వారఫలాలు.. ఈ వారం పన్నెండు రాశుల వారికి ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకోండి
Weekly Horoscope Telugu : ఈ వారం రాశి ఫలాలు కింది విధంగా ఉన్నాయి. ఆగస్ట్ 11వ తేదీ నుంచి ఆగస్ట్ 17వ తేదీ వరకు రాశి ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. జ్యోతిష శాస్త్ర నిపుణులు చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ వీటిని అందించారు.
రాశి ఫలాలు (వారఫలాలు) 11-08-2024 నుంచి 17-08-2024
మాసం: శ్రావణము, సంవత్సరం: శ్రీ క్రోధి నామ, ఆయనం: దక్షిణాయనం
మేషం
దూరపు బంధువుల నుండి కీలక సమాచారం ఆందుతుంది. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పూర్వపు మిత్రులను కలిసి ఆనందంగా గడుపుతారు. స్వల్ప ధనలాభం పొందుతారు. కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. రాజకీయాల పట్ల ఆకర్షితులవుతారు. సూర్యారాధన శుభప్రదం.
వృషభం
వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తొలగిపోతాయి. ఇంట్లో, వ్యాపార ప్రదేశాల్లో సాంబ్రాణి, త్రిశూల్ పొడితో ధూపం వేయండి. నూతన వస్తువులు, వస్త్రాలు కొను గోలు చేస్తారు. సంఘ సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. ఆంజనేయ స్వామిని ధ్యానించండి.
మిథునం
ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. అనుకోని విధంగా ధన లాభం పొందుతారు. దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వింటారు. ఆకస్మిక ప్రయాణాలు. లాభసాటిగా సాగుతాయి. జిల్లేడు వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. శివాలయాన్ని సందర్శించండి. వీలుంటే స్వామివారికి అభిషేకం చేయించండి.
కర్కాటకం
వారఫలాల ప్రకారం ఈ వారం కర్కాటక రాశి వాళ్ళు చిన్ననాటి మిత్రుల నుంచి శుభ వార్తలు వింటారు. దూర ప్రాంతాల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. సాంకేతిక విద్యలపై ఆసక్తి కనబరుస్తారు. సిద్ధగంధంతో శ్రీ వెంకటేశ్వర స్వామివారికి అర్చన జరిపించండి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. బంధువులలో మీ మాటలకు విలువ పెరుగుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని ధ్యానించండి.
సింహం
సరికొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మీ తండ్రి సమకాలికులను కలుసుకుంటారు. కుటుంబ అవసరాలపైన దృష్టి పెడతారు. ఏదైనా చమత్కారం జరిగి అధిక లాభాలు కలగాలని ఊహాలోకాలలో విహరిస్తారు. బ్యాంక్ వ్యవహారాలలో అప్రమత్తంగా ఉండండి. పరిచయం లేని వ్యక్తులకు అధిక సమాచారం ఇవ్వవద్దు. కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పారాయణం చేయండి. శుభఫలితాలున్నాయి.
కన్య
ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. నూతన విద్యా, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడులకు తగిన లాభాలు పొందుతారు. అరటినార వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. కోటి ఆశలతో కొంతమంది మిమ్మల్ని ఆశ్రయిస్తారు. వారికి మీరు చెయ్యగలిగిన సహాయం చేస్తారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించండి.
తుల
మానసిక వేదనకు ఏమాత్రం తావివ్వరు. మిమ్మల్ని అంచనా వేయడం మీ సన్నిహిత వర్గానికి కూడా కష్టసాధ్యంగా మారుతుంది. సంఘంలో ఆకర్షణ బిందువుగా ఉండాలనుకుంటారు. నిరంతర కృషి సాగిస్తారు. వృత్తి వ్యాపారాలలో స్వల్ప ఒడిదుడుకులు తప్పవు. పారిశ్రామిక రంగాల వారికి బాగుంటుంది. క్రయవిక్రయాలు లాభదాయకంగా ఉంటాయి. లక్ష్మీతామర వత్తులు, అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. లక్ష్మి దేవిని ఆరాధించండి. సత్ఫలితాలు పొందుతారు.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. చేపట్టిన కార్యక్రమాలు సాఫీగా సాగుతాయి. నూతన విద్యా, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. పెట్టుబడులను తగిన లాభాలు పొందుతారు. క్రయవిక్రయాలలో లాభాలు పొందుతారు. సన్మాన, సత్కారాలు కార్యక్రమాలలో పాల్గొంటారు. సంతానం విషయం ప్రత్యేకమైన శ్రద్ధ కనబరుస్తారు. వివిధ రకాల అరిష్టాలు, శత్రుబాధలు పోవడానికి త్రిహలిని ఉపయోగించండి.
ధనుస్సు
కొత్త మిత్రులు పరిచయమై నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. సోదరుల నుండి కీలక సమాచారం అందుకుంటారు. అనుకోని ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. నూతన వస్త్రలాభాలు పొందుతారు. పూజలలో ఆరావళి కుంకుమను ఉపయోగించండి. పోటీ పరీక్షలలో పాల్గొంటారు. మంచి ఫలితాలు సాధిస్తారు. సంగీతం నేర్చుకోవాలన్న ఆకాంక్ష పెరుగుతుంది. విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. ఆంజనేయ స్వామి దేవాలయాన్ని సందర్శించండి.
మకరం
వృత్తి వ్యాపారాలలో ఊహించని మార్పులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు తొలగిపో తాయి. కుటుంబంలో ఒత్తిడి అధికంగా వుంటుంది. చెయ్యాలనుకున్న పనులు చెయ్యలేక నిరుత్సానికి గురవుతారు. అష్టమూలికా తైలం, లక్ష్మీతామర వత్తులతో దీపారాధన చేయండి. కొత్త కార్యక్ర మాలను ప్రారంభిస్తారు. సంఘసేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అమ్మవారిని ధ్యానించండి. అన్నింటా విజయం వరిస్తుంది.
కుంభం
వారఫలాల ప్రకారం కుంభ రాశి వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తాయి. కోరికలు చాలా కష్టంమీద నెరవేరుతాయి. బాధ్యతలు పెరిగినా సమర్ధవంతంగా నిర్వహిస్తారు. సన్నిహితులతో తగాదాలు ఏర్పడవచ్చు, ఓర్పుతో ఉండండి. ఇంట్లో, వ్యాపార ప్రదేశంలో సాంబ్రాణి, దైవికం పొడితో ధూపం వేయండి. నరదృష్టి తొలగిపోతుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. .ఆకస్మిక ప్రయాణాలు లాభిస్తాయి. శివుడిని ఆరాధించండి. మంచి జరుగుతుంది.
మీనం
అనుకోని అతిథుల నుంచి ఆహ్వానాలు అందుకుంటారు. కుటుంబంలో ఏర్పడిన వివాదాలు పరిష్కరించుకుంటారు. ఇంటా బయటా మీదే పై చేయిగా ఉంటుంది. కాంట్రాక్టులు దక్కుతాయి. లీజు, లైసెన్స్, టెండర్లు లభిస్తాయి. మహా పాశుపత కంకణం ధరించండి. ఉద్యోగం లభిస్తుంది. కొత్త పరిచయాల ద్వారా నూతన విషయాలు తెలుసుకుంటారు. పొదుపు పథకాలు పాటిస్తారు. గణపతి దేవాలయాన్ని సందర్శించండి. మంచి జరుగుతుంది.