పెద్ద మొత్తం ధన సహాయం తగదు. శుభకార్యానికి యత్నాలు సాగిస్తారు. సంబంధ బాంధవ్యాలు మెరుగుపడుతాయి. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. సోమవారం నాడు కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. మీ విషయాలను వారితో పంచుకోవద్దు. బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. లౌక్యంగా మెలగండి. గృహాలంకరణ పట్ల ఆసక్తి పెంపొందుతుంది. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.
సింహ రాశి
ఆర్థికస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. రుణ సమస్యలతో మనశ్శాంతి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండ టానికి యత్నించండి. ఏ విషయాన్నీ తీవ్రంగా పరిగణించవద్దు. సన్నిహితుల వ్యాఖ్యలు మీ పై సత్ప్రభావం చూపుతాయి. గురు, శుక్ర వారాల్లో పనులు సాగవు. ఖర్చులు అంచనా లను మించుతాయి. సంతానానికి ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. దైవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. అమ్మవారి దేవాలయానికి వెళ్లి ప్రత్యేక పూజలు చేయండి. సత్ఫలితాలు అందుతాయి.
కన్యా రాశి
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. ప్రలోభాలకు లొంగవద్దు. కొత్త సమస్యలు ఎదురవుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. అవసరాలు, చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. శనివారం నాడు పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. పిల్లలకు శుభపరిణామాలునాయి. అనవసర జోక్యం తగదు. కొన్ని విషయాలు చూసీచూడనట్టు వదిలేయండి. ఇష్టదేవతను ఆరాధించండి.
తులా రాశి
కీలక వ్యవహారాలకు సంబంధించిన నిర్ణయాలు తీసుకుంటారు. మీ ఆధ్వర్యంలో పనులు సాగుతాయి. ధనలాభం ఉంది. విలాసాలకు ఖర్చులు ఎక్కువగా పెడతారు. పనులు చురుకుగా సాగుతాయి. ఆదివారం నాడు బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోండి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. గుట్టుగా మెలగండి. మీ సిఫార్సుతో ఒకరికి సదవకాశం లభిస్తుంది. ఉన్నతాధికారులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. మంగళవారం నాడు ఆంజనేయుడికి ప్రదక్షిణలు చేయండి.
ధనుస్సు రాశి
పరిస్థితులు అనుకూలిస్తాయి. లక్ష్యాన్ని సాధిస్తారు. రావలసిన ధనం అందుతుంది. అయినవారికి సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. ప్రణాళికాబద్ధంగా పనులు పూర్తి చేస్తారు. ఒక ఆహ్వానం ఇరకాటానికి గురిచేస్తుంది. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. గురువారం నాడు ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మొండి ధైర్యంతో యత్నాలు సాగిస్తారు. శ్రీ వేంకటేశ్వర స్తోత్రాన్ని పఠించండి.
వృశ్చిక రాశి
కీలక విషయాల పట్ల చాకచక్యంగా వ్యవహరిస్తారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. కష్టానికి గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగ రీత్యా కీలక పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. కాబట్టి కాస్త బాధ్యతగా మెలగాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. వస్త్రప్రాప్తి, వస్తులాభం ఉన్నాయి. నిలిపివేసిన పనులు పూర్తి చేస్తారు. మంగళవారం నాడు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. సన్నిహితులతో సంప్రదింపులు జరుపుతారు. ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించండి. మంచి జరుగుతుంది.
మకర రాశి
ఇతరులతో చాకచక్యంగా వ్యవహరించాలి. ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి. అవకాశాలు చేజారిపోతాయి. మీ కష్టం మరొకరికి కలిసి వస్తుంది. ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. రుణ ఒత్తిళ్లు తలెత్తకుండా జాగ్రత్త పడండి. ఆప్తుల ప్రోత్సాహంతో కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. శనివారం నాడు చేసిన పనులే తిరిగి చేయవలసి వస్తుంది. చిన్న విషయానికే ఆందోళన చెందుతారు. విలువైన వస్తువులు పట్ల అజాగ్రత్త తగదు. శుక్రవారం అమ్మవారి దర్శనం చేసుకోండి. సత్ఫలితాలు అందుతాయి.
కుంభ రాశి
వారఫలాల ప్రకారం ఈ వారం కుంభ రాశి వారికి ఆర్థికంగా బాగున్నా మానసికంగా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. దుబారా ఖర్చులు విపరీతంగా ఉన్నాయి. ఆలోచనల విషయంలో నిలకడగా ఉండవు. నిరాశకు లోనవుతారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. మంగళ, బుధవారాల్లో కీలక వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లకు లొంగవద్దు. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది కలిగిస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియజేయండి. సుబ్రహ్యణ్యస్వామికి పాలాభిషేకం చేయండి. కీలక సమయాల్లో శుభఫలితాలు అందుతాయి.
మీన రాశి
మిశ్రమ ఫలితాలు గోచరిస్తు న్నాయి. కృషి ఫలించకున్నా యత్నించామన్న తృప్తి ఉంటుంది. నూతనోత్సాహంతో యత్నాలు సాగిస్తారు. ఆత్మీయుల ప్రోత్సాహం ఉంటుంది. ఆదాయానికి తగ్గట్టుగా ప్రణాళి కలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. స్థిమితంగా పనులు పూర్తి చేస్తారు. ఆదివారం నాడు కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఇంటి విషయాలపై దృష్టి సారిస్తారు. ఆధ్మాత్మికత పెంపొందుతుంది. అష్టలక్ష్మి స్తోత్రాన్ని పఠించండి.
-చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ